ప్రధానాలయ తూర్పు రాజగోపురం ముందు మొక్కుతున్న గద్దర్
యాదగిరిగుట్ట: యాదాద్రిక్షేత్రంలో శిల్పకళాసంపదను చూస్తే ప్రకృతి దేవతలను ప్రతిష్ఠించినట్లు ఉందని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. ఆదివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని గద్దర్ తన కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. తూర్పు రాజగోపురం వద్ద ‘నర్సన్న.. మా నర్సన్న యాదగిరి నర్సన్న.. మా బీదోళ్లందరినీ సల్లంగా చూడన్నో మాయన్నో నర్సన్న.. నర్సన్న’ అంటూ పాటపాడారు.
అనంతరం ప్రధానాలయ పునర్నిర్మాణ పనులను చూశారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించాలని నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి, అందుకు నాయకత్వం వహిస్తున్న సీఎం కేసీఆర్‌కు వందనాలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. యాదాద్రి క్షేత్రం ఎలా విరాజిల్లుతోందో, అలాగే తెలంగాణ ప్రజలు అందరూ ఆనందంగా బతకాలని కోరుకున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment