
సాక్షి, చెన్నై: ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్ తమిళనాడు పర్యటనకు సర్వం సిద్ధమైంది. 21న రామేశ్వరం నుంచి మదురై జిల్లాలోని ఒత్తకడై వరకూ పర్యటించనున్న కమల్ అదే రోజు పార్టీ పేరు, సిద్ధాంతాలను ప్రకటించడంతో పాటు జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ నెల 21న ఉదయం దివంగత రాష్ట్రపతి కలాం నివాసం నుంచి కమల్ పర్యటన మొదలుకానుంది. ఉదయం కలాం పాఠశాలను సందర్శించాక జాలర్ల సంఘాల నేతలతో కమల్ మాట్లాడతారు. రామనాథపురం, పరమకుడి జంక్షన్, మానామదురైలలో జరిగే సభలలో ప్రసంగిస్తారు.