Mumbai police officer
-
వాజేనే ప్రధాన నిందితుడు
ముంబై: థానేకు చెందిన వ్యాపారి మన్సుఖ్ హిరన్ హత్య కేసులో ముంబై పోలీసు అధికారి సచిన్వాజేనే ప్రధాన నిందితుడని మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) ఆదివారం స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి శనివారం రాత్రి పోలీసు వినాయక్ షిండేను, బుకీ నరేశ్ గౌర్‌ను అరెస్ట్ చేసింది. పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్ధాల వాహనాన్ని నిలిపి ఉంచిన కేసులో సచిన్ వాజే ప్రస్తుతం ఎన్ఐఏ అదుపులో ఉన్నారు. 2006 లఖాన్ భయ్యా నకిలీ ఎన్కౌంటర్ కేసులో దోషిగా నిర్ధారణ అయిన వినాయక్ షిండే గత సంవత్సరం ఫర్లోపై జైలు నుంచి బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఆయన వాజేతో టచ్‌లో ఉంటున్నారు. ముకేశ్ ఇంటివద్ద పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం అంతకుముందు, మన్సుఖ్ హిరన్ స్వాధీనంలో ఉంది. మార్చి 5న మన్సుఖ్ మృతదేహం థానెలో ఒక కాలువ పక్కన కనిపించింది. ఈ కేసును కేంద్రం శనివారం ఎన్ఐఏకు అప్పగించింది. కాగా, మన్సుఖ్ హత్యకు ప్రధాన కుట్రదారు ఎవరో తేల్చే పనిలో ఉన్నామని ఏటీఎస్ అధికారి ఒకరు వెల్లడించారు. -
ఆ పోలీసుకు మాజీ ఎమ్మెల్యే థ్యాంక్స్ ఎందుకు?
ముంబయి: పోలీసులు అంటే సాధారణంగా కఠినంగానే ఉంటారు. తమకు ఆదేశించిన విధులు నిర్వర్తించడమే వారిపని. మానవీయ కోణంలో వారు స్పందించే సంఘటనలు చాలా అరుదుగా ఉంటాయి. ఒక వేళ ఉన్నా వాటిని వెలుగులోకి తీసుకొచ్చేవాళ్లు చాలా తక్కువ. కానీ, ముంబయిలో ఓ పోలీసు అధికారి స్పందించిన తీరుకు ఓ మాజీ ఎమ్మెల్యే ముగ్దుడై పోయారు. వెంటనే ఆ పోలీసు చేసిన సహాయాన్ని మనసులో ఉంచుకోలేక మరింతమందికి స్ఫూర్తినిచ్చి ఉద్దేశంతో ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ పంచుకున్నారు. ఇప్పుడు ఆ ట్విట్టర్ కథనానికి అనూహ్య స్పందన వచ్చి ఆ పోలీసుపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన మాజీ ఎమ్మెల్యే వివేక్ పండిట్ ముంబయిలోని ఒషివారా ప్రాంతంలో కారులో వెళుతున్నారు. అదే సమయంలో ఆయన మందులు వేసుకోవాల్సి వచ్చి డ్రైవర్ కారును కాస్త రోడ్డు మీదకు ఉంచి వాటర్ బాటిల్ తీసుకురావడానికి వెళ్లాడు. అదే సమయంలో అక్కడి వచ్చిన ట్రాఫిక్ పోలీసు సమర్ హరికృష్ణ దేవనాథ్ కారును అక్కడ నుంచి తీసేయమన్నారు. అయితే, అందుకు స్పందించిన మాజీ ఎమ్మెల్యే తాను మెడిసిన్ వేసుకునే విషయం చెప్పారు. దీంతో వెంటనే పరుగెత్తుకెళ్లిన ఆ కానిస్టేబుల్ తన బైక్‌లోని వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఆయన మందులు వేసుకునేందుకు సహకరించారు. ఆ సమయంలో కొన్ని ఫొటోలు తీసిన ఆయన ట్విట్టర్లో పంచుకున్నారు. రద్దీ సమయంలో కూడా మానవతాదృక్పథంతో వ్యవహరించిన ఆ పోలీసు ఔదార్యాన్ని వివరించారు.