malegaon blast case
-
యోగి, ఆర్ఎస్ఎస్ పేరు చెప్పమని ఏటీఎస్ బెదిరించింది
ముంబై: పేలుడు కేసులో నలుగురు ఆర్ఎస్ఎస్ నేతలు, యూపీ సీఎం ఆదిత్యనాథ్ పేర్లను చెప్పమని ముంబై ఏటీఎస్ (యాంటీ టెర్రరిజం స్క్వాడ్) తనను బెదిరించిందని 2008 మాలేగాం పేలుడు కేసులో సాక్షి మంగళవారం కోర్టుకు చెప్పారు. నాడు ఆ కేసును ప్రస్తుతం పలు కేసులు ఎదుర్కొంటున్న పరమ్‌బీర్ సింగ్ పర్యవేక్షించారు. నాడు సదరు సాక్షి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. అయితే హఠాత్తుగా తనను బెదిరించి పేర్లు చెప్పించారని సాక్షి కోర్టుకు చెప్పడం కలకలం రేపింది. కేసుపై ఎన్ఐఏ కోర్టు విచారణ జరుపుతోంది. పరమ్‌బీర్ సహా మరో అధికారి యోగి, ఆర్ఎస్ఎస్ నేతల పేర్లను చెప్పమని బెదిరించారని తాజా విచారణలో సాక్షి కోర్టుకు విన్నవించారు. తనను ఏటీఎస్ హింసిందన్నారు. దీంతో సాక్షి ఏటీఎస్ ముందు ఇచ్చిన స్టేట్మెంట్ను అంగీకరించమని కోర్టు ప్రకటించింది. ఇంతవరకు ఈ కేసులో 220 సాక్షులను విచారించారు. వీరిలో 15మంది అడ్డం తిరిగారు. ఈ నేపథ్యంలో తమపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు మన్మోహన్, సోనియా గాంధీ, రాహుల్, సల్మాన్‌ఖుర్షిద్, ప్రియాంక క్షమాపణలు చెప్పాలని ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేశ్ కుమార్ డిమాండ్ చేశారు. యూపీఏ హయాంలో రాజకీయ కుట్రతో ఈ కేసును రిజిస్టర్ చేశారన్నారు. కాంగ్రెస్ కుట్రలను తనను బెదిరించారన్న సాక్షి స్టేట్మెంట్ బహిర్గతం చేసిందన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇతర ప్రతిపక్షాలు సైతం కాంగ్రెస్‌కు వత్తాసు పలికాయని విమర్శించారు. -
‘సాధ్వీ ప్రజ్ఞాసింగ్’ కేసు ఏమవుతుంది !?
సాక్షి, న్యూఢిల్లీ : 2008 నాటి మాలేగావ్ బాంబు పేలుడు కేసు విచారణను గోప్యంగా నిర్వహించాలని కోరుతూ ఆ కేసును దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ: అత్యున్నత యాంటి టెర్రరిస్టు దర్యాప్తు సంస్థ) ఆగస్టు రెండవ తేదీన ముంబైలోని ప్రత్యేక కోర్టుకు ఓ దరఖాస్తు దాఖలు చేసుకొంది. ఇక్కడ కేసును గోప్యంగా విచారించడం అంటే కేసుతో సంబంధం ఉన్న నిందితులు, సాక్షులు, న్యాయవాదులు, అవసరమైన కోర్టు సిబ్బంది మినహా మిగతా ప్రజలు ఎవరూ కోర్టు హాలులో ఉండరాదు. ముఖ్యంగా మీడియాను అనుమతించరాదు. ఉత్తర మహారాష్ట్రలోని మాలేగావ్‌లో 2008, రంజాన్ మాసం ఆఖరి రోజైన సెప్టెంబర్ 29వ తేదీన ఓ మసీదు సమీపంలో ఓ మోటారు సైకిల్‌కు అమర్చిన బాంబు పేలడం వల్ల ఆరుగురు మరణించడం, వంద మంది దాకా గాయపడడం తెల్సిందే. బాంబు అమర్చిన మోటార్‌సైకిల్ ప్రస్తుతం బీజేపీ లోక్‌సభ సభ్యురాలైన సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ పేరు మీద రిజిస్టర్ అయి ఉందని, ముస్లిం టెర్రరిజానికి వ్యతిరేకంగా ఆమె, మరికొంత మంది హిందూత్వ వాదులు కుట్ర పన్ని ఈ ‘హిందూ టెర్రరిజం’కు పాల్పడ్డారని నాడు ఆరోపణలు, వార్తలు వచ్చాయి. దేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించే లక్ష్యంతో ప్రజ్ఞాసింగ్ మరికొంత మంది తీవ్ర హిందూత్వవాదులు ‘అభినవ్ భారత్’ అనే సంస్థను కూడా ఏర్పాటు చేసినట్లు వార్తలు వచ్చాయి. మత సామరస్యం, జాతీయ భద్రత, శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకొనే ఈ కేసు విచారణను గోప్యంగా నిర్వహించాలని కోరుతున్నట్లు ఎన్ఐఏ తన దరఖాస్తులో పేర్కొంది. ఇది కేవలం సాకు మాత్రమేనని, ఇందులో ఏదో మర్మం ఉందని సులభంగానే గ్రహించవచ్చు. అది ఎప్పుడూ నిందితలు పక్షం వహిస్తూ రావడమే అందుకు రుజువు. ఈ కేసులో ఠాకూర్, ఇతర నిందితుల పట్ల మెతక వైఖరి అవలంబించాల్సిందిగా ఎన్ఐఏ తనపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోహిణీ సేలియన్ బహిరంగంగా ఆరోపించడం తెల్సిందే. ఠాకూర్, ఇతర నిందితులపై చార్జిషీటు నమోదు చేసేందుకు సరైన ఆధారాలు లేనందున వారిని కేసు నుంచి మినహాయించాలని కోరుతూ 2016లో ఎన్ఐఏ ఓ అనుబంధ నివేదికను ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. గత ఐదేళ్లుగా కేసు దర్యాప్తు జరిపి మీరు తేల్చింది చివరకు ఇదా, కేసు విచారణ కొనసాగాల్సిందేనంటూ ఆ నివేదికను పరిగణలోకి తీసుకునేందుకు ప్రత్యేక కోర్టు నిరాకరించింది. 2011లో ఈ కేసు విచారణను ఎన్ఐఏ స్వీకరించిన విషయం తెల్సిందే. అప్పటి వరకు మహారాష్ట్ర యాంటి టెర్రరిజమ్ స్క్వాడ్ ఈ కేసు విచారణను కొనసాగించింది. ఈ కేసులో త్వరలో ప్రాసిక్యూషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ‘ఇన్ కెమేరా (గోప్యంగా)’లో కేసు విచారణ జరగాలంటూ ఎన్ఐఏ దరఖాస్తు చేసుకుంది. కేసు విచారణ సందర్భంగా ఉద్దేశపూర్వకంగానే నిందిల పట్ల మెతక వైఖరి అవలంబిస్తే అది బయటకు తెలుస్తుందని, సరైన ఆధారాలు చూపకపోతే సంస్థ వైఫల్యం ప్రజలకు, ముఖ్యంగా మీడియాకు తెలుస్తుందనే ఉద్దేశంతోనే ఎన్ఐఏ సంస్థ ఈ దరఖాస్తు చేసినట్లు మీడియా అనుమానిస్తోంది. అందుకనే కొంత మంది జర్నలిస్టులు కలిసి ఎన్ఐఏ దరఖాస్తును సవాల్ చేస్తూ ఆగస్టు ఐదవ తేదీన ఓ పిటిషన్ దాఖలు చేశారు. మీడియాను అనుమతించక పోవడం అంటే భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని కూడా వాదించింది. దీనిపై కోర్టు తీర్పు ఇంకా వెలువడాల్సి ఉంది. ‘కేసులో న్యాయం జరగడమే కాదు, అది జరిగినట్లు బయటకు కనిపించాలి’ అంటూ సుప్రీం కోర్టు పలు సందర్భాల్లో సహజ న్యాయ సూత్రాన్ని ప్రకటించింది. ఆ రకంగానైనా కేసులో బహిరంగ విచారణే కొనసాగించాలి. మరి ప్రజ్ఞాసింగ్ కేసులో ఏమవుతుందో చూడాలి!! -
మాలేగావ్ కేసు :సాధ్వి ప్రజ్ఞాసింగ్‌కు షాక్
ముంబై : మాలెగావ్ పేలుళ్ల కేసులో వారానికి ఒకసారి కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావడాన్ని శాశ్వతంగా మినహాయించాలని బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ దాఖలు చేసిన అప్పీల్‌ను ముంబైలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు తిరస్కరించింది. తాను ఎంపీ కావడంతో రోజూ పార్లమెంట్‌కు హాజరు కావాల్సి ఉన్నందున కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ప్రజ్ఞా సింగ్ కోర్టుకు సమర్పించిన అప్లికేషన్లో పేర్కొన్నారు. అయితే 2008 మాలెగావ్ పేలుళ్ల కేసుకు సంబంధించి గురువారం ఒక్కరోజే ఆమెను వ్యక్తిగత హాజరు నుంచి కోర్టు మినహాయించింది. కాగా తనకు ముంబై పరిసరాల్లో ఎక్కడా నివాస గృహం లేదని, ముంబైలో ఉండగా తనకు భద్రతా ఏర్పాట్లు చేపట్టడం అసౌకర్యంగా ఉంటుందని కూడా ఆమె తన దరఖాస్తులో పేర్కొన్నారు. సాధ్వి ప్రజ్ఞా సింగ్‌తో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ప్రసాద్ పురోహిత్, మేజర్ రిటైర్డ్ రమేష్ ఉపాధ్యాయ్, అజయ్ రహిర్కర్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణిలు బెయిల్‌పై ఉన్నారు. సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో భోపాల్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇక మాలెగావ్ పేలుళ్ల కేసులో 2008లో అరెస్ట్ అయిన ప్రజ్ఞా సింగ్‌కు తొమ్మిదేళ్ల తర్వాత అనారోగ్య కారణాలతో బెయిల్ మంజూరైంది. -
సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌పై కేసు లేదా!
