
ఉత్తర రాజగోపురంపై ప్రదర్శిస్తున్న రామాయణ చిత్రాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ గోపురాలు మరింత ఆధ్యాత్మికతను సంతరించుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఉత్తర రాజగోపురంపై రామాయణానికి సంబంధించిన చిత్రాలపై ఆడియో పవర్ ప్రొజెక్టర్ ద్వారా శుక్రవారం రాత్రి ట్రయల్ నిర్వహించారు. రామాయణం, ఇతర ఇతిహాసాలను ప్రొజెక్టర్ ద్వారా తమిళనాడులోని రామేశ్వరం ఆలయంలో మాత్రమే ప్రదర్శిస్తున్నట్లు వీటిని ఏర్పాటు చేస్తున్న సంస్థ ప్రతినిధులు తెలిపారు.
భక్తులు ఉత్తర రాజగోపురం వైపు ఉన్న పచ్చికలో కూర్చొని కట్టడాలను వీక్షించే అవకాశం ఉన్నందున్న.. శ్రీనృసింహస్వామి, ప్రహ్లాద చరిత్రను కూడా ప్రదర్శించేందుకు సన్నాహాలు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును వైటీడీఏ అధికారులు ఖరారు చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment