ఆ పోలీసుకు మాజీ ఎమ్మెల్యే థ్యాంక్స్‌ ఎందుకు? | Why This Former MLA Thanked Mumbai Police | Sakshi
Sakshi News home page

ఆ పోలీసుకు మాజీ ఎమ్మెల్యే థ్యాంక్స్‌ ఎందుకు?

Published Wed, Jul 12 2017 5:25 PM | Last Updated on Tue, Sep 5 2017 3:52 PM

ఆ పోలీసుకు మాజీ ఎమ్మెల్యే థ్యాంక్స్‌ ఎందుకు?

ఆ పోలీసుకు మాజీ ఎమ్మెల్యే థ్యాంక్స్‌ ఎందుకు?

ముంబయి: పోలీసులు అంటే సాధారణంగా కఠినంగానే ఉంటారు. తమకు ఆదేశించిన విధులు నిర్వర్తించడమే వారిపని. మానవీయ కోణంలో వారు స్పందించే సంఘటనలు చాలా అరుదుగా ఉంటాయి. ఒక వేళ ఉన్నా వాటిని వెలుగులోకి తీసుకొచ్చేవాళ్లు చాలా తక్కువ. కానీ, ముంబయిలో ఓ పోలీసు అధికారి స్పందించిన తీరుకు ఓ మాజీ ఎమ్మెల్యే ముగ్దుడై పోయారు. వెంటనే ఆ పోలీసు చేసిన సహాయాన్ని మనసులో ఉంచుకోలేక మరింతమందికి స్ఫూర్తినిచ్చి ఉద్దేశంతో ట్విట్టర్‌ ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ పంచుకున్నారు. ఇప్పుడు ఆ ట్విట్టర్‌ కథనానికి అనూహ్య స్పందన వచ్చి ఆ పోలీసుపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన మాజీ ఎమ్మెల్యే వివేక్‌ పండిట్‌ ముంబయిలోని ఒషివారా ప్రాంతంలో కారులో వెళుతున్నారు.

అదే సమయంలో ఆయన మందులు వేసుకోవాల్సి వచ్చి డ్రైవర్‌ కారును కాస్త రోడ్డు మీదకు ఉంచి వాటర్‌ బాటిల్‌ తీసుకురావడానికి వెళ్లాడు. అదే సమయంలో అక్కడి వచ్చిన ట్రాఫిక్‌ పోలీసు సమర్‌ హరికృష్ణ దేవనాథ్‌ కారును అక్కడ నుంచి తీసేయమన్నారు. అయితే, అందుకు స్పందించిన మాజీ ఎమ్మెల్యే తాను మెడిసిన్‌ వేసుకునే విషయం చెప్పారు. దీంతో వెంటనే పరుగెత్తుకెళ్లిన ఆ కానిస్టేబుల్‌ తన బైక్‌లోని వాటర్‌ బాటిల్‌ తీసుకొచ్చి ఆయన మందులు వేసుకునేందుకు సహకరించారు. ఆ సమయంలో కొన్ని ఫొటోలు తీసిన ఆయన ట్విట్టర్‌లో పంచుకున్నారు. రద్దీ సమయంలో కూడా మానవతాదృక్పథంతో వ్యవహరించిన ఆ పోలీసు ఔదార్యాన్ని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement