చెన్నై: రామేశ్వరం కెఫే బాంబు పేలుడు ఘటనను తమిళనాడు ప్రజలతో ముడిపెడుతూ కేంద్రమంత్రి శోభా కరంద్లాజే చేసిన వ్యాఖ్యలు గతంలో వివాదాస్పదం అయ్యాయి. ఈ ఏడాది మార్చి 1న బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పేలుడు ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి.
అయితే.. రామేశ్వరం కెఫే బాంబు పేలుడులో నిందితుడు మల్నాడు వాసి అని, గతంలో తమిళనాడులోని కృష్ణగిరి అటవీ ప్రాంతంలో ఆయుదాల వినియోగంపై శిక్షణ తీసుకున్నాడంటూ కేంద్రమంత్రి శోభా కరంద్లాజే అన్నారు. దీంతో కేంద్ర మంత్రిపై మధురైలో కేసు నమోదు అయింది.
తాజగా ఆమె తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెబుతూ మద్రాస్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇక.. గతంలోనూ సోషల్ మీడియా వేదికగా ఆమె క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను న్యాయమూర్తి జస్టిస్ జీ. జయచంద్రన్ సెప్టెంబర్ 5 తేదీకి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment