
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిర్వహించే అన్న ప్రసాదం కార్యక్రమం కోసం హైదరాబాద్‌కు చెందిన శాంతా బయోటెక్నిక్స్ సీఈవో డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి రూ.1.08 కోట్ల చెక్కును ఆలయ ఈవో గీతారెడ్డికి అందజేశారు. స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని బాలాల యంలో చెక్కు ఇచ్చారు.
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అద్భుతంగా సాగుతోందని, భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు తనవంతుగా విరాళం ఇచ్చినట్లు వరప్రసాద్‌రెడ్డి చెప్పారు. అనంతరం దాత డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి, కుటుంబ సభ్యులకు ఆలయ ఆచార్యులు ఆశీర్వచనం చేయగా, ఈవో గీతారెడ్డి లడ్డూ ప్రసాదం అందజేశారు. కాగా, వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం స్వామి శ్రీకృష్ణాలంకారంలో హంస వాహనంపై ఊరేగారు.
Comments
Please login to add a commentAdd a comment