సాక్షి, తిరుమల: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో తిరుమలలో మరో అపచారం చోటుచేసుకుంది. తిరుమల అన్న ప్రసాదంలో జెర్రి రావడంతో భక్తుడు భయాందోళనకు గురయ్యాడు.
చంద్రబాబు పాలనలో తిరుమల మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా తిరుమలలో మరో అపచారం జరిగింది. అన్న ప్రసాదంలో జెర్రి రావడంతో అది తింటున్న భక్తుడు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. మాధవ నిలయం-2 అన్న ప్రసాద కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై సదరు భక్తులు.. అధికారులకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో, తిరుమల అన్న ప్రసాదం విషయంలో ప్రభుత్వం, టీటీడీ నిర్లక్ష్యంపై భక్తులు మండిపడుతున్నారు.
ఇదిలా ఉండగా.. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రారంభం ముందు శుక్రవారం అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ధ్వజస్తంభంపై ఇనుప కొక్కి విరిగింది. అయితే, ధ్వజారోహణం సమయంలో ధ్వజస్తంభంపై గరుడ పఠాని ఈ కొక్కి ద్వారానే ఎగుర వేయాల్సి ఉందని అర్చకులు తెలిపారు. ఈ నేపథ్యంలో కొక్కి విరగడంతో టీటీడీ మరమ్మత్తు పనులు ప్రారంభించింది. అర్చకులు ద్వారా ధ్వజస్తంభంపై టీటీడీ మరమ్మత్తు పనులను ముమ్మరం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment