మాజీ ఎమ్మెల్యే అఫ్సర్‌ఖాన్ కన్నుమూత
హైదరాబాద్: మజ్లిస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మహ్మద్ ముక్తయిద్ ఖాన్(అఫ్సర్‌ఖాన్) (64) శుక్రవారం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అపోలో ఆస్పత్రిలో అనారోగ్యంతో చికి త్స పొందుతున్నారు. 2003లో అప్పటి కార్వాన్ సిట్టింగ్ ఎమ్మెల్యే సయ్యద్ సజ్జాద్ మృతి చెందడంతో జరిగిన ఉపఎన్నికల్లో మజ్లిస్ అభ్యర్థిగా అఫ్సర్‌ఖాన్ బరిలో దిగి విజయం సాధిం చారు. 2004, 2009 సాధారణ ఎన్నికల్లోనూ ఆయన మజ్లిస్ ఎమ్మెల్యేగా గెలిచారు.
అనారోగ్య కారణాలతో 2014 ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. శుక్రవారం హుమాయూన్ నగర్‌లోని మసీదు అజీజియాలో జనాజా ప్రార్థనలు నిర్వహించి మురాద్‌నగర్‌లోని ఖాదరీయా మసీదు పక్కన గల శ్మశాన వాటికలో ఖాన్‌కు అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.
సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖుల సంతాపం
అఫ్సర్‌ఖాన్ మృతి పట్ల సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, ముంతాజ్‌ఖాన్, అహ్మద్ బలాల, కౌసర్‌మోయిద్దీన్, జాఫర్ హుస్సేన్ మేరాజ్, ఎమ్మెల్సీలు రిజ్వీ, జాఫ్రీ, సలీం, మహ్మద్ పారుఖ్, ప్రభాకర్, వైఎస్సార్ కాంగ్రెస్ నేత రెహమాన్ తదితరులు అఫ్సర్‌ఖాన్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.