sri laxmi narasimha swamy
-
రూ.10 కోట్లతో 100 ఆలయాలు
నాతవరం: ఎంతో చరిత్ర కలిగిన ఈరుడుకొండపై శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయం నిర్మాణం చేయడం ఆనందాయకమని ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ అన్నారు. నాతవరం సమీపంలో ఉన్న ఈరుడికొండపై రూ.3కోట్లతో శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయం నిర్మించేందుకు శుక్రవారం కశింకోట శ్రీమారుతీరామానుజచార్యులు అధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్రబ్యాంకు చైర్మన్ చింతకాయల అనిత సన్యాసిపాత్రుడు దంపతులు, డీసీసీబీ డైరెక్టరు అంకంరెడ్డి జమీలు పార్వతి దంపతులు, అన్ని వర్గాలకు చెందిన 27 దంపతులతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ నియోజకవర్గం నాలుగు మండలాల్లో రూ.10కోట్లతో సుమారుగా 100 ఆలయాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. ఆలయానికి రూ.10 లక్షల వరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. ప్రతిపాదనలు పంపించిన ఆలయాలకు గ్రామాల్లో ఆ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారని తెలిపారు. మరో సింహచలం కానున్న నాతవరం ఉమ్మడి జిల్లాలో ఉన్న శ్రీనృసింహస్వామి ఆలయం కారణంగా సింహాచలానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందని డీసీసీబీ చైర్మన్ చింతకాయల అనిత సన్యాసిపాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లాలో నిర్మించనున్న శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంతో నాతవరం గ్రామానికి ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నారు. ఆలయాల నిర్మాణంతో ప్రజల్లో భక్తిభావం పెరిగి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారన్నారు. నాతవరం గ్రామానికి సమీపంలో ఎత్తయిన ఈరుడి కొండపై 500 ఏళ్లు పైగా చెట్టు పొదలో ఉన్న శ్రీలక్ష్మీనృసింహస్వామి రాతి విగ్రహాలకు గ్రామస్తులు పూజలు చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ ప్రాంతంలో పురాతన రాతి విగ్రహాలు బయటపడ్డాయి. వాటిని పరిశీలించిన డీసీసీబీ డైరెక్టరు అంకంరెడ్డి జమీలు ఈ కొండపై ఆలయం నిర్మాణం చేయాలని గ్రామస్తులతో కలిసి నిర్ణయించారు. ఎత్తయిన కొండపై రూ.15లక్షలతో ఎకరం స్థలాన్ని చదును చేయించారు. కొండ చుట్టూ ఘాట్‌రోడ్డు ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో రూ.3 కోట్లతోశ్రీలక్ష్మీనృసింహస్వామి ప్రధాన ఆలయంతో పాటు కొండచుట్టూ తొమ్మిది ఆలయాలు నిర్మించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, జెడ్పీటీసీ అప్పలనర్స, వైస్ ఎంపీపీ సునీల్, ఎంపీడీవో నాగలక్ష్మి, నాతవరం సర్పంచ్ గొలగాని రాణి, ఎంపీటీసీ రేణుక తదితరులు పాల్గొన్నారు. -
భక్త జనసంద్రంగా యాదగిరిగుట్ట ఆలయం
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయం భక్త జనసంద్రంగా మారింది. వేసవి సెలవులు పూర్తి అవుతుండటంతో పాటు ఆదివారం సెలవు రోజు కావడంతో జంట నగరాలతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు వివిధ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో శ్రీస్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారి ధర్మ దర్శనానికి నాలుగున్నర గంటల సమయం, శీఘ్ర, అతి శీఘ్రదర్శనాలకు సుమారు రెండు గంటల సమయం పట్టింది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని 40 వేలకు పైగా భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. రికార్డు స్థాయిలో ఆదాయం.. ప్రధానాలయం ప్రారంభమైన నాటి నుంచి ఆదివా రం రికార్డు స్థాయిలో పూజలతో రూ.50,89,482 ఆ దాయం లభించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో ప్రధాన బుకింగ్ ద్వారా రూ.4,77,700, వీఐపీ దర్శనం ద్వారా రూ.6,90,000, యాదరుషి నిలయం ద్వారా రూ.1,20,680, ప్రసాద విక్రయం ద్వారా రూ.18,27,900, కొండపైకి వాహనాల ప్రవే శంతో రూ.4,50,000, సువర్ణ పుష్పార్చనతో రూ.1,66,800, పాతగుట్ట ఆలయంతో రూ.75,500, కల్యాణ కట్టతో రూ.76,600, శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలతో రూ.2,00,000 వచ్చినట్లు వివరించారు. -
యాదాద్రిలో హైకోర్టు చీఫ్ జస్టిస్ పూజలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ఆదివారం దర్శించుకున్నారు. ప్రధానాలయంలోని స్వయంభూలను సతీసమేతంగా దర్శించుకొని పూజలు నిర్వహించారు. చీఫ్ జస్టిస్ దంపతులకు ఆలయ ఆచార్యులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. ముఖ మండపంలో వారికి వేద ఆశీర్వచనం చేశారు. ఇన్చార్జ్ ఈఓ రామకృష్ణారావు చీఫ్ జస్టిస్‌కు లడ్డూ ప్రసాదం అందజేశారు. అంతకుముందు కలెక్టర్ పమేలా సత్పతి కొండపై అతిథి గృహం వద్ద చీఫ్ జస్టిస్‌కు స్వాగతం పలికారు. -
యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఇంటర్, పదోతరగతి పరీక్షలు పూర్తి కావడంతో భక్తులు ఒక్క సారిగా పెరిగారు. 40వేలకు పైగా భక్తులు స్వామి, అమ్మవారిని దర్శించుకోవడంతో ధర్మ దర్శనానికే 4 గంటల సమయం పట్టిం దని భక్తులు తెలిపారు. వివిధ పూజల ద్వారా స్వామి వారికి రూ.45,50,079 ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు వెల్లడించారు. మరోవైపు స్వామివారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మాధవి దేవి కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం దర్శిం చుకున్నారు. -
యాదాద్రి ఆలయం అద్భుతం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయం అద్భుతంగా ఉందని కంచి కామకోటి మఠం పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. ఆయన గురువారం సాయంత్రం పంచనారసింహుల క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ఆచార్యులు శంకర విజయేంద్ర సరస్వ తి స్వామీజీకి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వయంభువులు, బంగారు ప్రతిష్ట మూర్తులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముఖ మండపంలో ఆలయ ఆచార్యులతో పండిత గోష్టి నిర్వహించారు. అధికారులు, సిబ్బందితో ఆలయ నిర్మాణ విశేషాలపై చర్చించారు. -
రికార్డు స్థాయిలో యాదాద్రీశుడి ఆదాయం
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ప్రధానాలయం మార్చి 28న ప్రారంభమైనప్పటికీ 29వ తేదీ నుంచి భక్తులకు శ్రీస్వామి వారి దర్శనం కల్పించారు. అదే రోజు ఆలయంలో హుండీలను ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు హుండీల్లో సమర్పించుకున్న నగదు, నగలను మంగళవారం ప్రధానాలయంలోని ప్రథమ ప్రాకారంలో ఈవో గీతారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అధికారులు, సిబ్బంది లెక్కించారు. ఈ లెక్కింపులో రూ.1,87,17,937 నగదు సమకూరింది. ఇక మిశ్రమ బంగారం 62 గ్రాములు, మిశ్రమ వెండి 3కిలోల 550 గ్రాములు వచ్చింది. వీటితో పాటు విదేశీ కరెన్సీ డాలర్లు, రియాల్స్ వచ్చాయి. ఇందులో ఆస్ట్రేలియాకు చెందిన 150 డాలర్లు, అమెరికాకు చెందిన 903 డాలర్లు, సౌదీ అరేబియాకు చెందిన 102 రియాల్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన 10 దీర్హమ్స్, ఖతార్‌కు చెందిన ఒక రియాల్, కెనడాకు చెందిన 25 డాలర్లు, ఇంగ్లాండ్‌కు చెందిన 50 పౌండ్లు వచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. -
సువర్ణ శోభిత యాదాద్రి
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం పసిడి వర్ణంలో కనువిందు చేయనుంది. ఈ మేరకు వైటీడీఏ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయంలో గర్భాలయ ద్వారం, ఆళ్వార్ మండపంలో ధ్వజస్తంభానికి బంగారు తొడుగులు అమర్చారు. త్రితల, పంచతల, సప్త తల రాజగోపురాలపై స్వర్ణ కల శాలను బిగించారు. ఇక రాత్రి సమయంలో ఆలయమంతా బంగారు వర్ణంలో ధగధగ మెరిసేలా దీపాలు ఏర్పాటు చేశారు. 16 కిలోల బంగారంతో ఆగమశాస్త్రం ప్రకారం అద్భుతంగా గర్భాలయ ద్వారాలను తీర్చిదిద్దారు. 36 రేకుల కమలాలు, 8 తామర పువ్వులను ఈ ద్వారంలో అమర్చారు. దీనికి రెండు వైపులా 14 నృసింహస్వామి ఆకృతులున్నాయి. మధ్యలో గంటలు, పైభాగంలో శంకు, చక్ర, నామాలను సైతం బంగారంతో తీర్చిదిద్దారు. బంగారు తొడుగులతో చేసిన ఈ డిజైన్ ఆలయంలో ఉండే స్థలాన్ని శక్తివంతం చేస్తుందని స్తపతులు, ఆచార్యులు పేర్కొన్నారు. శ్రీచక్ర యంత్రం వలే విశ్వశక్తిని సూచిస్తుందన్నారు. రూ.9 కోట్లతో పనులు నల్లని కృష్ణశిలకు అనుగుణంగా విద్యుత్ దీపాలు ఉండాలనే యోచనతో రూ.9 కోట్లతో పనులు చేస్తున్నారు. ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి, ఆలయ ఈఈ రామారావు ఆధ్వర్యంలో రష్యా, జర్మనీ కంపెనీల సహకారంతో బెంగళూరుకు చెందిన లైటింగ్ టెక్నాలజీ ఏజెన్సీ లైటింగ్ పనులు చేపట్టింది. ఆలయం లోపల, బయట గంటలు, తామరపువ్వు, బోలాడ్, ట్రైప్యాడ్స్, ఫ్లడ్ లైట్లను బిగించారు. ఇవి రాత్రి సమయంలో బంగారు వర్ణంలో కనువిందు చేస్తాయి. భక్తులు వెళ్లే క్యూలైన్లు సైతం స్వర్ణమయంగా ఉంటాయి. ఇండోర్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన అల్యూమినియం, ఇత్తడి మిశ్రమంతో చేసిన ఈ క్యూలైన్లను తూర్పు రాజగోపురం ముందు భాగంలో ఏర్పాటు చేశారు. -
యాదాద్రికి శాంతా బయోటెక్నిక్స్ రూ.1.08 కోట్ల విరాళం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిర్వహించే అన్న ప్రసాదం కార్యక్రమం కోసం హైదరాబాద్‌కు చెందిన శాంతా బయోటెక్నిక్స్ సీఈవో డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి రూ.1.08 కోట్ల చెక్కును ఆలయ ఈవో గీతారెడ్డికి అందజేశారు. స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని బాలాల యంలో చెక్కు ఇచ్చారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అద్భుతంగా సాగుతోందని, భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు తనవంతుగా విరాళం ఇచ్చినట్లు వరప్రసాద్‌రెడ్డి చెప్పారు. అనంతరం దాత డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి, కుటుంబ సభ్యులకు ఆలయ ఆచార్యులు ఆశీర్వచనం చేయగా, ఈవో గీతారెడ్డి లడ్డూ ప్రసాదం అందజేశారు. కాగా, వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం స్వామి శ్రీకృష్ణాలంకారంలో హంస వాహనంపై ఊరేగారు. -
బడ్జెట్‌తో ప్రజలకు లబ్ధి చేకూరాలి
సాక్షి, యాదాద్రి, యాదగిరిగుట్ట: ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ రాష్ట్ర ప్రజలకు లబ్ధి చేకూరేలా ఉండాలని, బడ్జెట్లో తెలంగాణ ప్రజల కోసం దేవుణ్ణి ప్రార్థించానని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంపై ఇప్పటికే వివరణ ఇచ్చానని ఆమె వివరించారు. యాద్రాద్రి క్షేత్రం మహాద్భుతమని అభివర్ణించారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని గవర్నర్ సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. తాను తమిళనాడుకు చెందినప్పటికీ రెండేళ్లుగా తెలంగాణ ప్రజలతో మమేకమై సంబంధాలు కొనసాగిస్తున్నానని, ప్రజలు కూడా నాపై అంతే అభిమానాన్ని చూపిస్తు న్నారని ఆనందం వ్యక్తం చేశారు. ప్రధానాలయంలో స్వయంభూలను దర్శించుకుని, ప్రధానాలయ పునఃనిర్మాణ పనులను పరిశీలించారు. అంతకుముందు బా లాలయం వద్ద ఆమెకు ఆలయ ఆచార్యులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. బాలాలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వటపత్రశాయి అలంకార సేవలో గవర్నర్ పాల్గొన్నారు. -
యాదాద్రిలో ఘనంగా ధ్వజారోహణం
సాక్షి, యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ముక్కోటి దేవతలకు ఆహ్వానం పంపే ధ్వజారోహణాన్ని ఘనంగా నిర్వహించారు. మొదట బ్రహ్మోత్సవాలకు వచ్చిన రుత్వికులకు ఆలయ ఈఓ గీతారెడ్డి, చైర్మన్ బి.నరసింహమూర్తి దీక్షా వస్త్రాలను సమర్పించారు. సుదర్శన మూలమంత్రం, లక్ష్మీ మూలమంత్రాలు, జపాలు, పారాయణాల అనంతరం స్వామివారిని వివిధ పుష్పమాలికలతో శోభాయమానంగా అలంకరించి పురప్పాటు సేవలో బాలాలయంలో ఊరేగించారు. తెల్లని వస్త్రంపై స్వామివారి వాహనమైన గరుత్మంతుని చిత్రాన్ని వేసి స్వామి, అమ్మవార్ల ఎదుట ప్రత్యేక పూజలు చేశారు. ఆ శ్వేత వస్త్రాన్ని ధ్వజస్తంభానికి అలంకరించి గరుత్మంతుని ఆవాహన చేశారు. గరుత్మంతునికి నైవేద్యంగా గరుడ ముద్దలను నివేదన చేసి ధ్వజస్తంభం ముందు ఎగురవేశారు. ఈ ముద్దలను ప్రసాదంగా స్వీకరిస్తే సౌభాగ్యం, సంతానప్రాప్తి కలుగుతుందనే విశ్వాసంతో భక్తులు తీసుకున్నారు. ఈ ప్రక్రియల అనంతరం బాలాలయంలో అగ్నిహోమం నిర్వహించారు. -
ప్రారంభం కానున్న యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు
సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 14వ తేదీ వరకు 10 రోజులపాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. తొలి రోజు ఉదయం 10 గంటలకు విష్వక్సేనా ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో ప్రారంభమై 14వ తేదీ ఉదయం 10 గంటలకు స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 28న సీఎం రాక యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి స్వయంభు దర్శనభాగ్యం కలిగించే ఉద్ఘాటన కార్యక్రమం నిమిత్తం ఈ నెల 28న సీఎం కేసీఆర్ రానున్నారు. సీఎం కేసీఆర్ ఆధ్యర్వంలో ప్రధానాలయం ప్రారంభోత్సవం జరగనుంది. అయితే, 28వ తేదీకి ముందు కూడా ఒకరోజు సీఎం యాదాద్రిని సందర్శించి పనులు పరిశీలిస్తారని తెలిసింది. ఆ తేదీ ఇంకా ఖరారు కాలేదు. మహాసుదర్శన యాగం వాయిదా పడిన నేపథ్యంలో ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా మరో యాగం నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. ఈ మేరకు ఆలయ అర్చకులతో అధికారులు చర్చిస్తున్నారు. ఉద్ఘాటన పనులపై సమీక్ష యాదాద్రి దేవాలయం ప్రారంభోత్సవం అట్టహాసంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం హైదరాబాద్‌లో సీఎంవో కార్యదర్శి భూపాల్‌రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, దేవస్థానం ఈవో గీతారెడ్డి, ఇతర శాఖల అధికారులతో సమీక్షాసమావేశం జరిగింది. ప్రధానాలయం ప్రారంభించే తేదీ కంటే ముందుగానే కొండకింద ఆలయ నగరిలో చేపట్టిన పనులను పూర్తిచేయాలని నిర్ణయించారు. తుదిదశలో ఉన్న పనుల్లో వేగం పెంచాలని నిర్ణయించారు. ప్రధానం గా యాగస్థలి కోసం ప్రతిపాదించిన స్థలాన్ని చదును చేయడం, అంతర్గత రోడ్లు, అన్నప్రసాద సత్రం, సత్యనారాయణవ్రత మండపం, ఆర్టీసీ బస్టాండ్, గండిచెరువు, కొండపైకి నిర్మిస్తున్న రెండు ఫ్లైఓవర్లు, కొండపైన బస్బే, ప్రధాన ఆర్చీ పనులను వేగంగా పూర్తిచేయాలని, పార్కింగ్, సుందరీకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే పూర్తి అయిన పుష్కరిణి, దీక్షాపరుల మండపం తుదిమెరుగులు దిద్దాలని యోచిస్తున్నారు. -
ప్రారంభమైన అఖండ జ్యోతి యాత్ర
యాదగిరిగుట్ట: ఈ నెల 4నుంచి ప్రారంభం కానున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్‌లోని బర్కత్‌పురలో సిద్ధమైన స్వామి వారి అఖండజ్యోతి యాత్ర యాదగిరిభవన్ నుంచి మంగళవారం ప్రారంభమైంది. అఖండజ్యోతి యాత్రను వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి, అఖండజ్యోతియాత్ర చైర్మన్ ఎంఎస్ నాగరాజు, ప్రధానార్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు ప్రారంభించారు. యాత్ర మొదటిరోజు ఉప్పల్ చౌరస్తాకు చేరుకుంది. బుధవారం ఉప్పల్ నుంచి బయల్దేరి శుక్రవారం ఉదయానికి భువనగిరికి, అక్కడి నుంచి రాత్రి యాదగిరిగుట్టకు చేరనుంది. యాదాద్రిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అధికారులకు అఖండజ్యోతిని అప్పగిస్తామని అఖండజ్యోతి చైర్మన్ నాగరాజు వెల్లడించారు. మరోవైపు ఈనెల 4నుంచి ప్రారంభం కానున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
యాదాద్రి పనులు 90 శాతం పూర్తి
యాదగిరిగుట్ట: ‘యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ పనులు 90 శాతం పూర్తయ్యాయి. కల్యాణ కట్ట, దీక్షాపరుల మండపం ఈ నెలాఖరు వరకు పూర్తవుతాయి. క్యూలైన్ పనులు దాదాపు పూర్తికావచ్చాయి’అని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని పనులను పరిశీలించారు. అనంతరం హరిత హోటల్లో దేవాలయ అధికారులతో కలసి పెండింగ్ పనులపై సమీక్షించారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ యాదాద్రి పనుల పురోగతిని వివరించారు. ధ్వజస్తంభం పనులు ఈ నెలాఖరు వరకు పూర్తవుతాయన్నారు. క్యూ కాంప్లెక్స్ పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. కొండ కింద పుష్కరిణి పనులు పూర్తయ్యాయని, గండి చెరువు, కల్యాణ కట్ట 90 శాతం పూర్తయ్యాయని, అలాగే ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణం పూర్తయిందని మంత్రి వెల్లడించారు. మార్చి 20 వరకు కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తుందన్నారు. ఆలయ ప్రారంభ సమయానికి అన్నప్రసాద మండపం పూర్తి కాకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆలయ ప్రారంభంనాటికి ఏమైనా పనులు పెండింగ్‌లో ఉంటే అవి తరువాత నిరంతరం కొనసాగుతాయని మంత్రి చెప్పారు. యాగం నిర్వహణకు సంబంధించిన సామగ్రి, ఆరువేల మంది రుత్వికుల జాబితా సిద్ధమైందని వివరించారు. సీఎం కేసీఆర్ చరిత్రాత్మక నిర్ణయంతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం తెలంగాణ తిరుపతిగా అవతరించ బోతోందని మంత్రి ఇంద్రకరణ్ అన్నారు. మార్చి 21వ తేదీ నుంచి 1,008 హోమ కుండాలతో మహా సుదర్శన యాగం, 28వ తేదీన శాస్త్రోక్తంగా మహా కుంభ సంప్రోక్షణతో భక్తులకు స్వయంభూ దర్శనాలు కలుగుతాయని చెప్పారు. -
యాదాద్రికి రూ.50 లక్షల విరాళం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపురానికి స్వర్ణతాపడం కోసం సుంకిశాల దేవస్థానం వ్యవస్థాపకుడు పైళ్ల మల్లారెడ్డి రూ.50 లక్షల విరాళం ఇచ్చారు. శుక్రవారం ఆయన దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని హైదరాబాద్‌లో కలసి చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ఇటీవల యాదాద్రి ఆలయాన్ని సందర్శించినట్లు తెలిపారు. యాదాద్రి దేశంలోనే గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటోందన్నారు. -
‘యాదాద్రి’ గోపురంపై రామాయణ గాథ
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ గోపురాలు మరింత ఆధ్యాత్మికతను సంతరించుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఉత్తర రాజగోపురంపై రామాయణానికి సంబంధించిన చిత్రాలపై ఆడియో పవర్ ప్రొజెక్టర్ ద్వారా శుక్రవారం రాత్రి ట్రయల్ నిర్వహించారు. రామాయణం, ఇతర ఇతిహాసాలను ప్రొజెక్టర్ ద్వారా తమిళనాడులోని రామేశ్వరం ఆలయంలో మాత్రమే ప్రదర్శిస్తున్నట్లు వీటిని ఏర్పాటు చేస్తున్న సంస్థ ప్రతినిధులు తెలిపారు. భక్తులు ఉత్తర రాజగోపురం వైపు ఉన్న పచ్చికలో కూర్చొని కట్టడాలను వీక్షించే అవకాశం ఉన్నందున్న.. శ్రీనృసింహస్వామి, ప్రహ్లాద చరిత్రను కూడా ప్రదర్శించేందుకు సన్నాహాలు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును వైటీడీఏ అధికారులు ఖరారు చేయాల్సి ఉంది. -
ప్రకృతి దేవతలను ప్రతిష్ఠించినట్లుంది
యాదగిరిగుట్ట: యాదాద్రిక్షేత్రంలో శిల్పకళాసంపదను చూస్తే ప్రకృతి దేవతలను ప్రతిష్ఠించినట్లు ఉందని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. ఆదివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని గద్దర్ తన కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. తూర్పు రాజగోపురం వద్ద ‘నర్సన్న.. మా నర్సన్న యాదగిరి నర్సన్న.. మా బీదోళ్లందరినీ సల్లంగా చూడన్నో మాయన్నో నర్సన్న.. నర్సన్న’ అంటూ పాటపాడారు. అనంతరం ప్రధానాలయ పునర్నిర్మాణ పనులను చూశారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి, అందుకు నాయకత్వం వహిస్తున్న సీఎం కేసీఆర్‌కు వందనాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. యాదాద్రి క్షేత్రం ఎలా విరాజిల్లుతోందో, అలాగే తెలంగాణ ప్రజలు అందరూ ఆనందంగా బతకాలని కోరుకున్నట్లు తెలిపారు. -
ఇలా తొలిసారి.. అప్పన్న చందనోత్సవం
-
ఇలా తొలిసారి.. అప్పన్న చందనోత్సవం
సాక్షి, విశాఖపట్నం: వైశాఖశుద్ద తదియని పురస్కరించుకుని సింహగిరిపై వేంచేసిసిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి చందనోత్సవం తొలిసారి భక్తుల సందడి లేకుండానే ఆదివారం జరిగింది. కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పరిమిత వైదిక సిబ్బందితోనే ఉత్సవాన్ని నిర్వహించారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం కేవలం వంశపార ధర్మకర్త, ట్రస్ట్‌బోర్డు చైర్పర్సన్ సంచయిత గజపతిరాజు స్వామివారి తొలి దర్శనం చేసుకున్నారు. రాష్ట్రప్రభుత్వం తరపున దేవస్థానం ఈవోనే స్వామికి పట్టువస్త్రాలను సమర్పించారు. తెల్లవారుజామున 2.30 గంటల నుంచి వైదిక కార్యక్రమాలు, 3.30గంటల నుంచి స్వామివారిపై ఉండే చందనం విసర్జన, మధ్యాహ్నం 3గంటల నుంచి అష్టోత్తర శత కలశ పూజ, సాయంత్రం 5గంటల నుంచి సహస్ర ఘటాభిషేకం నిర్వహణ, తదుపరి తొలివిడత చందనం సమర్పణ నిర్వహించనున్నారు. అర్చకులు సహా పరిమిత సిబ్బందితోనే స్వామి పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇక ఆలయ చరిత్రలో భక్తులు లేకుండానే సింహాద్రి అప్పన్న చందనోత్సవం జరగటం ఇదే తొలిసారి. కరోనా వైరస్ కారణంగా ఆలయ నిర్వాహకులు భక్తులకి అనుమతి నిరాకరించారు. కరోనా ప్రభావంతో ఈ ఏడాది సింహాచలేశుడి నిజరూప దర్శనాన్ని భక్తులు వీక్షించలేకపోయారు. సింహగిరిపైకి వెళ్లే ఘాట్ రోడ్డుతో పాటు మెట్ల మార్గాన్ని కూడా అధికారులు మూసివేశారు. అదేవిధంగా మాధవధార కొండపై నుంచి రోడ్డు, మెట్ల మార్గంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. -
