
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపురానికి స్వర్ణతాపడం కోసం సుంకిశాల దేవస్థానం వ్యవస్థాపకుడు పైళ్ల మల్లారెడ్డి రూ.50 లక్షల విరాళం ఇచ్చారు. శుక్రవారం ఆయన దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని హైదరాబాద్‌లో కలసి చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ఇటీవల యాదాద్రి ఆలయాన్ని సందర్శించినట్లు తెలిపారు. యాదాద్రి దేశంలోనే గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంటోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment