Projector
-
‘యాదాద్రి’ గోపురంపై రామాయణ గాథ
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ గోపురాలు మరింత ఆధ్యాత్మికతను సంతరించుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఉత్తర రాజగోపురంపై రామాయణానికి సంబంధించిన చిత్రాలపై ఆడియో పవర్ ప్రొజెక్టర్ ద్వారా శుక్రవారం రాత్రి ట్రయల్ నిర్వహించారు. రామాయణం, ఇతర ఇతిహాసాలను ప్రొజెక్టర్ ద్వారా తమిళనాడులోని రామేశ్వరం ఆలయంలో మాత్రమే ప్రదర్శిస్తున్నట్లు వీటిని ఏర్పాటు చేస్తున్న సంస్థ ప్రతినిధులు తెలిపారు. భక్తులు ఉత్తర రాజగోపురం వైపు ఉన్న పచ్చికలో కూర్చొని కట్టడాలను వీక్షించే అవకాశం ఉన్నందున్న.. శ్రీనృసింహస్వామి, ప్రహ్లాద చరిత్రను కూడా ప్రదర్శించేందుకు సన్నాహాలు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును వైటీడీఏ అధికారులు ఖరారు చేయాల్సి ఉంది. -
అరచేతిలో ఇమిడే ప్రొజెక్టర్
టీవీ రిమోట్ గురుంచి జరిగే గొడలు మనం ప్రతి ఇంట్లో చూస్తూనే ఉంటాం. నచ్చిన ప్రోగ్రామ్‌ను చూసేందుకు పిల్లలతో పాటు పెద్దలు కూడా పోటీ పడుతూ ఉంటారు. అయితే స్మార్ట్ఫోన్లు వచ్చాక ఈ గొడవ తీరిందని కొందరు అంటారు గానీ, పెద్ద టీవీపై సినిమా వీడియోలు చూసేందుకు, ఆరు అంగుకాల మొబైల్ స్క్రీన్‌పై చూసేందుకు చాలా తేడా ఉంది. అయితే... గదికో టెలివిజన్ పెట్టుకోవాలా? అని అడగకండి. ఎంచక్కా పైన ఫాటోలో ఉన్న 'జెన్‌బీమ్ లట్టె' పోర్టబుల్ ప్రాజెక్టర్‌ను తెచ్చేసుకుంటే సరిపోతుందని అంటోంది తైవాన్ స్మార్ట్ ఫోన్ కంపెనీ అసుస్.(చదవండి: ఇక టెలివిజనూ.. వైర్లెస్) అరచేతిలో ఇమిడిపోయేంత సైజు మాత్రమే ఉండే ఈ ప్రొజెక్టర్ తో గోడపై 120 అంగుళాల సైజున్న బొమ్మ చూడవచ్చు. పిక్చర్ క్వాలిటీ 720 పిక్సెల్ వరకూ ఉంటుంది. ఇంటి లోపల, బయట కూడా యూట్యూబ్ వీడియోలు, వీడియో గేమ్స్ ఆడేందుకు అనువైంది ఈ జెన్‌బీమ్ లట్టె. అవసరమైతే కిక్స్టాండ్పై లేదా ట్రైపాడ్‌పై కూడా ఏర్పాటు చేసుకుని నచ్చిన సినిమాను ఎంచక్కా చూసేయవచ్చు. ప్రొజెక్టర్ ద్వారా వచ్చే వెలుగు ఓ మోస్తరుగా (300 లూమెన్స్) ఉంటుంది. గదిలో కిటికీలన్నీ మూసుకుని, లైట్లు ఆర్పేసుకుంటే బొమ్మ స్పష్టంగా కనిపిస్తుందని కంపెనీ చెబుతోంది. ఆడియో కోసం ఇందులోనే పది వాట్ల స్పీకర్‌ను ఏర్పాటు చేశారు. సినిమాలు, వీడియోలు, సంగీతం కోసం వేర్వేరుగా ఆడియో సెట్టింగ్స్ ఉన్నాయి. 6 వేల ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఈ డివైస్‌ను ఏకధాటిగా 3 గంటల పాటు వాడొచ్చు. ఈ ఏడాది కన్స్యూమర్ ఎలక్రానిక్స్, టెక్నాలజీ షో (సీఈఎస్ 2021)లో తొలిసారి ప్రదర్శించిన 'జెన్‌బీమ్ లట్టె' ధర తేలుసుకోవాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. -
పాఠ్యాంశాలకు డిజిటల్ బ్రేక్
ప్రొజెక్టర్‌తో రెగ్యులర్ క్లాసులు ► 6నుంచి 9వ తరగతుల విద్యార్థులకు ఇబ్బందులు ► కామన్ టైంటేబుల్తో కొంచెం మేలు నేరడిగొండ : ‘ముందచ్చిన చెవులకంటే వెనకొచ్చిన కొమ్ములే వాడి’ అన్న చందంగా డిజిటల్ తరగతులు మారారుు. దీంతో రెగ్యూలర్ పాఠ్యాంశాలు పెండింగ్‌లో పడిపోతాయా? ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డిజిటల్ ప్రక్రియతో ఉపాధ్యాయులు డిజిటల్ పైనే పూర్తిగా దృష్టి సారిస్తున్నారు. దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పాడింది. గతనెల 16వ తేదిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలల్లో నూతన విద్యా విధానాన్ని ప్రారంభించింది. విద్యార్థులకు ప్రొజెక్టర్ ద్వారా చదవడం, చూడగలగడం (రీడ్ ఓన్లీ టర్మినల్)తో పాటు హార్డ్ డిస్క్ ద్వారా బోధన అందిస్తుంది. అరుుతే ఈ విధానంలో ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి వరకు విద్యా శాఖ ప్రణాళిక ప్రకారం రోజువారిగా పాఠశాలల్లో ఉదయం రెండు, సాయంత్రం రెండు తరగతులను 20 నిమిషాల పాటు ఈ రెండు ప్రక్రియల ద్వారా విద్యాబోధనకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పది రోజులుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియతోతో ప్రభుత్వ పాఠశాలల సమయపాలనకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రొజెక్టర్ విద్యా విధానానికి మధ్య వ్యత్యాసం ఏర్పడింది. పాత విద్యా ప్రణాళికకు స్వస్తీ ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు పూర్తవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఏడాది పాటు విద్య ప్రణాళికను ఇదివరకే రూపొందించుకొని బోధన కొనసాగిస్తున్నారు. ఇంతలో ప్రొజెక్టర్ విధానం ద్వారా విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన నూతన ప్రక్రియ ఉపాధ్యాయులకు, విద్యార్థులకు తలనొప్పిగా మారిందని పలువురు వాపోతున్నారు. వార్షిక పరీక్షలు ఓవైపు, సిలబస్ పూర్తికాకపోవడంతో మరోవైపు ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. క్రమం తప్పకుండా సిలబస్ పూర్తి చేసుకునేందుకు తరగతి గదుల్లోనే ఉపాధ్యాయులు ఉంటున్నారు. ఇంతలో ఈ డిజిటల్ విద్యా విధానంతో పది రోజులుగా సిలబస్ ముందుకు సాగడం లేదు. సామాన్య, గణితం, ఆంగ్ల పాఠాలు ఉన్న సమయంలోనే ఈ ప్రొజెక్టర్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థుల సిలబస్‌కు అడ్డంకులు ఏర్పడుతున్నారుు. ఇప్పటికై నా ప్రభుత్వం ఆరు ఉంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు సిలబస్ పూర్తయ్యే వరకు వారికి విద్యాబోధనకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండాలని, ఈ ప్రొజెక్టర్ ద్వారా విద్యా బోధనపై పక్కా ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. కామన్ టైమ్‌టేబుల్ రూపొందించాలి.. పాఠశాలల్లో డిజిటల్ విద్యా విధానంతో విద్యార్థులకు మేలు కలుగుతున్నా, కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. ఈ విధానంలో కొద్దిపాటి మార్పులు చేస్తే అందరికీ ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ప్రసారం అయ్యే ఆర్‌ఓటీ ద్వారా అందించే విద్యా బోధనకు పాఠశాలల సమయ పాలనకు కొద్దిపాటి వ్యత్యాసాలు ఉన్నారుు. దీంతో ఉపాధ్యాయుల నుంచి సిలబస్ విషయంలో ఫిర్యాదులు వస్తున్నాయని పలువురు ప్రధానోపాధ్యాయులు చర్చించుకుంటున్నారు.