
హైకోర్టు సీజే జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మకు లడ్డూ ప్రసాదం అందజేస్తున్న ఇన్‌చార్జ్ ఈఓ రామకృష్ణారావు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ఆదివారం దర్శించుకున్నారు. ప్రధానాలయంలోని స్వయంభూలను సతీసమేతంగా దర్శించుకొని పూజలు నిర్వహించారు. చీఫ్ జస్టిస్ దంపతులకు ఆలయ ఆచార్యులు సంప్రదాయంగా స్వాగతం పలికారు.
ముఖ మండపంలో వారికి వేద ఆశీర్వచనం చేశారు. ఇన్‌చార్జ్ ఈఓ రామకృష్ణారావు చీఫ్ జస్టిస్‌కు లడ్డూ ప్రసాదం అందజేశారు. అంతకుముందు కలెక్టర్ పమేలా సత్పతి కొండపై అతిథి గృహం వద్ద చీఫ్ జస్టిస్‌కు స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment