సచిన్‌వాజే
ముంబై: థానేకు చెందిన వ్యాపారి మన్సుఖ్ హిరన్ హత్య కేసులో ముంబై పోలీసు అధికారి సచిన్‌వాజేనే ప్రధాన నిందితుడని మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) ఆదివారం స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి శనివారం రాత్రి పోలీసు వినాయక్ షిండేను, బుకీ నరేశ్ గౌర్‌ను అరెస్ట్ చేసింది. పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్ధాల వాహనాన్ని నిలిపి ఉంచిన కేసులో సచిన్ వాజే ప్రస్తుతం ఎన్‌ఐఏ అదుపులో ఉన్నారు. 2006 లఖాన్ భయ్యా నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో దోషిగా నిర్ధారణ అయిన వినాయక్ షిండే గత సంవత్సరం ఫర్‌లోపై జైలు నుంచి బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఆయన వాజేతో టచ్‌లో ఉంటున్నారు. ముకేశ్ ఇంటివద్ద పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం అంతకుముందు, మన్సుఖ్ హిరన్ స్వాధీనంలో ఉంది. మార్చి 5న మన్సుఖ్ మృతదేహం థానెలో ఒక కాలువ పక్కన కనిపించింది. ఈ కేసును కేంద్రం శనివారం ఎన్‌ఐఏకు అప్పగించింది. కాగా, మన్సుఖ్ హత్యకు ప్రధాన కుట్రదారు ఎవరో తేల్చే పనిలో ఉన్నామని ఏటీఎస్ అధికారి ఒకరు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment