యాదగిరిగుట్ట(నల్లగొండ): తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ నెల 27న యాదగిరిగుట్టను సందర్శించనున్నారు. ఆయన శుక్రవారం యాదగిరిగుట్టలో జరిగే శ్రీలక్ష్మీనరసింహా స్వామి కల్యాణోత్సవంలో పాల్గొంటారు. శుక్రవారం ఉదయం 10.25 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి 12.30 గంటలకు యాదగిరిగుట్టకు చేరుకుంటారని జిల్లా అధికారులు తెలిపారు.