బెంగళూరులోని రాజాజీనగర్‌లోని రామేశ్వరం కేఫ్‌లో భారీ పేలుడు సంభవించి, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై సమీక్షించేందుకు నేడు(శనివారం) మఖ్యమంత్రి సిద్ధరామయ్య సారధ్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది.
రామేశ్వరం కేఫ్‌లో గుర్తు తెలియని బ్యాగ్‌ను ఉంచారని, ఆ తర్వాత కొంతసేపటికి భారీ పేలుడు సంభవించిందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ ఘటనలో గాయపడినవారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, కర్ణాటక పోలీసుల ఫోరెన్సిక్ బృందం ఈ ఉదంతంపై దర్యాప్తు చేపట్టింది. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు(శనివారం) మధ్యాహ్నం ఒంటిగంటకు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనుంది. ముఖ్యమంత్రి సారధ్యంలో జరిగే ఈ సమావేశానికి పలువురు మంత్రులు, అధికారులు హాజరుకానున్నారు.
బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు ఘటనపై పోలీసులు ఐపీసీలోని సెక్షన్‌లు 307, 471, యూఏపీఏలోని 16, 18, 38 సెక్షన్‌ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పేలుడు పదార్థాల చట్టంలోని మూడు, నాలుగు సెక్షన్లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. పేలుడు జరిగిన ప్రదేశంలో దర్యాప్తు బృందం తనిఖీలు చేస్తోంది.
ఈ ఘటనపై కర్ణాటక హోంమంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ మాట్లాడుతూ ‘ఈ కేసు దర్యాప్తు కోసం మేము పలు బృందాలను ఏర్పాటు చేశాం. సీసీటీవీ ఫుటేజీల నుంచి ఆధారాలు సేకరించాం. పేలుడు సంభవించిన సమయంలో బీఎంటీసీ బస్సు ఈ మార్గంలో వెళుతూ కనిపించింది. అనుమానితుడు ఆ బస్సులో వచ్చినట్లు మాకు సమాచారం ఉంది. నిందితులను వీలైనంత త్వరలో పట్టుకుంటాం. పేలుడు కోసం టైమర్‌ని ఉపయోగించారు. దీనిపై ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం విచారణ జరుపుతోంది’ అని తెలిపారు.
#WATCH | A team of FSL, Bomb Disposal Squad and Dog Squad conducts an investigation at the explosion site at The Rameshwaram Cafe in Bengaluru’s Whitefield area. pic.twitter.com/iJf7rVvcwN
— ANI (@ANI) March 2, 2024
Comments
Please login to add a commentAdd a comment