
ఆశీర్వచనం తీసుకుంటున్న జస్టిస్ సంతోష్‌రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు
యాదగిరిగుట్ట: రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ సంతోష్‌రెడ్డి తమ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం రాత్రి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ ఆచార్యులు జస్టిస్ సంతోష్‌రెడ్డికి సంప్రదాయంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ట అలంకార మూర్తులను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జస్టిస్ సంతోష్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు ఆచార్యులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూ ప్రసాదం అందజేశారు.