
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఉగ్రవ్యతిరేక బృందానికి సారథ్యం వహిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి సదానంద్ వసంత్ దాతెను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) నూతన డైరెక్టర్ జనరల్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈయన నియామకాన్ని ఆమోదిస్తూ నియామకాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకున్నాక కేంద్ర సిబ్బంది శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. 1990 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారి అయిన వసంత్ 2026 డిసెంబర్ 31దాకా ఈ పదవిలో కొనసాగుతారు.
రాజస్థాన్ కేడర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ కుమార్ శర్మను బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. జాతీయ విపత్తు స్పందనా దళం(ఎన్‌డీఆర్‌ఎఫ్) నూతన సారథిగా 1991 బ్యాచ్ యూపీ కేడర్ ఐపీఎస్ అధికారి పీయూశ్ ఆనంద్‌ను నియమించారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) అదనపు డైరెక్టర్ జనరల్‌గా 1995 బ్యాచ్ కేరళ కేడర్ ఐపీఎస్ అధికారి ఎస్.సురేశ్‌ను నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment