ముంబై: మాలెగావ్ బాంబుపేలుడు కేసులో నిందితులు సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్‌లకు బుధవారం ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) ప్రత్యేక కోర్టులో స్వల్ప ఊరట లభించింది. సాధ్వి, పురోహిత్ సహా 8 మందిపై ‘మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం’ కింద నమోదైన అభియోగాలను కోర్టు కొట్టేసింది.
ఉగ్రవాద కార్యకలాపాల వ్యతిరేక చట్టం కింద మాత్రం విచారణ కొనసాగుతుందన్టి స్పష్టం చేసింది. మరో ముగ్గురి పేర్లను నిందితుల జాబితా నుంచి తొలగించిన కోర్టు వారికి కేసు నుంచి విముక్తి కల్పించింది. మిగిలిన నిందితులందరిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ)లోని సెక్షన్ల కింద విచారణ కొనసాగుతుందని కోర్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment