ప్రధాన ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వకుండా వాయిదా వేసుకుని పారిపోయారు: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సర్కారు మందబలంతో శాసనసభను తప్పుదోవ పట్టించిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షానికి మైక్ ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా సభను వాయిదా వేసుకుని పారిపోయిందని వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత మీడియా పాయింట్ వద్ద హరీశ్ మాట్లా డారు. ‘‘కేంద్ర ప్రభుత్వం గతంలో ఉదయ్ పథకం ద్వారా రాష్ట్రం మీద బలవంతంగా రూ.9 వేల కోట్ల భారాన్ని రుద్దింది.
ఇదే విషయాన్ని నేను సభలో చెప్తే.. సీఎం మాత్రం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. 2017 నాటి నోట్‌లోని అంశాలను చదివి వినిపించారు. అందులో వ్యవసాయ బోరుబావుల వద్ద ఉన్న మీటర్లకు బదులు స్మార్ట్ మీటర్లు పెట్టాలనే అంశం తప్ప.. కొత్తగా మీటర్లు పెట్టాలనే ప్రస్తావన లేదు.
కానీ 2021 జూన్‌లో ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడి 0.5% అదనపు అప్పు తీసుకునే రాష్ట్రాలు మీటర్లు పెట్టాలని కేంద్రం నిబంధన పెట్టింది. దానికి మేం ఒప్పుకోలేదు. రైతుల ప్రయోజనాల కోసం రూ.30వేల కోట్లు వదులు కున్నాం. సీఎం రేవంత్ సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మోటార్లకు మీటర్లు పెట్టే కుట్రను అమలు చేస్తున్నారేమోనని అను మానంగా ఉంది’’ అని హరీశ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment