న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఇటీవల బస్సుపై ఉగ్రవాదుల దాడి కేసు దర్యాప్తును కేంద్రం హోంశాఖ... జాతీయ పరిశోధన సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించింది. జమ్మూకశ్మీర్ శాంతిభద్రతలు, అమర్‌నాథ్ యాత్రకు సంబంధించిన సన్నాహాలపై వరుస సమీక్షా సమావేశాల అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఢిల్లీ నుంచి మాతా వైష్ణోదేవీ ఆలయానికి వెళ్తున్న యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై రియాసి జిల్లాలో జూన్ 9న ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. డ్రైవర్‌కు బుల్లెట్ తగలడంతో బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు సహా తొమ్మిది మంది మరణించారు. 41 మంది గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment