కిరణ్కు గవర్నర్ ఝలక్! | Kiran's last minute transfers stop | Sakshi
Sakshi News home page

కిరణ్కు గవర్నర్ ఝలక్!

Published Mon, Mar 3 2014 8:04 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

గవర్నర్ నరసింహన్-మాజీ సిఎం కిరణ్ - Sakshi

గవర్నర్ నరసింహన్-మాజీ సిఎం కిరణ్

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ నరసింహన్ ఝలక్ ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రిగా చివరి నిమిషంలో చేసిన బదిలీలను నిలుపుదల చేశారు. ఐఏఎస్ బదిలీలను గవర్నర్ నిలిపివేశారు.  రవాణా శాఖ కమిషనర్గా  అనంతరాములును కొనసాగిస్తున్నారు. ఏపీ జెన్‌కో ఎండీగా కె.విజయానంద్ను కూడా  కొనసాగిస్తున్నారు. ఎస్‌ఎస్ రావత్‌ను సాంఘీక సంక్షేమశాఖ సెక్రటరీగా నియమించారు.

కిరణ్ భర్తీ చేసిన నామిటేడెట్ పోస్టుల నుంచి వైదొలగాలంటూ గవర్నర్ అనధికార ఉత్తర్వులు జారీ చేశారు. శాఖలవారీగా నామినేటెడ్ పోస్టుల వివరాలను కూడా  గవర్నర్ కోరారు. అందులో భాగంగానే రాజీవ్ కిరణాలు అమలు పథకం చైర్మన్ పదవికి కెసి రెడ్డి రాజీనామా చేశారు.   కెసి రెడ్డి  ఈరోజు  గవర్నర్ను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement