ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఎన్‌ఐఏ హై అలర్ట్ ప్రకటించింది. పోలీసులు సహా మహారాష్ట్రలోని అన్ని దర్యాప్తు సంస్థలు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మెయిల్స్ పంపింది. ఇండోర్‌కు చెందిన ఓ ప్రమాదకర వ్యక్తి మంబైలోని ప్రవేశించాడని, అతడు చైనా, పాకిస్థాన్, హాంకాంగ్‌లో శిక్షణ తీసుకుని వచ్చాడని హెచ్చరించింది.
ఈ డేంజర్ మ్యాన్ పేరు సర్ఫరాజ్ మిమాన్. ఇతనికి సంబంధించిన ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ కాపీలను ఎన్‌ఐఏ అన్ని దర్యాప్తు సంస్థలకు పంపింది. కొద్ది రోజుల క్రితం ఓ గుర్తు తెలియని వ్యక్తి సర్ఫరాజ్ మిమాన్ గురించి ఎన్‌ఐఏకు మెయిల్ చేసి అప్రమత్తం చేశాడు. దీంతో సర్ఫరాజ్‌ను అరెస్టు చేసేందుకు పోలీసు ప్రత్యేక బృందాలు రంగంలోకి అతని కోసం గాలిస్తున్నాయి.
రెండు రోజుల క్రితమే ఫిబ్రవరి 25న ఢిల్లీ పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. వీరు ఆయుధాల శిక్షణ తీసుకునేందుకు పాకిస్తాన్‌కు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా గుర్తించి చాకచక్యంగా అరెస్టు చేశారు. ఇద్దరిలో ఒకరు థానే వెస్ట్‌కు చెందిన ముబారక్ ఖాన్ కాగా.. మరొకరు తమళనాడుకు చెందిన అబ్దుల్లా అని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
చదవండి: సీబీఐ అరెస్ట్‌పై సుప్రీంకోర్టుకు సిసోడియా..
Comments
Please login to add a commentAdd a comment