Special Trains: ఏపీ మీదగా ప్రత్యేక రైళ్లు.. వివరాలివే | Special Trains Between Secunderabad And Rameshwaram | Sakshi
Sakshi News home page

Special Trains: ఏపీ మీదగా ప్రత్యేక రైళ్లు.. వివరాలివే

Published Fri, Mar 18 2022 9:26 AM | Last Updated on Fri, Mar 18 2022 9:26 AM

Special Trains Between Secunderabad And Rameshwaram - Sakshi

లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్‌)/రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలోని సికింద్రాబాద్‌–రామేశ్వరం–సికింద్రాబాద్‌ వయా గుంటూరు డివిజన్‌ మీదుగా పలు రైళ్లు కేటాయించడం జరిగిందని రైల్వే డివిజన్‌ సీనియర్‌ డీసీఎం నరేంద్రవర్మ గురువారం వెల్లడించారు.

చదవండి: పెగసస్‌ స్పైవేర్‌ను కొన్న చంద్రబాబు సర్కార్‌ 

సికింద్రాబాద్‌–రామేశ్వరం (07685) ప్రత్యేక రైలు మార్చి 22, 29, ఏప్రిల్‌ 5, 12, 19, 26, మే 3, 10, 17, 24, 31, జూన్‌ 7, 14, 21, 28, జూలై 5, 12, 19, 26 తేదీలలో నడుస్తుంది. రామేశ్వరం–సికింద్రాబాద్‌ (07686) ప్రత్యేకరైలు మార్చి 24, 31, ఏప్రిల్‌ 7, 14, 21, 28, మే 5, 12, 29, 26, జూన్‌ నెలలో 2, 9, 16, 23, 30, జూలై 7, 14, 21, 28 తేదీలలో నడుస్తుందని తెలిపారు.

వెయిటింగ్‌ లిస్ట్‌ ప్రయాణికుల రద్దీని తగ్గించే చర్యల్లో భాగంగా గుంటూరు–విశాఖపట్నం మధ్య నడిచే సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైలుకు తాత్కాలికంగా అదనపు ఏసీ చైర్‌ కార్‌ కోచ్‌ను జత చేసి నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. గుంటూరు – విశాఖపట్నం (17239/17240) రైలు ఈ నెల 19 నుంచి ఏప్రిల్‌ 2 వరకు అదనపు ఏసీ కోచ్‌తో నడవనున్నట్లు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement