
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ రెండో సెషన్ సమావేశా లు ఈ నెల 8వ తేదీ ఉదయం 11.30 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదివారం నోటిఫికేష న్ జారీ చేశారు.
శాసనసభ బడ్జెట్ సమావేశాల ను 8వ తేదీ నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్ర భుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తొలిరోజు గవర్నర్ తమిళిసై ఉభయసభల ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.