Colonel Purohit
-
సాధ్వి ప్రజ్ఞ, పురోహిత్‌కు స్వల్ప ఊరట
ముంబై: మాలెగావ్ బాంబుపేలుడు కేసులో నిందితులు సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్‌లకు బుధవారం ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) ప్రత్యేక కోర్టులో స్వల్ప ఊరట లభించింది. సాధ్వి, పురోహిత్ సహా 8 మందిపై ‘మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం’ కింద నమోదైన అభియోగాలను కోర్టు కొట్టేసింది. ఉగ్రవాద కార్యకలాపాల వ్యతిరేక చట్టం కింద మాత్రం విచారణ కొనసాగుతుందన్టి స్పష్టం చేసింది. మరో ముగ్గురి పేర్లను నిందితుల జాబితా నుంచి తొలగించిన కోర్టు వారికి కేసు నుంచి విముక్తి కల్పించింది. మిగిలిన నిందితులందరిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)లోని సెక్షన్ల కింద విచారణ కొనసాగుతుందని కోర్టు పేర్కొంది. -
సాధ్వి ప్రగ్యాకు ఊరట
సాక్షి, ముంబై : 2008 మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు అనూహ్యమైన తీర్పును వెలవరించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సాధ్వి ప్రగ్యాసింగ్ థాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ శ్రీకాంత్ ప్రసాద్ పురోహిత్‌లకు ఈ కేసు నుంచి పాక్షిక ఉపశమనం కల్పించేలా ఎన్ఐఏ కోర్టు తీర్పును వెలవరించింది. మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల చట్టం (ఎంసీఓసీఏ) కింద సాధ్వి ప్ర్ర్రజ్ఞ సింగ్, రమేష్ ఉపాధ్యాయ్, అజయ్ రహికర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్‌లకు విముక్తి కల్పించింది. ఇదిలావుండగా 2008 మాలెగావ్ బాంబు పేలుళ్ల కేసులో సాధ్వి ప్రగ్యాసింగ్, కల్నల్ పురోహిత్‌లపై సెక్షన్ 18తో పాటు వివిధ ఐపీసీ సెక్షన్ల ప్రకారం చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించింనదుకు విచారణ కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం బెయిలుపై విడుదలైన నిందులకు అదేబెయిల్ కొనసాగుతుందని కోర్టు తెలిపింది. ఈ కేసుపై తదుపరి విచారణ జనవరి 15న జరగనుందని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వెల్లడించింది. పేలుళ్ల కోసం మోటార్ సైకిల్‌ను వినియోగిస్తున్న విషయం సాధ్వి ప్రగ్యాకు ముందే తెలుసునని, అందువల్ల ఆమెను కుట్ర ఆరోపణల నుంచి విముక్తి కల్పించడం అసాధ్యమని కోర్టు తెలిపింది. ఇదిలావుండగా.. మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసునుంచి తమకు విముక్తి కల్పించాలంటూ.. సాధ్వి ప్రగ్య, సమీర్ కులకర్ణి తదితరులు చేసుకున్న విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. మాలేగావ్‌లోని హమిదియా మసీద్ వద్ద 2008 సెప్టెంబర్ 29న జరిగిన బాంబు పేలుడులో ఆరుమంది మరణించడగా.. 101 మంది గాయపడ్డారు. పేలుడు జరిగిన మసీదు ప్రాంతం నాసిక్‌లో అత్యంత సున్నితమైంది. -
మాలెగావ్ కేసులో పురోహిత్‌కు బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ : మాలెగావ్ పేలుడు కేసులో ఎట్టకేలకు లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ శ్రీకాంత్ పురోహిత్‌కు సుప్రీం కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. తన బెయిల్ వినతిని తోసిపుచ్చుతూ బొంబాయి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంను ఆశ్రయించారు. పురోహిత్‌కు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస ఆర్కే అగర్వాల్, ఏఎం సప్రేతో కూడిన బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సందర్భంగా పురోహిత్ తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తూ నిందితుడు తొమ్మిదేళ్లుగా జైలులోనే ఉన్నా ఇప్పటివరకూ ఆయనపై అభియోగాలు నమోదు చేయలేదని చెప్పారు. పురోహిత్‌పై మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం కింద మోపిన అభియోగాలను వెనక్కి తీసుకున్నందున మధ్యంతర బెయిల్ పొందేందుకు అర్హుడని కోర్టుకు నివేదించారు. ఎన్ఐఏ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ మణిందర్ సింగ్ వాదిస్తూ పురోహిత్‌పై అభియోగాల నమోదుకు అవసరమైన ఆధారాలున్నాయని చెప్పారు. మాలెగావ్‌లో 2008 సెప్టెంబర్ 29న జరిగిన బాంబు పేలుళ్లలో ఏడుగురు మరణించారు. అక్కడ పెద్దసంఖ్యలో ముస్లింలున్నందునే పేలుళ్లకు లక్ష్యంగా చేసుకున్నారని 4000 పేజీల చార్జిషీట్లో పేర్కొన్నారు. పేలుళ్లకు ప్రగ్యా ఠాకూర్, పురోహిత్, సహ నిందితుడు దయానంద్ పాండేలు ప్రధాన కుట్రదారులుగా చార్జిషీట్ పొందుపరిచారు.