ప్రజ్ఞాసింగ్, భూపేశ్ బఘేల్
జబల్పూర్: మాలేగావ్ కేసులో నిందితురాలు, భోపాల్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిని ప్రజ్ఞాసింగ్‌పై ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2001లో ఆమె ఒక వ్యక్తిని పొడిచారని ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..‘ప్రజ్ఞా ఠాకూర్‌కు ఛత్తీస్‌గఢ్‌తో ఒక సంబంధం ఉంది. ఆమె మరిది బిలాయ్‌గఢ్‌లో పనిచేసేవారు. అప్పట్లో ఆమె దగ్గర ఎప్పుడూ ఒక కత్తి ఉండేది. 2001లో బిలాయ్‌గఢ్‌లో శైలేంద్ర దేవ్‌గణ్ అనే వ్యక్తి ఛాతీపై ఆమె కత్తితో పొడిచింది. ఆమె తరచూ గొడవల్లో తలదూర్చేది. ఆమెది నేర స్వభావం. అంతేతప్ప, సాధ్వి మాదిరిగా మాత్రం కాదు’ అని అన్నారు. సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ప్రతినిధి హితేశ్ బాజ్‌పేయి తీవ్రంగా స్పందించారు. ‘సీఎం సారీ చెప్పాలి. లేదంటే మేం వేసే పరువునష్టం కేసుకు సిద్ధపడాలి’ అని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment