‘ప్రజ్ఞ పోటీ చేయకుండా నిషేధించలేం’ | Special NIA Court negated application to prohibit Pragya Singh | Sakshi
Sakshi News home page

‘ప్రజ్ఞ పోటీ చేయకుండా నిషేధించలేం’

Published Thu, Apr 25 2019 5:10 AM | Last Updated on Thu, Apr 25 2019 8:09 AM

Special NIA Court negated application to prohibit Pragya Singh - Sakshi

ముంబై: భోపాల్‌ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌ను ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా నిషేధం విధించాలంటూ వచ్చిన పిటిషన్‌ను ముంబైలోని ఎన్‌ఐఏ కోర్టు తిరస్కరించింది. ఆ అధికారం తమకు లేదనీ, ఎన్నికల అధికారులే ఆ పని చేయగలరంది. మాలేగావ్‌ పేలుళ్లలో తన కొడుకును కోల్పోయిన నిసార్‌ సయ్యద్‌ ఈ పిటిషన్‌ వేశారు. ఈ పేలుళ్ల సూత్రధారి ప్రజ్ఞా సింగేననే ఆరోపణలు ఉన్నందున ఆమె ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని ఆయన కోరారు. ఆమెకు మంజూరయిన బెయిల్‌ను కూడా రద్దు చేయాలన్నారు. ఎన్‌ఐఏ ప్రత్యేక జడ్జి వీఎస్‌ పడాల్కర్‌ ఆ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ‘మాకు అలాంటి అధికారం లేదు. ఎన్నికల్లో పోటీచేయకుండా మేం ఎవ్వరిపైనా నిషేధం విధించలేం’ అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement