సాక్షి, ముంబై : 2008 మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు అనూహ్యమైన తీర్పును వెలవరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సాధ్వి ప్రగ్యాసింగ్ థాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ శ్రీకాంత్ ప్రసాద్ పురోహిత్‌లకు ఈ కేసు నుంచి పాక్షిక ఉపశమనం కల్పించేలా ఎన్‌ఐఏ కోర్టు తీర్పును వెలవరించింది.
మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల చట్టం (ఎంసీఓసీఏ) కింద సాధ్వి ప్ర్ర్రజ్ఞ సింగ్, రమేష్ ఉపాధ్యాయ్, అజయ్ రహికర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్‌లకు విముక్తి కల్పించింది. ఇదిలావుండగా 2008 మాలెగావ్ బాంబు పేలుళ్ల కేసులో సాధ్వి ప్రగ్యాసింగ్, కల్నల్ పురోహిత్‌లపై సెక్షన్ 18తో పాటు వివిధ ఐపీసీ సెక్షన్ల ప్రకారం చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించింనదుకు విచారణ కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది.
ప్రస్తుతం బెయిలుపై విడుదలైన నిందులకు అదేబెయిల్ కొనసాగుతుందని కోర్టు తెలిపింది. ఈ కేసుపై తదుపరి విచారణ జనవరి 15న జరగనుందని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు వెల్లడించింది.
పేలుళ్ల కోసం మోటార్ సైకిల్‌ను వినియోగిస్తున్న విషయం సాధ్వి ప్రగ్యాకు ముందే తెలుసునని, అందువల్ల ఆమెను కుట్ర ఆరోపణల నుంచి విముక్తి కల్పించడం అసాధ్యమని కోర్టు తెలిపింది. ఇదిలావుండగా.. మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసునుంచి తమకు విముక్తి కల్పించాలంటూ.. సాధ్వి ప్రగ్య, సమీర్ కులకర్ణి తదితరులు చేసుకున్న విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.
మాలేగావ్‌లోని హమిదియా మసీద్ వద్ద 2008 సెప్టెంబర్ 29న జరిగిన బాంబు పేలుడులో ఆరుమంది మరణించడగా.. 101 మంది గాయపడ్డారు. పేలుడు జరిగిన మసీదు ప్రాంతం నాసిక్‌లో అత్యంత సున్నితమైంది.
Comments
Please login to add a commentAdd a comment