సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు చోట్ల ఎన్‌ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో గురువారం తెల్లవారుజాము నుంచే ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది.
ముగిసిన NIA సోదాలు
ఎల్బీనగర్‌లోని శ్రీనివాస నగర్ కాలనీలోని రవిశర్మ ఇంటిపై ఎన్ఐఎ సోదాలు ముగిశాయి. కూకట్‌పల్లి పీఎస్ పరిధిలో సంజయ్ దీపక్ రాజ్ అనే వ్యక్తిపై కేసు నమోదు అరెస్ట్ విషయంలో అదే కేసులో నిందితులుగా ఉన్న వేణుగోపాల్, రవిశర్మ కేరళకు చెందిన మరో ముగ్గురిపై కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలోనే రవిశర్మ ఇంటిపై దాడి చేసిన ఎన్ఐఏ అధికారులు. రవిశర్మ మొబైల్‌తో పాటు పాత బుక్స్, 1990 కంటే ముందు ఉన్న ఫొటోలకు చెందిన కరపత్రాలు స్వాధీనం చేసుకున్న ఎన్ఐఎ అధికారులు. ఈ నెల 10న ఎన్ఐఎ కార్యాలయానికి హాజరు అవ్వాలని ఆదేశాలు జారీ చేసిన NIA అడిషనల్ ఎస్పీ రాజ్‌కుమార్.
విక్షణం పత్రిక ఎడిటర్ వేణు కామెంట్స్
- ఉదయం ఐదు గంటలకు మా ఇంటికి ఎన్‌ఐఏ వాళ్ళు వచ్చారు..
- సెర్చ్ వారెంట్‌తో వచ్చామని చెప్పారు
- సంజయ్ దీపక్ రావు అరెస్ట్ అయినా దాని మీద వచ్చామని అన్నారు.
- 2013 నయిల్ బెదిరింపుల లేఖ పుస్తకాలు రాశాను.
- ఆ పుస్తకాలను తీసుకెళ్లారు.
- నా మొబైల్ సీజ్ చేశారు.
- సెప్టెంబర్ 15 సింహపురి టౌన్ షిప్‌లో సంజయ్ దీపక్ రావును అరెస్ట్ చేశారు.
- దీపక్‌కు నాకు సంబంధముందని కూకట్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
- కేసుపై గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి లేఖ రాశాను.
- నేను రాసిన ఉత్తరం పత్రికల్లో ప్రచారం అయ్యింది.
- దేశంలో NIA ఉపా చట్టం ద్వారా పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరాము.
- జనవరి మూడో తేదీన నాపై పెట్టిన కేసును NIA టెకప్ చేసుకుంది.
- ఈ కేసులో ఏ-22గా నా పేరు చేర్చారు
- పోలీసుల దగ్గర ఉన్న కన్ఫక్షన్ స్టేట్‌మెంట్‌లో నా పేరు ప్రస్థావించినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment