'శభాష్ నాయుడు' గా కమల్ | Kamal Haasan's film with Shruti Haasan titled 'Sabash Naidu' | Sakshi
Sakshi News home page

'శభాష్ నాయుడు' గా కమల్

Published Fri, Apr 29 2016 7:39 PM | Last Updated on Sun, Sep 3 2017 11:03 PM

'శభాష్ నాయుడు' గా కమల్

'శభాష్ నాయుడు' గా కమల్

చెన్నై : వైవిధ్యభరిత చిత్రాలకు మారు పేరుగా నిలిచే విశ్వనటుడు కమల్ హాసన్ త్వరలో 'శభాష్ నాయుడు'గా రానున్నారు. ఏక కాలంలో మూడు భాషలలో నిర్మాణం కానున్న ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఉదయం చెన్నైలో జరిగింది. తమిళం, తెలుగు భాషలలో శభాష్‌ నాయుడు గాను, హిందీలో 'శభాష్ కుండు' గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కమలహాసన్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఇంటర్‌నేషనల్ పతాకంపై నిర్మించి, కథా నాయకుడిగా నటించనున్నారు.

ఈ చిత్ర నిర్మాణంలో లైకా ప్రొడక్షన్ సంస్థ భాగస్వామ్యం కావడం విశేషం. దీనికి ప్రముఖ మలయాళ దర్శకుడు టి.కె.రాజీవ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా చిత్రానికి తమిళ టైటిల్‌తో పాటు సంగీతాన్ని అందిస్తున్నారు. కమల్.. కుమార్తె శ్రుతిహాసన్తో కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇది. రమ్యకృష్ణ, బ్రహ్మానందం తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు.

ఇది హ్యూమరస్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిస్తున్న చిత్రం అని కమల్ హాసన్ వెల్లడించారు. అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌లో మే నెల 14 నుంచి చిత్ర షూటింగ్ ప్రారంభించనున్నట్టు.. జూన్, జూలై నెలల్లో చిత్ర షూటింగ్‌ను పూర్తి చేయనున్నట్లు కమల్ తెలిపారు. దశావతారం చిత్రంలోని పది పాత్రల్లో అందరినీ నవ్విస్తూ ఉండే బలరామ్‌ నాయుడు పాత్ర విస్తరణే చిత్ర కథ అని, శ్రుతి ఇందులో తనకు కూతురిగా నటిస్తున్నారని ఆయన వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement