former legislator
-
మాజీ శాసనసభ్యుల మృతి పట్ల శాసనసభ సంతాపం
-
ఆ పోలీసుకు మాజీ ఎమ్మెల్యే థ్యాంక్స్ ఎందుకు?
ముంబయి: పోలీసులు అంటే సాధారణంగా కఠినంగానే ఉంటారు. తమకు ఆదేశించిన విధులు నిర్వర్తించడమే వారిపని. మానవీయ కోణంలో వారు స్పందించే సంఘటనలు చాలా అరుదుగా ఉంటాయి. ఒక వేళ ఉన్నా వాటిని వెలుగులోకి తీసుకొచ్చేవాళ్లు చాలా తక్కువ. కానీ, ముంబయిలో ఓ పోలీసు అధికారి స్పందించిన తీరుకు ఓ మాజీ ఎమ్మెల్యే ముగ్దుడై పోయారు. వెంటనే ఆ పోలీసు చేసిన సహాయాన్ని మనసులో ఉంచుకోలేక మరింతమందికి స్ఫూర్తినిచ్చి ఉద్దేశంతో ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ పంచుకున్నారు. ఇప్పుడు ఆ ట్విట్టర్ కథనానికి అనూహ్య స్పందన వచ్చి ఆ పోలీసుపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన మాజీ ఎమ్మెల్యే వివేక్ పండిట్ ముంబయిలోని ఒషివారా ప్రాంతంలో కారులో వెళుతున్నారు. అదే సమయంలో ఆయన మందులు వేసుకోవాల్సి వచ్చి డ్రైవర్ కారును కాస్త రోడ్డు మీదకు ఉంచి వాటర్ బాటిల్ తీసుకురావడానికి వెళ్లాడు. అదే సమయంలో అక్కడి వచ్చిన ట్రాఫిక్ పోలీసు సమర్ హరికృష్ణ దేవనాథ్ కారును అక్కడ నుంచి తీసేయమన్నారు. అయితే, అందుకు స్పందించిన మాజీ ఎమ్మెల్యే తాను మెడిసిన్ వేసుకునే విషయం చెప్పారు. దీంతో వెంటనే పరుగెత్తుకెళ్లిన ఆ కానిస్టేబుల్ తన బైక్‌లోని వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఆయన మందులు వేసుకునేందుకు సహకరించారు. ఆ సమయంలో కొన్ని ఫొటోలు తీసిన ఆయన ట్విట్టర్లో పంచుకున్నారు. రద్దీ సమయంలో కూడా మానవతాదృక్పథంతో వ్యవహరించిన ఆ పోలీసు ఔదార్యాన్ని వివరించారు. -
మాజీ ఎమ్మెల్యే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్
న్యూఢిల్లీ: అతను మాజీ ఎమ్మెల్యే. సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉండాల్సిన వ్యక్తి. కానీ ఢిల్లీ పోలీసులు విడుదల చేసిన టాప్ మోస్ట్ వాంటెడ్-20 మంది నేరస్థుల జాబితాలో ఆయన 10వ స్థానంలో నిలిచాడు. ఆయనను పట్టుకున్నవారికి లక్ష రూపాయల రివార్డును కూడా పోలీసులు ప్రకటించారు. ఆయనే రామ్ బిర్ షోకిన్. ఢిల్లీలోని మాండ్కా శాసనసభ స్థానం నుంచి ఆయన 2013లో సంతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనపై గతేడాది మోకా చట్టం కింద మహారాష్ట్ర పోలీసులు కేసును నమోదు చేశారు. తన మేనకోడలు నీరజ్ భావన ప్రధాన సూత్రధారిగా ఉన్న సిండికేట్ అక్రమ కార్యకలాపాల వ్యవహారంలో ఆయనకు ప్రమేయం ఉండటమే ఇందుకు కారణం. భావనపై విచారణకు ఆటంకం కలిగించినందుకు, గతేడాది ఆయనపై ఢిల్లీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అప్పటి నుంచి షోకిన్ అజ్ఞాతంలోఉన్నాడు. రెండు నెలల క్రితం ఢిల్లీ పోలీసులు టాప్ మోస్ట్ వాంటెడ్ నేరస్థుల జాబితాలో ఆయన పేరును చేర్చారు. ఇందులో ఆయన 10 మోస్ట్ వాంటెడ్ నేరస్థునిగా ఉన్నారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. -
మాజీ ఎమ్మెల్యే అఫ్సర్‌ఖాన్ కన్నుమూత
హైదరాబాద్: మజ్లిస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మహ్మద్ ముక్తయిద్ ఖాన్(అఫ్సర్‌ఖాన్) (64) శుక్రవారం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అపోలో ఆస్పత్రిలో అనారోగ్యంతో చికి త్స పొందుతున్నారు. 2003లో అప్పటి కార్వాన్ సిట్టింగ్ ఎమ్మెల్యే సయ్యద్ సజ్జాద్ మృతి చెందడంతో జరిగిన ఉపఎన్నికల్లో మజ్లిస్ అభ్యర్థిగా అఫ్సర్‌ఖాన్ బరిలో దిగి విజయం సాధిం చారు. 2004, 2009 సాధారణ ఎన్నికల్లోనూ ఆయన మజ్లిస్ ఎమ్మెల్యేగా గెలిచారు. అనారోగ్య కారణాలతో 2014 ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. శుక్రవారం హుమాయూన్ నగర్‌లోని మసీదు అజీజియాలో జనాజా ప్రార్థనలు నిర్వహించి మురాద్‌నగర్‌లోని ఖాదరీయా మసీదు పక్కన గల శ్మశాన వాటికలో ఖాన్‌కు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖుల సంతాపం అఫ్సర్‌ఖాన్ మృతి పట్ల సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, ముంతాజ్‌ఖాన్, అహ్మద్ బలాల, కౌసర్మోయిద్దీన్, జాఫర్ హుస్సేన్ మేరాజ్, ఎమ్మెల్సీలు రిజ్వీ, జాఫ్రీ, సలీం, మహ్మద్ పారుఖ్, ప్రభాకర్, వైఎస్సార్ కాంగ్రెస్ నేత రెహమాన్ తదితరులు అఫ్సర్‌ఖాన్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. -
‘పాగ పుల్లారెడ్డి రాజనీతిజ్ఞుడు’
గద్వాలటౌన్: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, మేధావి, మాజీ శాసనసభ్యుడు పాగపుల్లారెడ్డి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం స్వాతంత్య్ర సమరయోధులు, రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో స్థానిక బాలభవన్‌లో చిన్నారి కళాకారుల నడుమ బాలభవన్ సిబ్బంది వేడుకలను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఆయన సేవలను కొనియాడారు. పాగ పుల్లారెడ్డి గొప్ప ప్రజాసేవకుడు, ఆదర్శ రాజ నీతిజ్ఞుడు అని ఎమ్మెల్యే డీకే అరుణ పేర్కొన్నారు. వర్ధంతి కార్యక్రమంలో ఆమె పాగ పుల్లారెడ్డి చిత్రపటానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గద్వాల బాలభవన్‌కు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చిన గొప్పవ్యక్తి అని కొనియాడారు. గద్వాల వైభవాన్ని ప్రపంచానికి చాటిన మహామనిషి అని అన్నారు. కార్యక్రమంలో బాలభవన్ కమిటీ సభ్యులు రాజగోపాలాచారి, సూపరింటెండెంట్ విజయలక్ష్మి, రామిరెడ్డి మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, మురళీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే డీకే భరతసింహారెడ్డి పాగ పుల్లారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూరాల ప్రాజెక్టు ఏర్పాటుతో పాటు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల సాధనకు, రైల్వేలైన్ల కోసం కోసం కృషిచేసిన మహనీయుడని కొనియాడారు. ఉన్నత విలువలతో కూడిన ఆయన జీవితం అందరికీ ఆదర్శమన్నారు. కార్యక్రమంలో శంకరయ్య, బాలకిషన్, గార్లపాడు కృష్ణయ్య, లక్ష్మిరెడ్డి, సవారన్న, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.