ముంబై: బీజేపీ మాజీ ఎంపీ, మాలెగావ్ పే లుడు కేసులో ప్రధాన ముద్దాయి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ శుక్రవారం ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) పెట్టిన చిత్రహింసల వల్లే తన ఆరో గ్యం దెబ్బతిందని చెప్పారు. స్వయంగా ఆమె హాజరుకావడంతో జడ్జి ఏకే లాహోటీ బెయిలబుల్ వారెంట్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపారు.
ఫిబ్రవరి మొదటి వారంలో మరోసారి కోర్టులో హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. 2024 జూన్ నుంచి విచారణకు హాజ రు కాకపోవడంతో ఆమెపై అదే ఏడాది నవంబర్‌లో బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2008 సెపె్టంబర్ 29న మహారాష్ట్రలోని మాలెగావ్ పట్టణంలోని మసీదు వద్ద బైక్‌కు అమర్చిన బాంబు పేలిన ఘటనలో ఆరుగురు చనిపోగా 100 మంది గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment