sadanand
-
ఎన్ఐఏ నూతన డీజీగా సదానంద్ వసంత్
న్యూఢిల్లీ: మహారాష్ట్ర ఉగ్రవ్యతిరేక బృందానికి సారథ్యం వహిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి సదానంద్ వసంత్ దాతెను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) నూతన డైరెక్టర్ జనరల్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈయన నియామకాన్ని ఆమోదిస్తూ నియామకాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకున్నాక కేంద్ర సిబ్బంది శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. 1990 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారి అయిన వసంత్ 2026 డిసెంబర్ 31దాకా ఈ పదవిలో కొనసాగుతారు. రాజస్థాన్ కేడర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ కుమార్ శర్మను బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. జాతీయ విపత్తు స్పందనా దళం(ఎన్డీఆర్ఎఫ్) నూతన సారథిగా 1991 బ్యాచ్ యూపీ కేడర్ ఐపీఎస్ అధికారి పీయూశ్ ఆనంద్‌ను నియమించారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) అదనపు డైరెక్టర్ జనరల్‌గా 1995 బ్యాచ్ కేరళ కేడర్ ఐపీఎస్ అధికారి ఎస్.సురేశ్‌ను నియమించారు. -
కమలంలో ముసలం.. పార్టీలో గ్రూపు రాజకీయాలు
సాక్షి, వికారాబాద్: బీజేపీలో గ్రూపు రాజకీయాలకు తెరలేచింది. జిల్లా నాయకత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ నేతల నుంచి తరచూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. సదానంద్‌రెడ్డి పార్టీ జిల్లా పగ్గాలు చేపట్టి ఏడాదిన్నర పూర్తయినా.. ఇప్పటికీ క్యాడర్‌పై పట్టు సాధించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వికారాబాద్, తాండూరు, కొడంగల్, పరిగి నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల మధ్య సఖ్యత కొరవడింది. ఈక్రమంలో జిల్లా అధ్యక్షుడినే మార్చాలనే డిమాండ్ పెరుగుతోంది. ఈ విషయాన్ని కొంతమంది నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. బీజేపీకి వెన్నెముక అయిన సంఘ్ పరివార్.. ప్రస్తుత అధ్యక్షుడి పనితీరుపై అసంతృప్తిగా తెలుస్తోంది. ఆయన స్థానంలో తాండూరుకు చెందిన ఓ నాయకుడికి అవకాశం ఇస్తారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. చదవండి: సీఎం భగవంత్ మాన్ మరొకటి.. చండీగఢ్ పంజాబ్‌కే సొంతం కార్యకర్తల్లో అసంతృప్తి బీజేపీ జిల్లా నేతల పనితీరుపై కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్నట్లు కనిపిస్తోంది. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో యువ నాయకత్వం, ఏబీవీపీ, కిందిస్థాయి నాయకులు చురుగ్గా పాల్గొంటుండగా, ముఖ్య నేతలుగా చెప్పుకొంటున్న వారు మాత్రం ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వికారాబాద్ మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా ఉన్న సదానంద్‌రెడ్డి సతీమణి.. ఇప్పటి వరకు అధికార పార్టీ పనితీరును ఎండగడుతూ బీజేపీ పక్షాన వాయిస్ వినిపించలేకపోతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇటీవలి కాలంలో జరుగుతున్న పార్టీ కార్యకర్తల సమావేశాలకు జిల్లా ముఖ్య నేతలు మొహం చాటేయటం కూడా విమర్శలకు తావిస్తోంది. పార్టీ పార్లమెంట్ ఇన్చార్జి జనార్దన్‌రెడ్డి సైతం కొంత కాలంగా జిల్లాలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అతనికి జిల్లాకు చెందిన ఓ ముఖ్య నేతతో పొసగకపోవటమే ఇందుకు కారణమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. చదవండి: హైడ్రామా.. కాంగ్రెస్ కొంప ముంచిన ఎమ్మెల్యేలు జిల్లా నేతలు విఫలం ఇటీవలే నాలుగు రాష్ట్రాల్లో అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ మంచి ఊపుమీద కనిపిస్తోంది. రాష్ట్ర నాయకత్వం కూడా ఈ స్పీడ్‌ను కొనసాగించాలని భావిస్తోంది. దక్షణాదిలో సైతం పట్టుసాధించాలంటే తెలంగాణపై ఫోకస్ పెట్టాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. ఇందుకోసం క్షేత్రస్థాయి నుంచి బీజేపీ బలోపేతానికి కంకణం కట్టుకుంది. దుబ్బాక ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్పై బీజేపీ గెలుపు.. ఆ వెంటనే జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నలభైకిపైగా కార్పొరేట్ స్థానాల కైవసం, ఆ తర్వాత కొద్ది రోజులకే హుజూరాబాద్‌లో ఈటల విజయం, ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల్లో మెరుగైన ఫలితాలను రాబట్టిన పార్టీ మంచి ఊపుమీదుంది. మంత్రిగా, సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన ఎ.చంద్రశేఖర్ బీజేపీలో కొనసాగుతుండటం స్థానిక నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ఆయన పార్టీకి పెద్ద దిక్కుగా మారుతారని అంతా భావించారు. కానీ పార్టీ కార్యక్రమాల్లో ఏసీఆర్ పెద్దగా పాల్గొనకపోవడం కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది. -
బిహార్ మాజీ సీఎం సదానంద్ సింగ్ కన్నుమూత
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభాపక్షనేత సదానంద్ సింగ్ కన్నుమూశారు. ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా బిహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు మదన్ మోహన్.. సదానంద్ మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్లో స్పందించారు. ‘బిహార్‌కు చెందిన ప్రముఖ నేత, కాంగ్రెస్ యోధుడు సదానంద్ సింగ్ ఈరోజు కన్నుమూశారు. ఆయన మృతితో ఒక రాజకీయ శకం ముగిసింది. మీ నవ్వుతున్న ముఖం ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ట్వీట్ చేశారు. కాగా, సదానంద్ సింగ్ కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ప్రస్తుతం పట్నాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, ఈరోజు ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. బిహార్ ప్రతిపక్ష నేత తేజశ్వి యాదవ్ సదానంద్ సింగ్ మృతికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. చదవండి: బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ నివాసం వద్ద బాంబు పేలుడు we are saddened to hear that our beloved Veteran leader Sj. Sadanand ji is no more with us, we pray God to rest his heavenly Soul in peace , The Party stands by you and your family Mukesh ji. "Om Shanti" : sri @BHAKTACHARANDAS pic.twitter.com/7h4c1MG3Py — Bihar Congress (@INCBihar) September 8, 2021 -
సీఎం కిరణ్‌ను బర్తరఫ్ చేయాలి
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్ : రాజ్యాంగ బద్ధంగా, పక్షపాతం లేకుండా రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలను సమానంగా చూడాల్సిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కేవలం సీమాంధ్ర ప్రాంత సీఎంగా వ్యవహరించడం సిగ్గుచేటని బీసీ సంక్షేమ సంఘం మం డల అధ్యక్షుడు సదానంద్ అన్నారు. శనివారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు సీఎంను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు పోస్టుకార్డులు పంపించారు. ఈ సందర్భంగా సదానంద్ మాట్లాడుతూ.. దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి పంపించిన తెలంగాణ బిల్లును ఆమోదించాల్సింది పోయి, నాలుగున్నర కోట్ల ప్రజల చిరకాల ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుత గులుతూ, తన సీమాంధ్ర పక్షపాతాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకుంటానని పిచ్చి ప్రేలాపనలు చేయడం సీఎం దిగజారు డు తనానికి నిదర్శమని ధ్వజమెత్తారు. సీఎంను బర్తరఫ్ చేయాలని కోరుతూ పోస్టు కార్డు ఉద్యమాన్ని నిర్వహిస్తున్నామని ఇందుకు ప్రతి తెలంగాణ పౌరుడు సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మండల ఉపాధ్యక్షుడు చింతల దాసు, సభ్యులు కళ్యాణ్, గుజ్జరి నర్సయ్య, బుజ్జన్న, ఆనంద్, తెయూ విద్యార్థులు నాగభూషణం, రాజు, సంతోశ్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. ఎంబీఏ, ఎంసీఏ పరీక్షా ఫీజు షెడ్యూల్ తెయూ(డిచ్పల్లి) : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఎంసీఏ, ఎంబీఏ మొదటి సెమిస్టర్ , ఐదు సంవత్సరాల ఎంఎస్సీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఎంఏ అప్లయిడ్ ఎకనామిక్స్, మొదటి, మూడు సెమిస్టర్ల రెగ్యులర్ పరీక్షలు 2014 ఫిబ్రవరిలో జరుగుతాయని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ నసీం తెలిపారు. ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా జనవరి 10లోగా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.100 అపరాధ రుసుముతో 16వ తేదీ వరకు ఫీజును చెల్లించవచ్చని తెలిపారు. రేపు తెయూలో ఉర్దూ భాషా ఉత్సవాలు తెయూ(డిచ్పల్లి) : తెయూ ఉర్దూ విభాగం ఆధ్వర్యంలో 2013 ఉర్దూ ఉత్సవాలను సోమవారం నుంచి నిర్వహించనున్నట్లు ఉర్దూ విభాగం అధ్యక్షుడు డాక్టర్ అత్తర్ సుల్తానా శనివారం ఒక ప్రక టనలో తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఉత్సవంలో అంతర్జాతీయ ప్రసిద్ధి పొందిన డాక్టర్ సయీద్ తాకీ అబీదీ (కెనడా) ముఖ్యఅతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. ఆయన రచించిన ‘ఫైజ్ షెనాసీ’ అనే గ్రంథాన్ని తెయూ వీసీ అక్బర్ అలీఖాన్ ఆవిష్కరిస్తారని ఆమె తెలిపారు.