సాక్షి, న్యూఢిల్లీ: ‘2014 ఎన్నికల నాటికి సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌పై ఓ కేసుకు సంబంధించి కుట్ర అభియోగాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు వాటిని రెండు కోర్టులు కొట్టివేశాయి’ అని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, రిపిబ్లిక్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ అర్నాబ్ గోస్వామికి ఏప్రిల్ 25వ తేదీన ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అదేరోజు ఆ విషయాన్ని బీజేపీ అధికార ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు కూడా. అది అబద్ధం. 2008, సెప్టెంబర్ 29వ తేదీన మహారాష్ట్రలోని మాలేగావ్‌లో జరిగిన బాంబు పేలుళ్లలో ఆరుగురు మరణించడం, దాదాపు వంద మంది గాయపడడం తెల్సిందే. ఈ కేసుకు సంబంధించి మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల చట్టం, చట్ట విరుద్ధ కార్యకలాపాల చట్టం కింద నమోదు చేసిన అభియోగాలను ఎన్ఐఏ కోర్టు 2017, డిసెంబర్ 27వ తేదీన కొట్టి వేసింది. ఇండియన్ పీనల్ కోడ్ కింద దాఖలు చేసిన అభియోగాలను కొట్టి వేయలేదు. పైగా ‘ఇండియన్ పీనల్ కోడ్‌కు సంబంధించి మాలేగావ్ బాంబు పేలుళ్లకు కుట్రపన్నారనడానికి ప్రజ్ఞాసింగ్, ఇతర నిందితులకు వ్యతిరేకంగా ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని నేను ఇదివరకే చెప్పాను’ అని ఎన్ఐఏ కోర్టు ప్రత్యేక జడ్జీ వీఎస్ పడాల్కర్ వ్యాఖ్యానించారు. అంతేకాదు హత్య, నేరపూరిత కుట్ర, రెండు మతాల మధ్య వైషమ్యాలను ప్రోత్సహించడం, ప్రభుత్వ, ప్రజల ఆస్తికి నష్టం కలిగించడం తదితర అభియోగాలపై సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌తోపాటు మరో ఆరుగురు నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని 302, 307, 326, 324, 427,153ఏ, 120 బీ సెక్షన్ల కింద, 1908 నాటి పేలుడు పదార్థాల చట్టంలోని 3,4,5,6 సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసినట్లు 2018, అక్టోబర్ 30 నాడు ఎన్ఐఏ కోర్టు తాజా ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం వీటిపై విచారణ కొనసాగుతోంది. బ్రెస్ట్ క్యాన్సర్ నివారణ కోసం మూడుసార్లు ఆపరేషన్ చేయించుకున్న ప్రజ్ఞాసింగ్ అనారోగ్య కారణాలపై ఎప్పుడో బెయిల్ తీసుకున్నారు. ఈ కోర్టుతోపాటు సుప్రీం కోర్టు కూడా ఆమెపై అభియోగాలను కొట్టివేసిందని అమిత్ షా ప్రకటించారు. సుప్రీం కోర్టు కూడా మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల కింద అభియోగాలు మోపడం సబబేనా అంటూ సందేహం వ్యక్తం చేసిందీ తప్ప కేసును కొట్టివేయలేదు. తీవ్రమైన కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఎలా టిక్కెట్ ఇచ్చారని ఓటర్లు భావించే అవకాశం ఉందన్న కారణంగా అమిత్ షా తప్పుడు ప్రచారాన్ని అందుకొని ఉండవచ్చు. భోపాల్ నుంచి ప్రజ్ఞాసింగ్ పోటీ చేస్తున్నట్లు ఏప్రిల్ 20వ తేదీన బీజేపీ ప్రకటించిన విషయం తెల్సిందే. అంతకు మూడు రోజుల ముందే ఆమెను బీజేపీ లాంఛనంగా పార్టీలో చేర్చుకుంది. -
ప్రజ్ఞ అప్పట్లో ఒకరిని పొడిచింది
జబల్పూర్: మాలేగావ్ కేసులో నిందితురాలు, భోపాల్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిని ప్రజ్ఞాసింగ్‌పై ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2001లో ఆమె ఒక వ్యక్తిని పొడిచారని ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘ప్రజ్ఞా ఠాకూర్‌కు ఛత్తీస్‌గఢ్‌తో ఒక సంబంధం ఉంది. ఆమె మరిది బిలాయ్‌గఢ్‌లో పనిచేసేవారు. అప్పట్లో ఆమె దగ్గర ఎప్పుడూ ఒక కత్తి ఉండేది. 2001లో బిలాయ్‌గఢ్‌లో శైలేంద్ర దేవ్‌గణ్ అనే వ్యక్తి ఛాతీపై ఆమె కత్తితో పొడిచింది. ఆమె తరచూ గొడవల్లో తలదూర్చేది. ఆమెది నేర స్వభావం. అంతేతప్ప, సాధ్వి మాదిరిగా మాత్రం కాదు’ అని అన్నారు. సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ప్రతినిధి హితేశ్ బాజ్‌పేయి తీవ్రంగా స్పందించారు. ‘సీఎం సారీ చెప్పాలి. లేదంటే మేం వేసే పరువునష్టం కేసుకు సిద్ధపడాలి’ అని హెచ్చరించారు. -
‘ప్రజ్ఞ పోటీ చేయకుండా నిషేధించలేం’
ముంబై: భోపాల్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌ను ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా నిషేధం విధించాలంటూ వచ్చిన పిటిషన్‌ను ముంబైలోని ఎన్ఐఏ కోర్టు తిరస్కరించింది. ఆ అధికారం తమకు లేదనీ, ఎన్నికల అధికారులే ఆ పని చేయగలరంది. మాలేగావ్ పేలుళ్లలో తన కొడుకును కోల్పోయిన నిసార్ సయ్యద్ ఈ పిటిషన్ వేశారు. ఈ పేలుళ్ల సూత్రధారి ప్రజ్ఞా సింగేననే ఆరోపణలు ఉన్నందున ఆమె ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని ఆయన కోరారు. ఆమెకు మంజూరయిన బెయిల్‌ను కూడా రద్దు చేయాలన్నారు. ఎన్ఐఏ ప్రత్యేక జడ్జి వీఎస్ పడాల్కర్ ఆ పిటిషన్‌ను తిరస్కరిస్తూ ‘మాకు అలాంటి అధికారం లేదు. ఎన్నికల్లో పోటీచేయకుండా మేం ఎవ్వరిపైనా నిషేధం విధించలేం’ అని పేర్కొన్నారు. -
ప్రజ్ఞాకు ఈసీ నోటీసులు
భోపాల్: మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలు, భోపాల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కు ఎలక్షన్ కమిషన్ శనివారం నోటీసులు జారీ చేసింది. 26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన ఐపీఎస్ అధికారి హేమంత్ కర్కరేపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ నోటీసులిచ్చింది. ప్రజ్ఞాతో పాటు బీజేపీ భోపాల్ యూనిట్ అధ్యక్షుడు వికాస్ విరానీకి నోటీసులు ఇచ్చినట్లు భోపాల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుదామ్ చెప్పారు. 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. ప్రజ్ఞా వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించామని, దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాల్సిందిగా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ (ఏఆర్వో) ను కోరామన్నారు. శనివారం ఉదయం ఆయన ఈ నివేదికను అందించారని.. దీనిపై ప్రజ్ఞా, వికాస్‌లకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ఏఆర్వో ఇచ్చిన నివేదికను ఎలక్షన్ కమిషన్‌కు పంపనున్నామని వెల్లడించారు. కాగా, గురువారం భోపాల్‌లో బీజేపీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ప్రజ్ఞామాట్లాడుతూ.. తన శాపం వల్లనే హేమంత్ చనిపోయారని వ్యాఖ్యానించారు. -
మాలెగావ్ కేసు : సాధ్వి ప్రాగ్య, పురోహిత్‌లపై అభియోగాలు
సాక్షి, ముంబై : 2008 మాలెగావ్ పేలుళ్ల కేసులో సాధ్వి ప్రాగ్య, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్‌లపై ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్ధానం మంగళవారం అభియోగాలు నమోదు చేసింది. వీరిద్దరితో సహా ఏడుగురిపై కుట్ర, హత్యాయత్నం సహా పలు అభియోగాలు మోపింది. అయితే తామెలాంటి నేరానికి పాల్పడలేదని నిందితులు వాదించగా కేసు విచారణను నవంబర్ రెండుకు న్యాయస్ధానం వాయిదా వేసింది. 2008, సెప్టెంబర్ 29న మాలెగావ్‌లోని మసీదు సమీపంలో జరిగిన పేలుళ్లలో ఆరుగురు మరణించగా, వంద మందికిపైగా గాయాలయ్యాయి. ఈ కేసులో పురోహిత్, ప్రగ్యా సింగ్‌లతో పాటు రిటైర్డ్ మేజర్ రమేష్ ఉపాధ్యాయ్, సమీర్ కులకర్ణి, అజయ్ రహిర్కార్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేదిలపై ఎన్ఐఏ ఇతర నిందితులుగా పేర్కొంది. కాగా ఈ కేసు నుంచి తమను తప్పించాలని కోరుతూ సాధ్వి ప్రగ్యా, పురోహిత్ సహా ఇతర నిందితుల వినతిని గత ఏడాది డిసెంబర్ 27న ఎన్ఐఏ న్యాయస్ధానం తోసిపుచ్చింది. -
నేరం చేసానని ఒప్పుకోమని హింసిస్తున్నారు
న్యూఢిల్లీ : ‘2008, మాలేగావ్ పేలుళ్ల కేసు’లో ప్రధాన నిందుతుడుగా శిక్ష అనుభవిస్తున్న మాజీ లెఫ్టినెంట్ కల్నల్ శ్రీకాంత్ ప్రసాద్ పురోహిత్ గతంలో రాసిన ఒక ఉత్తరం ఇప్పుడు పోలీసు డిపార్ట్మెంట్లో కలకలం రేపుతుంది. మాలేగావ్ పేలుళ్ల కేసులో ప్రధాన నిందుతుడిగా మహారాష్ట్ర ‘యాంటి టెర్రరిజమ్ స్క్వాడ్’(ఏటీఎస్) కస్టడీలో ఉన్న సమయంలో ఏటీఎస్ అధికారులు తనను విపరీతంగా టార్చర్ చేస్తున్నారని 2013, డిసెంబర్లో ‘జాతీయ మానవ హక్కుల కమిషన్’కు ఓ 24 పేజీల లేఖ రాసాడు పురోహిత్. నావీ ముంబై జైల్లో ఏటీఎస్ కస్టడీలో ఉన్నప్పుడు వారు తనను బలవంతంగా నేరం ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నాడు. తాను ఏ నేరం చేయలేదని కానీ ఏటీఎస్ అధికారులు మాత్రం తనను కొట్టి, హింసించి తన చేత బలవంతంగా నేరం ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నట్లు లేఖలో తెలిపాడు. కేవలం ఏటీఎస్ అధికారులు మాత్రమే కాక ఆర్మీ అధికారులు కూడా తనను హింసించారని, అంతేకాక తనచేత బలవంతంగా మరో ఆరుగురు అధికారుల పేర్లను కూడా చెప్పించారని పేర్కొన్నాడు. 2008, సెప్టెంబర్ 29న మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా, మాలేగావ్‌లో జరిగిన ఈ పేలుళ్లలో ఏడుగురు మరణించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా అరెస్టయిన పురోహిత్‌కు గతేడాది సెప్టెంబర్‌లో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా పురోహిత్ రాజకీయ కుట్రల వల్లనే తాను తొమ్మిదేళ్లు జైలు జీవితం గడిపానని తెలిపాడు. పురోహిత్ రాసిన లేఖ గురించి పోలీసు అధికారులు ‘పురోహిత్ ఈ లేఖను 2013లో రాసాడు...అప్పుడే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ విషయాన్ని దర్యాప్తు చేసింది. అంతేకాక పురోహిత్ లేఖలో పేర్కొన్న అధికారులు కూడా పురోహిత్ ఆరోపణలపై స్పందించార’ని పోలీసు అధికారులు తెలిపారు. -
పురోహిత్ పిటిషన్‌పై స్పందించండి: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితుడు లెఫ్టినెంట్ కల్నల్ శ్రీకాంత్ పురోహిత్ దాఖలు చేసిన పిటిషన్‌పై జవాబు చెప్పాలని సుప్రీంకోర్టు సోమవారం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అధికారిక అనుమతులు రాకుండానే ఈ కేసులో ఎన్ఐఏ తనపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం కింద కేసు నమోదు చేసిందని ఆరోపించారు. కాబట్టి ఈ కేసులో దిగువకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని అభ్యర్థించాడు. దీనిపై ఆర్కే అగర్వాల్ నేతృత్వంలోని బెంచ్ స్పందిస్తూ ఈ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని మహారాష్ట్రను ఆదేశించింది. అయితే దిగువకోర్టు నిర్ణయంపై జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఇదే విషయమై గతంలో పురోహిత్ దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో నిందితుడిపై మోకా చట్ట ప్రకారం దాఖలైన సెక్షన్లను తోసిపుచ్చిన దిగువకోర్టు చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం ప్రకారం మాత్రం విచారణ కొనసాగుతుందని గత డిసెంబరులో ఆదేశాలు జారీ చేసింది. మహారాష్ట్రలోని మాలేగావ్‌లో 2008లో జరిగిన పేలుళ్లలో పలువురు మరణించిన విషయం తెలిసిందే. -
సాధ్వి ప్రగ్యాకు ఊరట
సాక్షి, ముంబై : 2008 మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు అనూహ్యమైన తీర్పును వెలవరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సాధ్వి ప్రగ్యాసింగ్ థాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ శ్రీకాంత్ ప్రసాద్ పురోహిత్‌లకు ఈ కేసు నుంచి పాక్షిక ఉపశమనం కల్పించేలా ఎన్ఐఏ కోర్టు తీర్పును వెలవరించింది. మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల చట్టం (ఎంసీఓసీఏ) కింద సాధ్వి ప్ర్ర్రజ్ఞ సింగ్, రమేష్ ఉపాధ్యాయ్, అజయ్ రహికర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్‌లకు విముక్తి కల్పించింది. ఇదిలావుండగా 2008 మాలెగావ్ బాంబు పేలుళ్ల కేసులో సాధ్వి ప్రగ్యాసింగ్, కల్నల్ పురోహిత్‌లపై సెక్షన్ 18తో పాటు వివిధ ఐపీసీ సెక్షన్ల ప్రకారం చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించింనదుకు విచారణ కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం బెయిలుపై విడుదలైన నిందులకు అదేబెయిల్ కొనసాగుతుందని కోర్టు తెలిపింది. ఈ కేసుపై తదుపరి విచారణ జనవరి 15న జరగనుందని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వెల్లడించింది. పేలుళ్ల కోసం మోటార్ సైకిల్‌ను వినియోగిస్తున్న విషయం సాధ్వి ప్రగ్యాకు ముందే తెలుసునని, అందువల్ల ఆమెను కుట్ర ఆరోపణల నుంచి విముక్తి కల్పించడం అసాధ్యమని కోర్టు తెలిపింది. ఇదిలావుండగా.. మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసునుంచి తమకు విముక్తి కల్పించాలంటూ.. సాధ్వి ప్రగ్య, సమీర్ కులకర్ణి తదితరులు చేసుకున్న విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. మాలేగావ్‌లోని హమిదియా మసీద్ వద్ద 2008 సెప్టెంబర్ 29న జరిగిన బాంబు పేలుడులో ఆరుమంది మరణించడగా.. 101 మంది గాయపడ్డారు. పేలుడు జరిగిన మసీదు ప్రాంతం నాసిక్‌లో అత్యంత సున్నితమైంది. -
తొమ్మిదేళ్లకు బయటికొచ్చిన పురోహిత్
న్యూఢిల్లీ: 2008లో మాలేగావ్ పేలుడు కేసులో అరెస్టయి తొమ్మిది ఏళ్లు జైలుజీవితం గడిపిన లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ బుధవారం బెయిలుపై విడుదలయ్యారు. సుప్రీంకోర్టు బెయిలు మంజూరుచేయడంతో నవీముంబై తలోజా జైలు నుంచి విడుదలైన పురోహిత్ బుధవారం ముంబైలో ఆర్మీ యూనిట్‌కు చేరుకున్నారు. జైలు నుంచి విడుదలైన ఆయనను సైన్యం పటిష్టభద్రత నడుమ దక్షిణముంబైలోని కొలాబాకు తరలించింది. ప్రాణహాని ఉందన్న సమాచారంతో ఆయనకు రక్షణగా పోలీసులను నియమించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఆయన ఓ హిందువు కాబట్టే...
హైదరాబాద్: మాలెగావ్ పేలుళ్ల కేసులో ఆరోపణలు ఎదుర్కున్న లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్‌కు ఊరట లభించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. కేవలం హిందువు అయిన కారణంగానే పురోహిత్‌కు బెయిల్ లభించిందని ఒవైసీ వ్యాఖ్యానించారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ హిందూ నేరస్థులపై సానుకూల ధోరణితో వ్యవహరిస్తున్నారు. అందుకే పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న పురోహిత్‌కు బెయిల్ దక్కింది’ అని ఒవైసీ తెలిపారు. హైదరాబాద్ లో ఓ జాతీయ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ... ప్రధాని మోదీ అధికారం చేపట్టినప్పటి పలు కేసుల్లో హిందువులు మాత్రమే బయటకు వస్తున్నారని చెప్పారు. బెయిల్ అనేది ఇండియాలో ఉన్న ప్రతీ పౌరుడి హక్కు అని, కానీ, ముస్లిం, దళిత మరియు గిరిజన ప్రజలకు మాత్రం అది దక్కటం లేదని ఒవైసీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. టెర్రిరిజం మతం నుంచి పుట్టదన్న ఆయన, కొందరు దానిని మతానికి ఆపాదిస్తున్నారని చెప్పుకొచ్చారు. పురోహిత్‌కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు ఉన్నప్పటికీ ఆయనకు నిర్దోషిగానే పరిగణింపబడుతున్నారని ఒవైసీ చెబుతున్నారు. కాగా, బాంబే హైకోర్టు తీర్పును తోసిపుచ్చి సుప్రీంకోర్టు పురోహిత్‌కు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. రాజకీయ కుట్రలో పురోహిత్ బలయ్యారంటూ ఆయన తరపున హరీశ్ సాల్వే బలమైన వాదనలు వినిపించారు. వాదనతో ఏకీభవించిన కోర్టు 9 ఏళ్ల అనంతరం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కాగా, 2008 మాలెగావ్ పేలుళ్లలో నలుగురు మృత్యువాత పడగా, 79 మంది గాయపడ్డారు. ఆ సమయంలో పురోహిత్ ఇంటలిజెన్స్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించగా, సాధ్వీ ప్రగ్యాతోపాటు నిందితుడిగా పురోహిత్ ఆరోపణలు ఎదుర్కున్నారు. పురోహిత్ ఓ ఆర్ఎస్ఎస్ వాది: దిగ్విజయ్ మాలెగావ్ కేసులో నిందితులను రక్షించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ నేతలు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. పురోహిత్ కూడా ఆ వర్గానికి చెందిన వారే. అందుకే ఆయనకు బెయిల్ లభించిందని దిగ్విజయ్ ట్వీట్ చేశారు. అయితే ఆయన ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ సహయ మంత్రి కిరణ్ రిట్జూ మీడియాకు తెలిపారు. -
సాధ్వీకి బెయిల్ ఎవరిచ్చారు ?
న్యూఢిల్లీ: ‘రిప్ ఇండియన్ జస్టిస్’ అనే నినాదం ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కెర్లు కొడుతోంది. 2008లో జరిగిన మాలేగావ్ పేలుళ్ల కేసుల్లో ప్రధాన నిందితురాలైన సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కు ముంబై హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని తప్పుపడుతూ ఈ నినాదం ఊపందుకుంది. ‘రిప్ ఇండియన్ జస్టిస్’ అంటే ఇక్కడ న్యాయవ్యవస్థను చించి వేయండి లేదా రద్దు చేయండి అని అర్థం. ఇలాంటి నినాదాన్ని ప్రచారంలోకి తీసుకరావడానికి ముందు నిజంగా న్యాయవ్యవస్థ తప్పుచేసిందా లేదా కేసును దర్యాప్తు చేసిన సంస్థ తప్పు చేసిందా ? అన్న అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు కేసు ఏమిటీ? మహారాష్ట్రలోని మాలేగావ్‌లో 2008లో సంభవించిన పేలుళ్లలో ఆరుగురు ముస్లింలు మరణించారు. ముస్లిం టెర్రరిస్టు దాడులకు ప్రతీకారంగా హిందూ మత ఛాందసవాదులు పాల్పడిన తొలి పేలుళ్లగా కూడా నాడు ఈ కేసు ప్రచారమైంది. అప్పటి నుంచే ‘కాషాయం టెర్రర్’ అనే పదం కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ పేలుళ్లకు సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ సమక్షంలో కుట్ర జరిగిందని భావించిన మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు అదే సంవత్సరంలో ఆమెను అరెస్టు చేశారు. ఆమె సాధారణ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకుంటే కోర్టు తిరస్కరించింది. బెయిల్ పిటిషన్ల కొట్టివేత ఆ తర్వాత ఈ కేసును మహారాష్ట్ర వ్యవస్థ్రీకత నేరాల నిరోధక చట్టం కిందకు మార్చారు. ఈ చట్టం పరిధిలో నిందితులకు బెయిల్ దొరకడం కష్టం. అయినా సాధ్వీ ప్రజ్ఞాసింగ్ బెయిల్ కోసం నిరంతరంగా ప్రయత్నిస్తూనే వచ్చారు. 2012, 2014 సంవత్సరాల్లో ట్రయల్ కోర్టు రెండు సార్లు, హైకోర్టు రెండుసార్లు ఆమె బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. 2015, నవంబర్‌లో ఆమె బెయిల్ పిటీషన్లను కోర్టులు చివరిసారి కొట్టివేశాయి. సాధ్వీ సమక్షంలో కుట్ర జరిగిందనడానికి ఆధారాలు ఉన్నాయని, అందుకు ఆ కుట్రలో పాల్గొన్న నిందితుల్లో ఇద్దరు ఇచ్చిన వాంగ్మూలాలు అందుకు సరిపోతాయని, అలాగే బాంబులు అమర్చిన మోటార్ సైకిల్ సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌కు చెందినది కావడం కూడా ఆమెపై ప్రాథమిక విచారణ జరిపేందుకు ప్రాతిపదిక అవుతుందని కోర్టులు అభిప్రాయపడ్డాయి. అందుకే బెయిల్ పిటిషన్లను నిరాకరిస్తున్నట్లు ప్రకటించాయి. హఠాత్తుగా మారిపోయిన సాక్ష్యాధారాలు గతేడాది మే నెలలో సాధ్వీపై ఈ ప్రాథమిక ఆధారాలన్నీ మారిపోయాయి. సాధ్వీకి వ్యతిరేకంగా సాక్షమిచ్చిన ఇద్దరు నిందితులు ప్లేటు ఫిరాయించారు. వీరు కాకుండా ఆమెకు వ్యతిరేకంగా సాక్షమిచ్చిన ముగ్గురు సాక్షుల్లో ఒకరు ముందే తన వాంగ్మూలాన్ని మార్చుకోగా, మరొకరు చనిపోయారు. మూడో వ్యక్తి అదశ్యమయ్యారు. మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ నుంచి ఈ కేసును 2011లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) టేకప్ చేసింది. (అప్పటి యూపీఏ ప్రభుత్వం హయాంలో ఈ ఏజెన్సీ ఆవిర్భవించింది) 2014 నాటికల్లా కేసు విచారణను ముగించి చార్జిషీటును దాఖలు చేయడానికి సిద్ధమైంది. సరిగ్గా అదే సమయంలో లోక్‌సభ ఎన్నికలు రావడం, పార్టీ అఖండ విజయంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈలోగా ఏం జరిగిందో ఏమో, చార్జిషీటు దాఖలు చేయాల్సిన ఎన్ఐఏ సంస్థ మనసు మార్చుకొని 2015 సంవత్సరం, చివరలో సాక్షులను పునర్విచారించాలని నిర్ణయించింది. విచారించింది. పునర్ విచారణలో సాక్షులు ప్లేటు ఫిరాయించారు. అనుబంధ చార్జిషీటు ఎందుకొచ్చింది? ఆ తర్వాత గతేడాది మే నెలలో ఎన్ఐఏ సాధ్వీ కేసులో అనుబంధ చార్జిషీటును దాఖలు చేసింది. సాధ్వీకి, ఆరెస్సెస్‌కు చెందిన ఐదుగురు నిందితులకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని తేల్చి చెప్పింది. ఆ మరుసటి నెలలోనే సాధ్వీతోపాటు ఇతర నిందితులకు బెయిల్ మంజూరు చేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టుకు దర్యాప్తు స్పష్టం చేసింది. నేరం చేసినట్లు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నట్లు జడ్జీలు భావించినా సరే దర్యాప్తు సంస్థలకు అభ్యంతరం లేకపోతే సాధరణంగా కోర్టులు బెయిల్ మంజూరు చేస్తాయి. ముంబై మాజీ పోలీసు కమిషనర్ రామ్‌దేవ్ త్యాగి కేసు విషయంలో 2001లో కోర్టు ఇలాగే వ్యవహరించింది. 1992–93 ముంబై అల్లర్లకు సంబంధించిన సులేమాన్ ఉస్మాన్ బేకరీ కేసులో రామ్‌దేవ్ త్యాగి ప్రధాన నిందితుడు. ఆయన నేరం చేశారనడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని జడ్జీలు బలంగా విశ్వసించినప్పటికీ దర్యాప్తు సంస్థకు అభ్యంతరం లేకపోవడం వల్లన బెయిల్ మంజూరైంది. ఇప్పుడు సాధ్వీ కేసులో కూడా ముంబై హైకోర్టు అదే ప్రాతిపదికన బెయిల్ మంజూరు చేసింది. ఎవరు బాధ్యులు...? సాధ్వీ కేసులో మందగమనంతో వ్యవహిరించాల్సిందిగా తనపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని ఎన్ఐఏ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రోహిణి సాలియన్ 2015లో బహిరంగంగా ప్రకటించడం, సాధ్వీకి బెయిల్ రావడం పట్ల విశ్వహిందూ పరిషద్ నాయకుడు ప్రవీణ్ తొగాడియా మాట్లాడుతూ ఇలాంటి కేసుల్లో జైల్లో ఉన్న హిందువులందరిని విడుదల చేసి, వారిపై కేసు కొట్టివేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం కూడా ఇక్కడ గమనార్హమే. ఎవరిని నిందించాలి? సాధ్వీ కేసులో మొదటి నుంచి బెయిల్‌ను వ్యతిరేకిస్తున్న ఎన్ఐఏ సంస్థ ఎందుకు తన మనసు మార్చుకొని నిందితలుకు బెయిల్ ఇవ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది? నిందితులపై తుది చార్జిషీటును దాఖలు చేయాల్సిన ఎన్ఐఏ కేసు విచారణ చేపట్టిన ఐదేళ్లకు సాక్షులను పునర్విచారించాలని ఎందుకు నిర్ణయానికి వచ్చింది. ఎలాంటి సాక్ష్యాధారాలు లేవంటూ ఎందుకు అనుబంధ ఛార్జీషీటు దాఖలు చేసింది? ఈ ప్రశ్నలకు అర్థాలు వెతుక్కుంటే ఎవరిని దూషించాలో అర్థం అవుతుంది. సిబీఐ నుంచి మొదలుకొని యాంటీ టెరరిస్ట్ స్క్వాడ్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ వరకు ఏ దర్యాప్తు సంస్థ పనితీరును పరిశీలించినా కేంద్రం పాలకపక్షం కనుసన్నల్లో దర్యాప్తు అధికారులు మెసలుకుంటున్నారన్నది కూడా అర్థం అవుతుంది. కనుక ‘రిప్ ఇండియన్ జస్టిస్’ అనే బదులు ‘రిప్ ఇండియన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్’ అనే ప్రచారం బాగుంటుందేమో! -
సాధ్వీ ప్రజ్ఞాసింగ్ కు బెయిల్ తిరస్కరణ
ముంబయి: మాలెగావ్ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితురాలు సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కు ప్రత్యేక మోకా కోర్టులో చుక్కెదురు అయింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు మంగళవారం తోసిపుచ్చింది. యూఏపీఏ, ఐపీసీ, ఆయుధాల చట్టం, పేలుడు పదార్థాల చట్టం కింద విచారణ కొనసాగుతున్నందున ప్రజ్ఞాసింగ్ కు బెయిల్ ఇవ్వటం సాధ్యం కాదని ప్రత్యేక న్యాయమూర్తి ఎన్ఏ టికొలే తెలిపారు. కాగా మాలెగావ్ బాంబు పేలుళ్ల కేసులో సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కు ఈ ఏడాది మే నెలలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) క్లీన్చిట్ ఇచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రజ్ఞాసింగ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. కాగా 2008 నాటి ఈ పేలుళ్ల కేసులో ఆమెపైన, మరో ఐదుగురి పైన చేసిన అన్ని అభియోగాల్ని ఎన్ఐఏ శుక్రవారం ఉపసంహరించుకుంది. అదే సమయంలో లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్‌సహా మరో పదిమందిపై మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్(మోకా) చట్టం కింద చేసిన అభియోగాలను సైతం ఉపసంహరించుకుంది. తమ దర్యాప్తులో ప్రజ్ఞ, మరో ఐదుగురికి వ్యతిరేకంగా ఏవిధమైన సాక్ష్యాలు లభించలేదని ఎన్ఐఏ ప్రకటించింది. వారిపై అభియోగాలు కొనసాగించదగినవి కావంటూ అనుబంధ చార్జిషీట్‌ను ప్రత్యేక కోర్టులో దాఖలు చేసింది. 2008, సెప్టెంబర్ 29న మాలెగావ్‌లో జరిగిన జంట పేలుళ్లలో ఏడుగురు మరణించడం తెలిసిందే. కాగా కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళతామని సాధ్వి కుటుంబ సభ్యులు తెలిపారు. -
'మొదట్నుంచి చెబుతూనే ఉన్నాం'
న్యూఢిల్లీ: మాలెగావ్ బాంబు పేలుళ్ల కేసులో సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కు క్లీన్ చీట్ ఇవ్వడాన్ని బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ నేతలు స్వాగతించారు. ఈ కేసుతో సాధ్వి ప్రజ్ఞాసింగ్ కు ఎటువంటి సంబంధం లేదని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని బీజేపీ అధికార ప్రతినిధి, లోక్ సభ ఎంపీ మీనాక్షి లేఖి అన్నారు. సాధ్వికి క్లీన్ చీట్ ఇవ్వడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. కుట్రపూరితంగా సాధ్విని ఈ కేసులో ఇరికించారని ఆర్ఎస్ఎస్ నాయకుడు ఇంద్రేశ్ కుమార్ ఆరోపించారు. పథకం ప్రకారం దేశభక్తులను అప్రదిష్టపాల్జేస్తున్నారని విమర్శించారు. మాలెగావ్ పేలుళ్ల కేసులో సాధ్వి ప్రమేయం లేదని ఎన్ఐఏ చార్జిషీటులో పేర్కొందని, దీంతో ఆమెపై పెట్టిన కేసు ఉపసంహరించబడుతుందని డిఫెన్స్ లాయర్ మహేశ్ జెఠ్మలానీ తెలిపారు. మాలెగావ్ పేలుళ్ల కేసుపై రాజకీయం చేయడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. సాధ్వితో పాటు 12 మంది నిందితులపై 'మోకా' కింద పెట్టిన అభియోగాలను ఎన్ఐఏ ఉపసంహరించుకుంది.