తొమ్మిదేళ్లకు బయటికొచ్చిన పురోహిత్
న్యూఢిల్లీ: 2008లో మాలేగావ్ పేలుడు కేసులో అరెస్టయి తొమ్మిది ఏళ్లు జైలుజీవితం గడిపిన లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్ బుధవారం బెయిలుపై విడుదలయ్యారు. సుప్రీంకోర్టు బెయిలు మంజూరుచేయడంతో నవీముంబై తలోజా జైలు నుంచి విడుదలైన పురోహిత్ బుధవారం ముంబైలో ఆర్మీ యూనిట్‌కు చేరుకున్నారు. జైలు నుంచి విడుదలైన ఆయనను సైన్యం పటిష్టభద్రత నడుమ దక్షిణముంబైలోని కొలాబాకు తరలించింది. ప్రాణహాని ఉందన్న సమాచారంతో ఆయనకు రక్షణగా పోలీసులను నియమించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.