శభాష్ నాయుడును నేనే హ్యాండిల్ చేస్తున్నా
శభాష్ నాయుడు చిత్రానికి తానే దర్శకత్వం వహిస్తున్నట్లు ఆ చిత్ర కథానాయకుడు, నిర్మాత కమలహాసన్ స్పష్టం చేశారు. తమిళం, తెలుగు, హిందీ భాషలలో తెరకెక్కుతున్న చిత్రం శభాష్‌నాయుడు. ఇందులో విశ్వనాయకుడు కమలహాసన్, ఆయన కూతురు శ్రుతీహాసన్ తొలిసారిగా కలిసి నటిస్తున్నారు. రీల్ లైఫ్‌లోనూ వారు తoడ్రీకూతుళ్లుగా నటించడం విశేషం.
రమ్యకృష్ణ, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీత జ్ఞాని ఇళయరాజా సంగీత బాణీలు కడుతున్నారు. కమలహాసన్ చిత్ర నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషన ల్ లైకా ఫిలింస్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి మలయాళ ప్రముఖ దర్శకుడు రాజీవ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రం ఇటీవలే అమెరికాలో ప్రారంభం అయ్యింది. పలు ఆటంకాలను అధిగమించి చిత్ర యూనిట్ అమెరికా చేరుకున్నట్లు కమల్ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. కాగా నటుడిగా నిర్మాతగా బాధ్యతల్ని మోస్తున్న విశ్వనటుడికిప్పుడు అనివార్య కారణాల వల్ల అదనంగా దర్శకత్వం బాధ్యత భుజాన పడింది. ఈ విషయాన్ని కమలహాసన్ స్వయంగా అంగీకరించారు.
ఆయన తెలుపుతూ శభాష్‌నాయుడు చిత్రానికి దర్శకత్వ బాధ్యతల్ని తాను నిర్వహిస్తున్నానన్నారు.క ారణం అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో చిత్ర షూటింగ్ ప్రారంభమైన నాలుగో రోజునే దర్శకుడు రాజీవ్‌కుమార్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. ఆయన లైమ్ అనే వ్యాధికి గురయ్యారని చెప్పారు. ఇది ఐరోపా, ఉత్తర అమెరికా ప్రాంతాలలో సోకే అరుదైన వ్యాధి అని తెలిపారు. దీంతో దర్శకుడు లాస్‌ఏంజెల్స్‌లోని ఆస్పత్రిలో ఉన్నత వైద్యం పొందుతున్నారని చెప్పారు.
ఆయనను చిత్ర యూనిట్‌కు చెందిన సభ్యుడొకరు 24 నాలుగు గంటలు కనిపెట్టుకుని సేవలు అందించేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దర్శకుడు రాజీవ్‌కుమార్ కోలుకుని తిరిగొచ్చే వరకూ శభాష్‌నాయుడు చిత్ర దర్శకత్వ బాధ్యతల్ని తానే నిర్వహిస్తానని అన్నారు. చిత్రాన్ని జూలై నెల చివరికీ లేదా ఆగస్టు నెల తొలి వారానికల్లా పూర్తి చేయడానికి ప్రణాళికను చేసినట్లు కమల్ పేర్కొన్నారు. ఈ విశ్వనటుడికి దర్శకత్వం కొత్తేమీ కాదు కదా. ఇంతకు ముందు విరుమాండి, హేరామ్, విశ్వరూపం మొదలగు పలు విజయవంతమైన చిత్రాలను కమల్ తెరకెక్కించిన విషయం తెలిసిందే.