యాదాద్రిలో అష్టభుజి మండపం పూర్తి
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శిల్పులు అష్టభుజి మండపాన్ని పూర్తి చేశారు. వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి, స్తపతి ఆనందవేలు పర్యవేక్షణలో దీనిని నిర్మించారు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ రాజ గోపురాలను కలుపుతూ ఈ అష్టభుజి మండపాన్ని నిర్మించారు. పనులు పూర్తికావడంతో మండపం భక్తులకు కనువిందు చేస్తోంది. -
కల్యాణం.. కమనీయం
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి పాతగుట్ట దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామి, అమ్మవారి కల్యాణ మహోత్సవం కనుల పండువగా నిర్వహించారు. రాత్రి 8:00 గంటలకు ప్రారంభమైన కల్యాణ తంతును అర్చకులు వేద మంత్రాలు పఠిస్తూ జీలకర్ర, బెల్లం, కన్యాదానం, పాద ప్రక్షాళన కార్యక్రమాలతో పూర్తి చేశారు. వేద పండితులు నిశ్చయించిన శుభముహూర్త లగ్నం 9:35 గంటలకు స్వామి వారు ఆండాళ్ అమ్మవారిమెడలో మాంగల్య ధారణ చేశారు. అంతకుముందు స్వామి, అమ్మవారిని హనుమంత వాహనంపై అధిష్టింపజేసి కల్యాణ మండపానికి తీసుకువచ్చారు. యాదగిరికొండ (ఆలేరు) : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పాతగుట్ట ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామి అమ్మవార్ల కల్యాణం అంగరంగ వైభవంగా, కమనీయంగా సాగింది. స్వామి అమ్మవార్లను పట్టు పీతాంబరాలతో ముస్తాబు చేశారు. ప్రత్యేక గజ వాహనంపై అధిష్టింపజేసి ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. మంగళ వాయిద్యాలతో, ఆలయ అర్చకులు, రుత్విక్కులు, వేద పండితులు చదివే వేద మంత్రాలైన పంచ సూక్తాలు, పంచోపనిషత్తులు, దశ శాంతుల పఠనంతో సేవ ముందుకు సాగింది. భక్తుల జయ నారసింహ జ య జయ నారసింహ అను నినాదాలతో పాతగుట్ట తిరువీధులు మారుమోగాయి. ఎక్కడ చూసినా భక్తుల కోలాహలమే కనిపించింది. స్వామి అ మ్మవార్లకు దేవస్థానం తరఫున చైర్మన్ నరసింహమూర్తి, ఈఓ గీతారెడ్డిలు పట్టు వస్త్రాలను సమర్పించారు. రాత్రి 8ః00 గంటలకు స్వామి వారి కల్యాణాన్ని ఆలయ అర్చకులు వేదమంత్రాలతో నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు జీలకర్ర, బెల్లం, కన్యాదానం, పాద ప్రక్షాళన వంటి వివాహ తంతులను పూర్తి చేశారు. సరిగ్గా 9ః35 గంటల కు స్వామి వారు ఆండాళు అమ్మవారిమెడలో లో క కల్యాణార్థం మాంగల్య ధారణ చేశారు. అనంత రం స్వామి అమ్మవార్ల కు ఆలయ అర్చకులు, వేద పండితులు కలిసి తలంబ్రాల ఆటలను ఆడిం చారు. వివాహానికి అఖిల భారత పద్మశాలి అన్నసత్రం సభ్యులు పట్టు వస్త్రాలను సమర్పిం చారు. గజవాహనంపై స్వామిఅమ్మవారిని కల్యాణ మండపానికి తీసుకొస్తున్న అర్చకులు, భక్తులు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు స్వామి అమ్మవార్ల వార్షిక బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశా రు. కల్యాణ మండపం వద్ద బక్తుల కోసం బార్ కేడ్లను ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బందిరా కుండా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక పోలీసు సిబ్బందిని నియమించారు. దారులకు ఇరువైపులా సున్నం లైన్లను వేశారు. యాదాద్రి పాతగుట్ట ఆలయంలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణమహోత్సవానికి హాజరైన భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో హనుమంత సేవ పాతగుట్టలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం స్వామి అమ్మవార్లను హనుమంత వాహనంపై ఊరేగించి భక్తులకు కనువిందు చేశారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను ఉదయం పంచామృతాలతో అభిషేకించి పట్టువస్త్రాలను ధరింపచేసి వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకా రం చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లను హనుమంత వాహనంపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజలను చేసి హారతులనిచ్చారు. మంగళ వాయిద్యాలు, బాజా బజంత్రీలు, ఆలయ అర్చకుల వేద నాదాలు, రుత్విక్కులు, పండితుల వేద మంత్రాలతో సేవ ముందుకు కదిలింది. అక్కడి నుంచి సేవను కల్యాణ మండపం వద్దకు తీసుకు వెళ్లి మండపంలో అధిష్టింపచేసి వేద పండితులు, రుత్విక్కులు, ఆలయ అర్చకులు శ్రీ సూక్తం, పురుష సూక్తంలను పఠించారు. కార్యక్రమంలో కలెక్టర్ అనితారామచంద్రన్, దేవస్థానం చైర్మెన్ నరసింహమూర్తి, ఈఓ గీతారెడ్డి, ఆలయ ప్రధానార్చకులు నల్లందీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, అర్చకులు మాధవాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, ఆలయ అధికారులు మేడి శివకుమార్, పన్నగేశ్వర్రావు పాల్గొన్నారు. -
యాదగిరీశుడికి కేసీఆర్ పట్టువస్త్రాలు
-
యాదగిరీశుడికి కేసీఆర్ పట్టువస్త్రాలు
నల్గొండ: యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన శ్రీలక్ష్మీనరసింహా స్వామి కల్యాణోత్సవంలో శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సతీసమేతంగా పాల్గొన్నారు. అనంతరం ఆయన స్వామి వారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. కేసీఆర్ ఈరోజు ఉదయం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి యాదగిరి గుట్టకు వెళ్ళారు. మరోవైపు కేసీఆర్ అధ్యక్షుడుగా యాదగిరిగుట్ట డెవలప్ మెంట్ బోర్డు ఏర్పాటు అయింది. కాగా యాదగిరిగుట్టలో సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు ను గుట్టపైకి పోలీసులు అనుమతించలేదు. అదేవిధంగా భక్తులెవరినీ గుట్టపైకి అనుమతించపోవడంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. -
రేపు యాదగిరిగుట్టకు సీఎం కేసీఆర్
యాదగిరిగుట్ట(నల్లగొండ): తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ నెల 27న యాదగిరిగుట్టను సందర్శించనున్నారు. ఆయన శుక్రవారం యాదగిరిగుట్టలో జరిగే శ్రీలక్ష్మీనరసింహా స్వామి కల్యాణోత్సవంలో పాల్గొంటారు. శుక్రవారం ఉదయం 10.25 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి 12.30 గంటలకు యాదగిరిగుట్టకు చేరుకుంటారని జిల్లా అధికారులు తెలిపారు. -
నారసింహా.. ఇదేమి లడ్డూ!
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి దివ్యప్రసాదమైన లడ్డూ, పులిహోర నాణ్యత రోజురోజుకూ కోల్పోతుంది. లడ్డూల్లోనుంచి నీరు గారుతోంది, పులిహోర.. దద్దోజనం మాదిరిగా ముద్దగా ఉంటోంది. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రసాదాల తయారీలో దేవస్థానం అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొన్ని రోజలుగా లడ్డూ, పులిహోర ప్రసాదాల నాణ్యతను అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పులిహోర, లడ్డూలు పచ్చి ముద్దలుగా ఉండి అందులోనుంచి నీరు కారుతోంది. నాణ్యత లోపాలను సంబంధిత దేవస్థానం అధికారుల దృష్టికి వచ్చినా పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టు పద్ధతిపై లడ్డూల తయారీ.. యాదగిరిగుట్టలో లడ్డూ ప్రసాదాలను రెండు రకాలుగా తయారు చేస్తున్నారు. 50 రూపాయల లడ్డూ పెద్దది. దీనిని అభిషేకం లడ్డూ అంటారు. దీనిని 400 గ్రాములుగా తయారు చేస్తున్నారు. 10 రూపాయల లడ్డూ 100గ్రాములుగా తయారు చేస్తున్నారు. వీటిని ప్రతిసారీ కాంట్రాక్టు పద్ధతిన దేవస్థానం తయారు చేస్తుంది. ఈ కాంట్రాక్టు పద్ధతి ఆరేళ్లుగా కొనసాగుతూ వస్తుంది. అయితే కాంట్రాక్టర్లు ప్రసాదాల తయారీని వ్యాపారంగా మార్చేశారు. భక్తులకు పవిత్రంగా అందించే ప్రసాదంగా చూడడం లేదనేది ప్రధాన ఆరోపణ. కాంట్రాక్టుదారులు 10కిలోల దిట్టంలో 105 లడ్డూలను తయారు చేయాలనేది నిబంధన. కానీ కక్కుర్తి పడి కిలో దిట్టంలో నీటిశాతం ఎక్కువగా చేసి 130 లడ్డూలను త యారుచేసి అక్రమ ఆదాయానికి తెర తీస్తున్నారు. కిలో దిట్టంలో చిన్న లడ్డూలను 42 తయారు చేయాలి. కానీ 60 చిన్న లడ్డూలను తయారుచేస్తున్నారు. దీంతో ఈ లడ్డూలు పచ్చి ముద్దలుగా ఉండి చేతిలో పట్టుకుంటే అందులోనుంచి నీరు పానకంలాగా కారుతుంది. కాంట్రాక్టర్లు భక్తులకు నాణ్యత లేని లడ్డూలను తయారు చేస్తున్నా దేవస్థానం అధికారులు పట్టించుకోకపోగా సదరు కాంట్రాక్టరుకు తమదైన శైలిలో సహకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిబ్బంది తక్కువ.. లడ్డూల తయారీ కోసం 35మంది సిబ్బందిని నియమించాలి. కానీ ఇక్కడ కాంట్రాక్టు షెడ్యూల్లో ఉన్న దానికంటే 15మంది తక్కువా ఉన్నారు. 100 గ్రాముల లడ్డూ తయారీదారులు 20మంది, 400 గ్రాముల లడ్డూలను 15 మందితో తయారు చేయాలని నిబంధన విధించింది. అయినా కాంట్రాక్టుదారుల కక్కుర్తి బుద్ధితో కేవలం 20 మందితోనే తయారు చేస్తుండడంతో రద్దీ రోజులలో భక్తులకు పూర్తిస్థాయిలో ప్రసాదాలు అందడం లేదు. పచ్చి లడ్డూల తయారీ 50 రూపాయల 400 గ్రాముల లడ్డూలను దేవస్థానం పచ్చివాటిని అమ్ముతుండడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఈ లడ్డూలు దద్దోజనం మాదిరిగా ఉంటున్నాయని వారంటున్నారు. అంతేగాక ప్రతిసారీ 50 రూపాయల లడ్డూలను స్వామి, అమ్మవారి చిత్ర పటాలు గల అందమైన డబ్బాలలో పెట్టి అమ్మేవారు. కానీ వారం రోజులుగా డబ్బాలు స్టాక్ అయిపోవడంతో కవర్లలో ఉంచి ఇస్తుండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లడ్డూలను తయారీదారులు నీటిని ఇష్టమొచ్చిన రీతిలో పోసి తయారు చేస్తున్నారని, దీంతో పచ్చిముద్దగా ఉంటాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లడ్డూల దిట్టం ఇలా.. కిలో దిట్టానికి కిలో శనగ పిండి, 2 కిలోల చక్కెర, 600 గ్రాముల నెయ్యి, 75 గ్రాముల కాజు, 50గ్రాములు కిస్మిస్, 10గ్రాముల ఇలాచి పొడి సామగ్రిని దేవస్థానం..సదరు కాంట్రాక్టర్‌కు ఇస్తుంది. వారు అదనపు ఆదాయం కోసం దిట్టంలోని వస్తువులను తక్కువగా వాడి నాణ్యత లేని ఎక్కువ లడ్డూలను తయారు చేస్తున్నారు. కిలో దిట్టానికి పెద్దలడ్డూల తయారీకి రూ.12.50, చిన్న లడ్డూలకు రూ.11.50 కాంట్రాక్టర్‌కు చెల్లిస్తుంది. ఇటు వస్తువులు తక్కువగా వాడడం..అటు ఇచ్చిన వస్తువులతో ఎక్కువగా తయారు చేసి కాంట్రాక్టర్ రెండు రకాలుగా ఆదాయం పొందుతున్నాడు. నిద్రపోతున్న నిఘా వ్యవస్థ దేవస్థానంలోని ప్రసాదాల తయారీ విభాగంలో నిఘా నిద్రపోతుందన్న విమర్శలున్నాయి. రెండేళ్ల క్రితం ల డ్డూ తయారీ విభాగంలో, ప్రసాదాల కౌంటర్ వద్ద రెం డు కెమెరాలను అమర్చారు. తయారీ విభాగంలోని కె మెరా పనిచేయడం లేదు. దీంతో తయారీదారులు ఇ ష్టానుసారంగా నీటిశాతం ఎక్కువ చేసి లడ్డూప్రసాదాలను తయారు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి. కెమెరాల పనితీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించే ఈఓ కూడా పట్టించుకోవడం లేదు. ప్రసాదాల విక్రయ కౌంటర్లు రెండు ఉండగా ఒకే కెమెరా ఉంది. ఒక్క కౌం టర్ పనితీరును మాత్రమే ఈ కెమెరా తెలుపుతుంది. -
వైభవంగా స్వామివారి కల్యాణం
యాదగిరికొండ, న్యూస్‌లైన్ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని పాతగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన స్వామి అమ్మవార్ల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా కల్యాణ మండపాన్ని అనేక రకాల పుష్పాలతో సర్వాంగ సందరంగా తీర్చిదిద్దారు. ముందుగా గజవాహన సేవలో స్వామి అమ్మవార్లను అధిష్టింపచేసి ఆలయ తిరువీధులలో ఊరేగుతూ బాజా బజంత్రీలు, వేద పండితులు, ఆలయ అర్చకులు చదివే వేదనాదాల నడుమ కల్యాణ మండపానికి తీసుకువచ్చారు. స్వామి అమ్మవార్లకు దేవస్థానం తరఫున ఆలయ ఈఓ కృష్ణవేణి, చైర్మన్ బి.నరసింహమూర్తి పట్టు వస్త్రాలను సమర్పించారు. అమ్మవారి తరఫున దేవస్థానం చైర్మన్ నరసింహమూర్తి, స్వామి వారి తరఫున నల్లందీగళ్ లక్ష్మీ నరసింహాచార్యులు, ఇద్దరు మధ్య మధ్యలో ఛలోక్తులు విసురుతూ కల్యాణాన్ని రక్తి కట్టించారు. సమయానికి జీలకర్ర బెల్లం, కన్యాదానం, మాంగల్యధారణ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల తలంబ్రాల కార్యక్రమం భక్తులకు కనివిందుగా సాగింది. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా హాజరయ్యారు.