తెయూ(డిచ్‌పల్లి), న్యూస్‌లైన్ : రాజ్యాంగ బద్ధంగా, పక్షపాతం లేకుండా రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలను సమానంగా చూడాల్సిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కేవలం సీమాంధ్ర ప్రాంత సీఎంగా వ్యవహరించడం సిగ్గుచేటని బీసీ సంక్షేమ సంఘం మం డల అధ్యక్షుడు సదానంద్ అన్నారు. శనివారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు సీఎంను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు పోస్టుకార్డులు పంపించారు. ఈ సందర్భంగా సదానంద్ మాట్లాడుతూ.. దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి పంపించిన తెలంగాణ బిల్లును ఆమోదించాల్సింది పోయి, నాలుగున్నర కోట్ల ప్రజల చిరకాల ఆకాంక్ష, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుత గులుతూ, తన సీమాంధ్ర పక్షపాతాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకుంటానని పిచ్చి ప్రేలాపనలు చేయడం సీఎం దిగజారు డు తనానికి నిదర్శమని ధ్వజమెత్తారు. సీఎంను బర్తరఫ్ చేయాలని కోరుతూ పోస్టు కార్డు ఉద్యమాన్ని నిర్వహిస్తున్నామని ఇందుకు ప్రతి తెలంగాణ పౌరుడు సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మండల ఉపాధ్యక్షుడు చింతల దాసు, సభ్యులు కళ్యాణ్, గుజ్జరి నర్సయ్య, బుజ్జన్న, ఆనంద్, తెయూ విద్యార్థులు నాగభూషణం, రాజు, సంతోశ్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఎంబీఏ, ఎంసీఏ పరీక్షా ఫీజు షెడ్యూల్
తెయూ(డిచ్‌పల్లి) : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ఎంసీఏ, ఎంబీఏ మొదటి సెమిస్టర్ , ఐదు సంవత్సరాల ఎంఎస్సీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఎంఏ అప్లయిడ్ ఎకనామిక్స్, మొదటి, మూడు సెమిస్టర్ల రెగ్యులర్ పరీక్షలు 2014 ఫిబ్రవరిలో జరుగుతాయని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ నసీం తెలిపారు. ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా జనవరి 10లోగా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. రూ.100 అపరాధ రుసుముతో 16వ తేదీ వరకు ఫీజును చెల్లించవచ్చని తెలిపారు.
రేపు తెయూలో ఉర్దూ భాషా ఉత్సవాలు
తెయూ(డిచ్‌పల్లి) : తెయూ ఉర్దూ విభాగం ఆధ్వర్యంలో 2013 ఉర్దూ ఉత్సవాలను సోమవారం నుంచి నిర్వహించనున్నట్లు ఉర్దూ విభాగం అధ్యక్షుడు డాక్టర్ అత్తర్ సుల్తానా శనివారం ఒక ప్రక టనలో తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఉత్సవంలో అంతర్జాతీయ ప్రసిద్ధి పొందిన డాక్టర్ సయీద్ తాకీ అబీదీ (కెనడా) ముఖ్యఅతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. ఆయన రచించిన ‘ఫైజ్ షెనాసీ’ అనే గ్రంథాన్ని తెయూ వీసీ అక్బర్ అలీఖాన్ ఆవిష్కరిస్తారని ఆమె తెలిపారు.
సీఎం కిరణ్‌ను బర్తరఫ్ చేయాలి
Published Sun, Dec 22 2013 6:49 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement