మంగళవారం చాలా హాట్! | Kamal Haasan starts shoot for 'Sabash Naidu' in Los Angeles | Sakshi
Sakshi News home page

మంగళవారం చాలా హాట్!

Published Tue, Jun 21 2016 10:55 PM | Last Updated on Mon, Sep 4 2017 3:02 AM

మంగళవారం చాలా హాట్!

మంగళవారం చాలా హాట్!

‘‘ఈరోజు కాలు బయట పెడితే మీరు మళ్లీ ఇంటి లోపల కాలు పెట్టడం కష్టం. అందుకే ఎవరూ బయటికి రావద్దు’’ అని వాతావరణ శాఖ హెచ్చరిస్తే, ఇంటి నుంచి బయటకు వచ్చే సాహసం ఎవరూ చేయరు. కానీ, బయట బోల్డన్ని పనులు ఉన్నవాళ్లు మాత్రం రిస్క్ తీసుకుంటారు. ‘శభాష్ నాయుడు’ చిత్రబృందం అలానే చేసింది. కమల్‌హాసన్, బ్రహ్మానందం, శ్రుతీహాసన్ ముఖ్య తారలుగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ లాస్ ఏంజిల్స్‌లో జరుగుతోంది.
 
 సంవత్సరం మొత్తంలో ఈ మంగళవారం ఉన్నంత హాట్‌గా మరో రోజు ఉండదట. ఆ వేడి తట్టుకోవడం చాలా కష్టం అట. ‘‘రెండు రోజుల క్రితమే వాతావరణం గురించి అక్కడి వాళ్లు మాట్లాడుకుంటుంటే తెలిసింది. లాస్ ఏంజిల్స్ వాసులందరూ మంగళవారం ఇన్‌డోర్ లోనే ఉండాలని ప్రకటించారు. కానీ, మాకు తప్పుతుందా? మేం అవుట్‌డోర్ షూటింగ్ చేయాల్సి వచ్చింది’’ అని శ్రుతీహాసన్ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement