హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న ఆలయ అధికారులు, సిబ్బంది
యాదగిరిగుట్ట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ప్రధానాలయం మార్చి 28న ప్రారంభమైనప్పటికీ 29వ తేదీ నుంచి భక్తులకు శ్రీస్వామి వారి దర్శనం కల్పించారు. అదే రోజు ఆలయంలో హుండీలను ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు హుండీల్లో సమర్పించుకున్న నగదు, నగలను మంగళవారం ప్రధానాలయంలోని ప్రథమ ప్రాకారంలో ఈవో గీతారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అధికారులు, సిబ్బంది లెక్కించారు.
ఈ లెక్కింపులో రూ.1,87,17,937 నగదు సమకూరింది. ఇక మిశ్రమ బంగారం 62 గ్రాములు, మిశ్రమ వెండి 3కిలోల 550 గ్రాములు వచ్చింది. వీటితో పాటు విదేశీ కరెన్సీ డాలర్లు, రియాల్స్ వచ్చాయి. ఇందులో ఆస్ట్రేలియాకు చెందిన 150 డాలర్లు, అమెరికాకు చెందిన 903 డాలర్లు, సౌదీ అరేబియాకు చెందిన 102 రియాల్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన 10 దీర్హమ్స్, ఖతార్‌కు చెందిన ఒక రియాల్, కెనడాకు చెందిన 25 డాలర్లు, ఇంగ్లాండ్‌కు చెందిన 50 పౌండ్లు వచ్చినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment