కల్యాణం.. కమనీయం | Yadadri Sri Laxmi Narasimha Swamy Kalyanam | Sakshi
Sakshi News home page

కనుల పండువగా లక్ష్మీనరసింహుడి వివాహ మహోత్సవం

Published Tue, Feb 19 2019 8:55 AM | Last Updated on Tue, Feb 19 2019 8:55 AM

Yadadri Sri Laxmi Narasimha Swamy Kalyanam - Sakshi

కల్యావేడుక సందర్భంగా స్వామివారికి ధరింపజేసే హారాన్ని చూపుతున్న ఆలయ అర్చకుడు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి పాతగుట్ట దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి  స్వామి, అమ్మవారి కల్యాణ మహోత్సవం కనుల పండువగా నిర్వహించారు. రాత్రి 8:00 గంటలకు ప్రారంభమైన కల్యాణ తంతును అర్చకులు వేద మంత్రాలు పఠిస్తూ జీలకర్ర, బెల్లం, కన్యాదానం, పాద ప్రక్షాళన కార్యక్రమాలతో పూర్తి చేశారు. వేద పండితులు నిశ్చయించిన శుభముహూర్త లగ్నం 9:35 గంటలకు స్వామి వారు ఆండాళ్‌ అమ్మవారిమెడలో మాంగల్య ధారణ చేశారు. అంతకుముందు స్వామి, అమ్మవారిని హనుమంత వాహనంపై అధిష్టింపజేసి కల్యాణ మండపానికి తీసుకువచ్చారు.  

యాదగిరికొండ (ఆలేరు) :  యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పాతగుట్ట ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా  సోమవారం రాత్రి స్వామి అమ్మవార్ల కల్యాణం అంగరంగ వైభవంగా, కమనీయంగా సాగింది.  స్వామి అమ్మవార్లను పట్టు పీతాంబరాలతో ముస్తాబు చేశారు.  ప్రత్యేక గజ వాహనంపై అధిష్టింపజేసి ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు.  మంగళ వాయిద్యాలతో, ఆలయ అర్చకులు, రుత్విక్కులు, వేద పండితులు చదివే వేద మంత్రాలైన  పంచ సూక్తాలు, పంచోపనిషత్తులు, దశ శాంతుల పఠనంతో సేవ ముందుకు సాగింది. భక్తుల జయ నారసింహ జ య జయ  నారసింహ అను నినాదాలతో పాతగుట్ట తిరువీధులు  మారుమోగాయి. ఎక్కడ చూసినా  భక్తుల కోలాహలమే కనిపించింది. స్వామి అ మ్మవార్లకు దేవస్థానం తరఫున  చైర్మన్‌ నరసింహమూర్తి, ఈఓ గీతారెడ్డిలు పట్టు వస్త్రాలను సమర్పించారు.  రాత్రి 8ః00   గంటలకు  స్వామి వారి కల్యాణాన్ని ఆలయ అర్చకులు వేదమంత్రాలతో నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు జీలకర్ర, బెల్లం, కన్యాదానం, పాద ప్రక్షాళన వంటి వివాహ తంతులను  పూర్తి  చేశారు. సరిగ్గా 9ః35 గంటల కు స్వామి వారు  ఆండాళు అమ్మవారిమెడలో లో క కల్యాణార్థం మాంగల్య ధారణ చేశారు. అనంత రం స్వామి అమ్మవార్ల కు ఆలయ అర్చకులు, వేద పండితులు  కలిసి తలంబ్రాల ఆటలను ఆడిం చారు. వివాహానికి   అఖిల భారత పద్మశాలి అన్నసత్రం సభ్యులు పట్టు వస్త్రాలను సమర్పిం చారు. 

గజవాహనంపై స్వామిఅమ్మవారిని కల్యాణ మండపానికి తీసుకొస్తున్న అర్చకులు, భక్తులు 

భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు
స్వామి అమ్మవార్ల  వార్షిక బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశా రు.  కల్యాణ మండపం వద్ద   బక్తుల కోసం బార్‌ కేడ్లను  ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బందిరా కుండా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక పోలీసు సిబ్బందిని నియమించారు. దారులకు ఇరువైపులా సున్నం లైన్లను వేశారు.  


యాదాద్రి పాతగుట్ట ఆలయంలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణమహోత్సవానికి హాజరైన భక్తులు

ఆధ్యాత్మిక వాతావరణంలో హనుమంత సేవ
పాతగుట్టలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా  సోమవారం ఉదయం  స్వామి అమ్మవార్లను హనుమంత వాహనంపై  ఊరేగించి భక్తులకు  కనువిందు చేశారు. ఈ సందర్భంగా  స్వామి అమ్మవార్లను ఉదయం పంచామృతాలతో అభిషేకించి పట్టువస్త్రాలను ధరింపచేసి వివిధ రకాల పుష్పాలతో  శోభాయమానంగా అలంకా రం చేశారు.  అనంతరం స్వామి అమ్మవార్లను హనుమంత వాహనంపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజలను చేసి హారతులనిచ్చారు. మంగళ వాయిద్యాలు, బాజా బజంత్రీలు, ఆలయ అర్చకుల వేద నాదాలు, రుత్విక్కులు, పండితుల వేద మంత్రాలతో సేవ ముందుకు కదిలింది.  అక్కడి నుంచి సేవను  కల్యాణ మండపం వద్దకు తీసుకు వెళ్లి మండపంలో అధిష్టింపచేసి  వేద పండితులు, రుత్విక్కులు, ఆలయ అర్చకులు శ్రీ సూక్తం, పురుష సూక్తంలను పఠించారు.  కార్యక్రమంలో కలెక్టర్‌  అనితారామచంద్రన్, దేవస్థానం చైర్మెన్‌ నరసింహమూర్తి, ఈఓ గీతారెడ్డి,  ఆలయ ప్రధానార్చకులు  నల్లందీగళ్‌  లక్ష్మీనరసింహాచార్యులు, అర్చకులు  మాధవాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు, ఆలయ అధికారులు మేడి శివకుమార్, పన్నగేశ్వర్రావు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement