వటపత్రశాయి అలంకార సేవలో పాల్గొన్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
సాక్షి, యాదాద్రి, యాదగిరిగుట్ట: ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ రాష్ట్ర ప్రజలకు లబ్ధి చేకూరేలా ఉండాలని, బడ్జెట్‌లో తెలంగాణ ప్రజల కోసం దేవుణ్ణి ప్రార్థించానని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగంపై ఇప్పటికే వివరణ ఇచ్చానని ఆమె వివరించారు. యాద్రాద్రి క్షేత్రం మహాద్భుతమని అభివర్ణించారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని గవర్నర్ సోమవారం దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. తాను తమిళనాడుకు చెందినప్పటికీ రెండేళ్లుగా తెలంగాణ ప్రజలతో మమేకమై సంబంధాలు కొనసాగిస్తున్నానని, ప్రజలు కూడా నాపై అంతే అభిమానాన్ని చూపిస్తు న్నారని ఆనందం వ్యక్తం చేశారు. ప్రధానాలయంలో స్వయంభూలను దర్శించుకుని, ప్రధానాలయ పునఃనిర్మాణ పనులను పరిశీలించారు. అంతకుముందు బా లాలయం వద్ద ఆమెకు ఆలయ ఆచార్యులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. బాలాలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వటపత్రశాయి అలంకార సేవలో గవర్నర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment