తమిళులకు కేంద్రమంత్రి క్షమాపణలు | Union Minister Shobha Karandlaje Apologises For Tamil Nadu Remark | Sakshi
Sakshi News home page

తమిళులకు కేంద్రమంత్రి క్షమాపణలు

Mar 20 2024 12:50 PM | Updated on Mar 20 2024 1:26 PM

Union Minister Shobha Karandlaje Apologises For Tamil Nadu Remark - Sakshi

సాక్షి, చెన్నై:  తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్రమంత్రి శోభా కరంద్లాజే క్షమాపణలు చెప్పారు. రామేశ్వరం కెఫెలో జరిగిన పేలుడు ఘటనలో నిందితుడి ప్రాంతం గురించి శోభా కరంద్లాజే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు వివాదం కావడంతో తమిళులుకు ఆమె క్షమాపణలు చెప్తూ ఎక్స్‌.కామ్‌లో పోస్ట్‌ చేశారు. 

‘సోదరులు, సోదరీమణులకు నా క్షమాపణ. కృష్ణగిరి అడవుల్లో శిక్షణ పొంది, రామేశ్వరం కేఫ్ పేలుడుతో ముడిపడి ఉన్న నిందితుడి గురించే మాట్లాడాను. అయినప్పటికీ నా మాటలు మీకు బాధ కలిగించాయని నేను భావిస్తున్నాను. అందుకు క్షమాపణలు కోరుతున్నాను. నేను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను’ అని కరంద్లాజే ఎక్స్‌.కామ్‌  పోస్ట్‌లో పేర్కొన్నారు. 

కరంద్లాజే గతంలో ఏం వ్యాఖ్యలు చేశారంటే?
రామేశ్వరం కెఫే బాంబు పేలుడులో నిందితుడు మల్నాడు వాసి అని, గతంలో తమిళనాడులోని కృష్ణగిరి అటవీ ప్రాంతంలో ఆయుదాల వినియోగంపై శిక్షణ తీసుకున్నాడంటూ విచారణలో తేలింది. 

దీంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై బీజేపీ మహిళా నేత, కేంద్రమంత్రి కరంద్లాజే విమర్శలు చేశారు. సీఎం సంఘ విద్రోహ కార్యకాలపాల్ని ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. పలు సున్నితమైన అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. శోభా రెచ్చగొట్టే వ్యాఖ్యలపై సీఎం ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మీకు ఎలాంటి అధికారం లేదు
‘శోభా మీ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. రామేశ్వరం కెఫే బ్లాస్ట్‌ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ చర్యలు తీసుకోవాలి. అలాంటి వాదనలు చేసేందుకు మీకు ఎలాంటి అధికారం లేదని అన్నారు. శోభాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ తరుణంలో శోభా క్షమాపణలు చెబుతూ పోస్ట్‌ పెట్టడంపై వివాదం సద్దు మణిగింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement