హజీ, ఇమ్రాన్, కఫీల్, నాసిర్, (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్: బిహార్‌లోని దర్భంగ రైల్వేస్టేషన్‌లో ఈ ఏడాది జూన్ 17న జరిగిన ఐఈడీ పేలుడుకు పాకిస్తాన్ కేంద్రంగానే కుట్ర సాగినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తేల్చింది. లష్కరే తోయిబా ప్రోద్బలంతో యూ పీవాసి ఇక్బాల్ ఖానా (ప్ర స్తుతం లాహోర్‌లో ఉంటున్నాడు) ఈ కుట్రను అమలు చేసినట్లు నిర్ధారించింది. ఈ మేరకు గురువారం పట్నాలోని ప్రత్యేక న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులోని ఐదుగురు నిందితుల్లో ఇద్దరు హైదరాబాదీలతో పాటు మరో ఇద్దరిని ఇప్పటికే అరెస్టు చేసింది.
పేలుడుకు కుట్ర పన్నింది ఇలా...
► ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లా ఖైరాన ప్రాంతానికి చెందిన మహ్మద్ నాసిర్ ఖాన్ హై
దరాబాద్ మల్లేపల్లిలోని భారత్ గ్రౌండ్స్ సమీపంలో ఉండేవాడు. అతని సోదరుడు ఇమ్రాన్ మాలిక్ స్వస్థలంలో ఉండేవాడు.
► ఖైరాన ప్రాంతానికే చెందిన మహ్మద్ ఇక్బాల్ ఖానా 1993 నుంచి నకిలీ నోట్ల చెలామణి చేస్తున్నాడు. అతనిపై అనేక రాష్ట్రాల్లో కేసులు నమోదు కావడంతో పాక్‌కు పారిపోయి లాహోర్‌లో ఉంటున్నాడు.
► అక్కడి నుంచే ఐఎస్‌ఐ సహకారంతో నకిలీ నోట్ల చెలామణితోపాటు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. లష్కరే తోయిబాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు.
► ఇక్బాలే కొన్నాళ్ల క్రితం ఆన్‌లైన్ ద్వారా ఇమ్రాన్‌ను ఉగ్రవాదం వైపు మళ్లించాడు. స్థానిక పదార్థాలతో పేలుళ్లు జరపడం ఎలా? అని ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తూ యూ ట్యూబ్‌లోని కొన్ని వీడియోలు పంపాడు.
► గతంలో పాక్‌కు వెళ్లిన నాసిర్ అక్కడ ఉగ్రవాద శిక్షణ పూర్తి చేసి వచ్చాడు. బాంబుల తయారీ నుంచి గూఢచర్యం వరకు వివిధ అంశాల్లో అతను శిక్షణ పొందాడు.
► వేగంగా వెళ్లే రైళ్లలో అగ్నిప్రమాదాలు సృష్టించి భారీ ప్రాణనష్టం సృష్టించాలని ఇక్బాల్ చెప్పడంతో ఈ ఏడాది మేలో సిటీకి వచ్చిన ఇమ్రాన్ తన సోదరుడు నాసిర్ వద్ద ఆశ్రయం పొందాడు.
చదవండి: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. రాష్ట్రాలకు, కేంద్రం కీలక ఆదేశాలు
సొంతంగా బాంబు తయారీ...
దర్భంగా ఎక్స్‌ప్రెస్‌ను తగలబెట్టాలని నిర్ణయించుకొని చిక్కడపల్లి, హబీబ్‌నగర్‌లలోని దుకాణాల్లో కొన్న సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, పంచదార వినియోగించి మంటలు సృష్టించే బాంబు తయారు చేశారు.
► గాజు సీసాలోకి ఈ పదార్థాలను ఇంజెక్షన్ సిరంజిల ద్వారా నింపి 16 గంటల్లో పేలి జరిగి మంటలు చెలరేగేలా కుట్రపన్నారు.
► ఈ ఏడాది జూన్ 15న రెడీమేడ్ వస్త్రాల పార్శిల్‌లో ఈ సీసాను ఉంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి దర్భంగ వెళ్లే దర్భంగ ఎక్స్‌ప్రెస్‌లో దీన్ని బుక్ చేశారు. అయితే అదృష్టవశాత్తూ ఈ పేలుడు ఆలస్యమైంది. 17న దర్భంగ స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై రైలు ఆగి పార్సిల్‌ను అన్‌లోడ్ చేశాక స్వల్ప పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.
చదవండి: మిత్రుడితో తరుచూ ఫోన్‌లు.. ఇంటినుంచి పారిపోయే ప్రయత్నంలో..
► దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన ఎన్‌ఐఏ... ఇక్బాల్ ఖానా, నాసిర్, ఇమ్రాన్‌లతోపాటు వారికి పరోక్షంగా సహకరించిన యూపీవాసులు హాజీ సలీం, ఖఫీల్ అహ్మద్‌లను అరెస్టు చేసింది.
► సికింద్రాబాద్ పార్శిల్ ఆఫీస్‌లో ఈ అన్నదమ్ములు మహ్మద్ సూఫియాన్ పేరు తో ఇచ్చిన పాన్ కార్డు కాపీనీ ఇక్బాలే వాట్సాప్ ద్వారా పంపాడని ఎన్‌ఐఏ గుర్తించింది.
Comments
Please login to add a commentAdd a comment