ANNA PRASADAM
-
తిరుమలలో మరో అపచారం..
సాక్షి, తిరుమల: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో తిరుమలలో మరో అపచారం చోటుచేసుకుంది. తిరుమల అన్న ప్రసాదంలో జెర్రి రావడంతో భక్తుడు భయాందోళనకు గురయ్యాడు.చంద్రబాబు పాలనలో తిరుమల మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా తిరుమలలో మరో అపచారం జరిగింది. అన్న ప్రసాదంలో జెర్రి రావడంతో అది తింటున్న భక్తుడు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. మాధవ నిలయం-2 అన్న ప్రసాద కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై సదరు భక్తులు.. అధికారులకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో, తిరుమల అన్న ప్రసాదం విషయంలో ప్రభుత్వం, టీటీడీ నిర్లక్ష్యంపై భక్తులు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా.. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రారంభం ముందు శుక్రవారం అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ధ్వజస్తంభంపై ఇనుప కొక్కి విరిగింది. అయితే, ధ్వజారోహణం సమయంలో ధ్వజస్తంభంపై గరుడ పఠాని ఈ కొక్కి ద్వారానే ఎగుర వేయాల్సి ఉందని అర్చకులు తెలిపారు. ఈ నేపథ్యంలో కొక్కి విరగడంతో టీటీడీ మరమ్మత్తు పనులు ప్రారంభించింది. అర్చకులు ద్వారా ధ్వజస్తంభంపై టీటీడీ మరమ్మత్తు పనులను ముమ్మరం చేసింది. -
TTD: శ్రీవారి అన్నదానం ట్రస్ట్‌కు కోటి రూపాయలు విరాళం
తిరుపతి, సాక్షి: బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన సుమధుర గ్రూప్ సీఎండీ శ్రీ మధుసూధన్ టిటిడి అన్న ప్రసాదం ట్రస్టుకు ఒక కోటి రూపాయలు విరాళంగా అందించారు.ఈ మేరకు విరాళం డీడీని తిరుమలలోని గోకులం అతిథి భవనంలోని టిటిడి అదనపు ఈవో కార్యాలయంలోదాత టీటీడీ అదనపు ఈఓ శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు.ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు శ్రీ భరత్ కుమార్, శ్రీనవీన్కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రకృతి ఫలసాయం.. శ్రీవారి ప్రసాదం!
సాక్షి, అమరావతి: శ్రీవారి ప్రసాదం, అన్నప్రసాదం తయారీ కోసం తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన 12 రకాల ఉత్పత్తుల సరఫరాకు రంగం సిద్ధమైంది. శ్రీవారికి సమర్పించే నైవేద్యంతో పాటు స్వామి దర్శనానికి వచ్చే లక్షలాది భక్తులకు నాణ్యమైన, రుచికరమైన ప్రసాదంతో పాటు.. అన్నప్రసాదాల తయారీలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించాలని టీటీడీ సంకల్పించింది. పైలట్ ప్రాజెక్టుగా 2021–22 సీజన్లో 1,304 టన్నుల శనగలను ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా సేకరించి టీటీడీకి సరఫరా చేశారు. కాగా 2022–23 సీజన్ నుంచి 15 రకాల ఉత్పత్తుల కోసం టీటీడీ ప్రతిపాదించగా.. 12 రకాల ఉత్పత్తుల సరఫరాకు ఏపీ మార్క్‌ఫెడ్ ముందుకొచ్చింది. ఈ మేరకు రైతు సాధికార సంస్థతో కలిసి మార్క్‌ఫెడ్.. టీటీడీతో అవగాహన ఒప్పందం చేసుకుంది. బియ్యం, కంది, మినుములు, శనగలు, పెసలు, బెల్లం, పసుపు పొడి, వేరుశనగ, మిరియాలు, కొత్తిమీర, మస్టర్డ్ సీడ్, చింతపండు రకాలకు సంబంధించి 15 వేల టన్నులు సరఫరా చేయనున్నారు. ఈ ఒప్పందం మేరకు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటల వారీగా సాగు చేస్తున్న 21,181 మంది రైతులను గుర్తించి రైతు సాధికార సంస్థ ద్వారా ప్రత్యేక శిక్షణనిచ్చారు. సాగు, ధరల నిర్ణయం, సేకరణ, నిల్వ, సరఫరా, కార్యకలాపాలను జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ సీఎం యాప్ ద్వారా పర్యవేక్షిస్తుంది. 15 శాతం ప్రీమియం ధర చెల్లింపు జిల్లాల వారీగా గుర్తించిన రైతుల వివరాలను ఈ యాప్ ద్వారా ఎన్రోల్ చేసి ఆర్బీకేల్లో ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల ద్వారా.. మార్కెట్ ధరల కంటే కనీసం 15 శాతం ప్రీమియం ధర చెల్లించి సేకరిస్తారు. ఇలా గడిచిన ఖరీఫ్ సీజన్లో సాగైన సోనామసూరి (స్లెండర్ వెరైటీ) ఆవిరి పట్టని పాత బియ్యం, బెల్లం, శనగలను సరఫరా చేస్తుండగా, మిగిలిన ఉత్పత్తులను ప్రస్తుత రబీ సీజన్ నుంచి సరఫరా చేయనున్నారు. ఆర్బీకేల ద్వారా సేకరించిన ఈ ఉత్పత్తులను జిల్లా స్థాయిలో గుర్తించిన గోదాములు, కోల్డ్ స్టోరేజ్‌ల్లో నిల్వ చేస్తారు. సాగు, కోత, నిల్వ సమయాల్లో ఆయా ఉత్పత్తుల నాణ్యతను నిర్ధారించుకునేందుకు మూడు దశల్లో నేషనల్ అక్రిడిటేషన్ బోర్డు లిమిటెడ్(ఎన్ఏబీఎల్) గుర్తింపు పొందిన థర్డ్ పార్టీ ల్యాబ్‌లో తనిఖీ చేస్తారు. రసాయన అవశేషాలు లేవని, నిర్దేశించిన ప్రమాణాలకనుగుణంగా ఫైన్ క్వాలిటీ(ఎఫ్ఏక్యూ) ఉత్పత్తులని నిర్ధారించుకున్న తర్వాతే ప్రాసెసింగ్ మిల్లుకు సరఫరా చేసేందుకు అనుమతినిస్తారు. అక్కడ ప్రాసెస్ చేశాక టీటీడీకి సరఫరా చేస్తారు. ఇలా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసిన చెరకుతో తయారు చేసిన బెల్లం ఉత్పత్తులను ఈ నెల 10వ తేదీన టీటీడీకి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెలాఖరులోగా నిర్దేశించిన శనగలు, సోనామసూరి బియ్యాన్ని సరఫరా చేయనున్నారు. 15 శాతం ప్రీమియం ధర చెల్లిస్తున్నాం టీటీడీకి 12 రకాల ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాం. ఖరీఫ్‌లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగైన బెల్లం, శనగలు, బియ్యం సరఫరా చేస్తున్నాం. మిగిలిన 9 ఉత్పత్తులను ప్రస్తుత రబీలో సేకరించి సరఫరా చేస్తాం. –రాహుల్ పాండే, ఎండీ, ఏపీ మార్క్‌ఫెడ్ ప్రకృతి ఉత్పత్తులను ప్రోత్సహించడమే లక్ష్యం ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసే రైతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఏపీ మార్క్‌ఫెడ్‌తో కలిసి టీటీడీతో ఒప్పందం చేసుకున్నాం. జిల్లాల వారీగా ఎకరంలోపు కమతాలు కలిగిన చిన్న, సన్నకారు రైతులను గుర్తించి వారు పండించిన ఉత్పత్తులను సేకరించి మార్క్‌ఫెడ్ ద్వారా టీటీడీకి సరఫరా చేస్తున్నాం. –పి.విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, రైతు సాధికార సంస్థ -
తిరుమలలో ఒక రోజు అన్నప్రసాద వితరణకు విరాళం ఎంతంటే?
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా ఒక రోజు అన్నప్రసాదాలు అందించేందుకు టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒకరోజు విరాళ పథకం ప్రారంభించింది. ఇందుకోసం ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ కోసం రూ.33 లక్షలు విరాళం ఇవ్వాల్సి ఉంటుంది. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం సమయంలో దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చు. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. చదవండి: (చిత్తూరు: రొంపిచర్లలో టీడీపీ కార్యకర్తల బరితెగింపు) -
'అన్నపూర్ణ'.. టీటీడీ
తిరుమల: తిరుమల శ్రీవారి భక్తులకు ఆకలి బాధలు తెలియకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అల్పాహారాలు, అన్నప్రసాద వితరణ చేస్తూ అన్నపూర్ణగా ఖ్యాతిగడించింది. ఎన్ని వేల మంది వచ్చినా ఇబ్బంది పడకుండా టీటీడీ అన్నప్రసాద వితరణ యజ్ఞాన్ని నిరాటంకంగా కొనసాగిస్తోంది. తిరుమలలో 17వ శతాబ్దంలోనే భక్తుల కోసం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రత్యేకంగా అన్నప్రసాద వితరణ ప్రారంభించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అందువల్ల ఆమె పేరుతోనే టీటీడీ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌ను నిర్మించింది. ఒకేసారి నాలుగు వేల మంది భోజనం చేసేలా ఆధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ భవనాన్ని 2011 జూలై 11న అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ప్రారంభించారు. రూ.10 లక్షలతో అన్నప్రసాద వితరణ ప్రారంభం ఇక 1933లో తిరుమల తిరుపతి దేవస్థానములు ఏర్పడిన మూడు దశాబ్దాల తర్వాత అతి తక్కువ ధరలకు భక్తులకు అల్పాహారం, భోజనం అందించేందుకు పలు ప్రాంతాల్లో టీటీడీ క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే పాత అన్నప్రసాద భవనాన్ని 1980 జూన్ 5వ తేదీన ప్రారంభించింది. ఇక్కడ కూడా ప్లేట్ మీల్స్ రూ.1.75, ఫుల్ మీల్స్ రూ.3, స్పెషల్ మీల్స్ రూ.4.50 విక్రయించేవారు. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో టీటీడీ 1985లో ఉచిత అన్నప్రసాద వితరణకు శ్రీకారం చుట్టింది. ఎల్వీ రామయ్య అనే భక్తుడు ఇచ్చిన రూ.పది లక్షల భూరివిరాళంతో టీటీడీ ఉచిత అన్నప్రసాద వితరణను ప్రారంభించింది. అప్పట్లో శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులకు మాత్రమే ఆలయంలో ఉచిత భోజనం టోకెన్లు అందించేవారు. తొలుత రెండు వేల మందికి భోజనం అందించగా, క్రమంగా ఈ సంఖ్య 20 వేలకు పెరిగింది. భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో టీటీడీ 2008లో సర్వ¿ోజన పథకానికి శ్రీకారం చుట్టింది. నాటి నుంచి తిరుమలలో భక్తులందరికీ శ్రీవారి అన్నప్రసాద వితరణను ఉచితంగా కొనసాగిస్తూ భక్తుల సేవలో తరిస్తోంది. పలు ప్రాంతాల్లో అన్నప్రసాద వితరణ ► తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్‌తోపాటు నాలుగు ప్రాంతాల్లో అన్నప్రసాదాలు తయారు చేస్తారు. ► వెంగమాంబ కాంప్లెక్స్‌లో అన్నం, కూర, చట్నీ, సాంబార్, రసం, మజ్జిగ, చక్కెర పొంగలి అందిస్తారు. ► వైకుంఠం క్యూ కాంప్లెక్స్–1, 2, వెలుపలి క్యూలైన్లు, పీఏసీ–2, ఫుడ్ కౌంటర్లలో సాంబార్ బాత్, ఉప్మా, పొంగలి, పులిహోర అందిస్తారు. ► సాధారణ రోజుల్లో రోజుకు 55వేల నుంచి 60వేల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నారు. పర్వదినాలు, రద్దీ రోజుల్లో ఈ సంఖ్య లక్ష వరకు చేరుతుంది. ► సాధారణ రోజుల్లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 9 నుంచి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉదయం 8 నుంచి రాత్రి 11.30 గంటల వరకు, గరుడసేవ రోజు రాత్రి ఒంటి గంట వరకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. ► అన్నప్రసాదాల తయారీకి రోజూ దాదాపు 10 నుంచి 12 టన్నుల బియ్యం, 7 నుంచి 8 టన్నుల కూరగాయలు వినియోగిస్తున్నారు. ► సరుకుల నాణ్యత విషయంలో టీటీడీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది. తిరుపతిలోని మార్కెటింగ్ గోడౌన్ నుంచి తెచ్చిన సరుకులను ప్రయోగశాలలో పరిశీలించిన తర్వాత అన్నప్రసాద విభాగానికి చేరవేస్తారు. అన్నదాన ట్రస్టులో రూ.1,502 కోట్ల నిధులు దాతల సహకారంతో టీటీడీ అన్నదాన ట్రస్టులో రూ.1,502 కోట్ల నిధులు సమకూరాయి. ఈ ట్రస్టు 2018వ సంవత్సరంలో స్వయంసమృద్ధి సాధించడంతో టీటీడీ గ్రాంటు నిలిపివేసింది. భక్తులకు మరింత పోషకాలతో కూడిన అన్నప్రసాదాలు అందించేందుకు భవిష్యత్తులో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు అందించాలని దాతలను టీటీడీ కోరుతోంది. -
శ్రీవారి మెట్టు మార్గం పునఃప్రారంభం
తిరుమల/చంద్రగిరి: టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గురువారం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి శ్రీవారి మెట్టు మార్గాన్ని పునఃప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ఏడాది నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు శ్రీవారి మెట్టు మార్గం దెబ్బతిందని చెప్పారు. ఇంజనీరింగ్ అధికారులు రూ.3.60 కోట్లతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేశారని తెలిపారు. ఈ మార్గం ద్వారా రోజూ ఆరు వేల మంది, ప్రత్యేక పర్వదినాల్లో 15 వేల మంది భక్తులు తిరుమలకు వస్తుంటారని వివరించారు. శ్రీవారి మెట్టు మార్గంలోనే శ్రీనివాసుడు తిరుమలకు చేరుకున్నట్లు, శ్రీ కృష్ణదేవరాయలు శ్రీవారిని దర్శించుకున్నట్లు శాసనాల ద్వారా తెలుస్తోందని పేర్కొన్నారు. అనంతరం సీఈ నాగేశ్వరరావు, ఎస్ఈ–2 జగదీశ్వర్‌రెడ్డి, ఈఈ సురేంద్రరెడ్డి, ఆర్ఆర్ బిల్డర్స్ డీజీఎం ఆర్ముగాన్ని వైవీ సుబ్బారెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో టీటీడీ సభ్యులు, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పోకల అశోక్‌కుమార్, మొరం శెట్టి రాములు, జేఈవోలు సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిశోర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 4 గంటల సమయం తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. శ్రీవారిని బుధవారం అర్ధరాత్రి వరకు 69,603 మంది దర్శించుకోగా.. 30,434 మంది తలనీలాలు ఇచ్చారు. హుండీలో రూ.4 కోట్లు సమర్పించారు. ఎలాంటి టోకెన్ లేకపోయినా దర్శనం కల్పిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. అన్నప్రసాద సేవలు ప్రారంభం కోవిడ్ వల్ల 2020 మార్చిలో పీఏసీ–2 వద్ద నిలిపివేసిన అన్నప్రసాద సేవలను పునఃప్రారంభించారు. డిప్యూటీ ఈవోలు పద్మావతి, హరీంద్రనాథ్, క్యాటరింగ్ ప్రత్యేకాధికారి జీఎల్ఎన్ శాస్త్రి పాల్గొన్నారు. ఇదిలాఉండగా, కోల్‌కతాకు చెందిన సుమిత్ శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ ప్రకాష్ చౌదరి తిరుమలలో టీటీడీకి రూ.50 లక్షల విలువైన 10 బ్యాటరీ వాహనాలను విరాళంగా ఇచ్చారు. అన్నప్రసాదం స్వీకరిస్తున్న భక్తులు -
యాదాద్రికి శాంతా బయోటెక్నిక్స్ రూ.1.08 కోట్ల విరాళం
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నిర్వహించే అన్న ప్రసాదం కార్యక్రమం కోసం హైదరాబాద్‌కు చెందిన శాంతా బయోటెక్నిక్స్ సీఈవో డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి రూ.1.08 కోట్ల చెక్కును ఆలయ ఈవో గీతారెడ్డికి అందజేశారు. స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని బాలాల యంలో చెక్కు ఇచ్చారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అద్భుతంగా సాగుతోందని, భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు తనవంతుగా విరాళం ఇచ్చినట్లు వరప్రసాద్‌రెడ్డి చెప్పారు. అనంతరం దాత డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి, కుటుంబ సభ్యులకు ఆలయ ఆచార్యులు ఆశీర్వచనం చేయగా, ఈవో గీతారెడ్డి లడ్డూ ప్రసాదం అందజేశారు. కాగా, వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం స్వామి శ్రీకృష్ణాలంకారంలో హంస వాహనంపై ఊరేగారు. -
శ్రీకాళహస్తి అన్నప్రసాదానికి ఐఎస్వో సర్టిఫికెట్
శ్రీకాళహస్తి (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయంలో అన్నప్రసాదం నాణ్యత, శుభ్రతకు అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ‘ఐఎస్వో’ సర్టిఫికెట్ లభించింది. ‘హెచ్‌వైఎం’ సంస్థ ప్రతినిధులు ఆదివారం ఐఎస్వో ధ్రువపత్రాన్ని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి చేతుల మీదుగా ఆలయానికి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆలయంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి ఐఎస్వో సర్టిఫికెట్ లభించడం ఆనందంగా ఉందన్నారు. ఆలయ ఈవో పెద్దిరాజు, సిబ్బందికి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. రక్షణ చర్యల్లో భాగంగా ఆలయానికి రెండు వైపులా రూ.34 లక్షల వ్యయంతో లగేజ్ స్కానర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తుల లగేజీని క్షుణ్ణంగా పరిశీలించి తరువాతే అనుమతిస్తామన్నారు. రానున్న రోజుల్లో శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని దేశంలో అత్యున్నత స్థానానికి చేర్చేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి చెప్పారు. చదవండి: మహిళా కూలీకి వజ్రం లభ్యం -
తిరుమల అన్న ప్రసాద కేంద్రంలో ఆయుధ పూజ
సాక్షి, తిరుమల : విజయదశమి సందర్భంగా తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో సోమవారం ఉదయం ఆయుధపూజ నిర్వహించినట్లు తిరుమతి తిరుపతి దేవస్థానం ఈవో కేఎస్ జవహార్‌రెడ్డి తెలిపారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు నిర్విఘ్నంగా అన్నప్రసాద వితరణ జరగాలని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని, శ్రీ దుర్గామాతను ప్రార్థిస్తూ ఈ ఆయుధపూజ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈవో మాట్లాడుతూ.. విజయదశమి రోజున పనిముట్లను, ఆయుధాలను పూజించుకోవడం సంప్రదాయంగా వస్తోందన్నారు. చదవండి: శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు దుర్గామాత మహిషాసురమర్ధనం చేసి విజయం సాధించినట్టు ప్రతి ఒక్కరూ వారి రంగాల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఆయుధ పూజ నిర్వహిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా అన్న ప్రసాదాల తయారీకి వినియోగించే సామగ్రికి, యంత్రాలకు పూజలు చేసినట్లు వివరించారు. అంతకుముందు అన్నప్రసాద భవనంలో శ్రీవారి చిత్రపటానికి, వంట పాత్రలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నప్రసాద కేంద్రంలో జరిగిన ఆయుధపూజలో ఈఓ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి పాల్గొన్నారు. -
పాట్లు ఫీట్లు
అన్నప్రసాదం భక్తులకు నరకయాతన బురదలో అడుగేస్తే జారిపడాల్సిందే దుర్గగుడి అధికారులకు పట్టని వైనం ఇంద్రకీలాద్రి: దుర్గమ్మ అన్న ప్రసాదాన్ని స్వీకరించాలంటే భక్తులకు సర్కస్ ఫీట్లు తెలిసి ఉండాల్సిందే. ఇక్కడ ఏమాత్రం తేడా వచ్చినా ఆస్పత్రిపాలు కావాల్సిందే. గత రెండురోజులుగా కురుస్తున్న వర్షాలతో అర్జున వీధి అడుగు మేర బురద, మట్టి పేరుకుపోయింది. దీంతో అడుగు తీసి అడుగు వేయ డం కనాకష్టమైంది. తేడా వస్తే జారిపడిపోతున్నారు. ఘాట్ రోడ్డు మీదగా కొండపైకి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకున్న తరువాత ఘాట్‌రోడ్డు మీదుగానే కొండ కిందకు చేరుకుంటున్నారు.. అయితే అన్న ప్రసాదాన్ని మాత్రం అర్జున వీధిలోని శృంగేరీమఠంలోనే కొనసాగిస్తుండటంతో అక్కడకు వెళ్లాలంటే బురద లో నడిచి వెళ్లాలి. ఓ చంకలో బట్టల బ్యాగు, మరో చంకలో చంటి పిల్లలతో బురదలో నడుచుకుంటూ వెళ్లేందుకు భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరో వైపున బురదలో నడుచుకుంటూ వెళ్లలేక కొంత మంది భక్తులు రోడ్డుకు పక్కనే ఉన్న సిమెంట్ గొట్టాల పైకి ఎక్కి బురదను దాటేందుకు ప్రయత్నిం చారు. ఈ క్రమంలో కొంత మంది పైపు పై నుంచి జారి పడి బురదలో పడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. భక్తుల ఇబ్బందులు కనిపించవా? కనీసం భక్తులు ఇంతగా ఇబ్బంది పడుతున్నా అన్నదాన సిబ్బంది కనీసం భక్తులు నడిచేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో గమనార్హం. మరోవైపు నిత్యం రద్దీగా కనిపించే అన్నదానం క్యూలైన్లు గురువారం వెలవెలబోయాయి. దేవస్థానం రూ. 40 లక్షల వ్యయంతో కొత్తగా ఏర్పాటు చేసిన అన్నదానం షెడ్డు ఖాళీగానే ఉన్నప్పటికీ శృం గేరీ మఠంలోనే అన్నదానం చేస్తూ భక్తులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని పలువురు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతకు అపచారం... మౌనస్వామిని వదిలేశారిలా ఇంద్రకీలాద్రి: తొలినాళ్లలో దుర్గమ్మ భక్తులకు అన్నదానం చేసిన మౌన స్వామి విగ్రహానికి అపచారం జరిగింది. ఆలయ అధికారులు ఆరు బయట పడేశారు. దీంతో ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ ఉంది. కొండపై మందిరంలో ఉన్న మౌన ముని స్వామి మందిరాన్ని పుష్కరాలకు ముందు దుర్గగుడి అధికారులు కూల్చేయడం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మౌన ముని విగ్రహాన్ని అర్జున వీధిలోని శంగేరీ మఠంలో నిర్వహిస్తున్న అన్నదాన భవనానికి తరలించారు. రంగులు వేసిన తర్వాత ఇలా ఆరు బయట పడేయడం సరికాదని, దీనికి తగిన షెడ్డు ఏర్పాటు చేసి మౌన ముని స్వామి వారి చరిత్ర అందరికీ తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.