కోర్టుకు వస్తున్న ప్రజ్ఞాసింగ్
ముంబై: భోపాల్ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ శువ్రవారం మొదటిసారిగా 2008 నాటి మాలేగావ్ పేలుడు కేసులో కోర్టుకు హాజరయ్యారు. సుమారు రెండున్నర గంటలపాటు కోర్టు హాలులో నిలుచునే ఉన్నారు. జడ్జి పలుమార్లు కూర్చోవచ్చని చెప్పినా ఆమె నిరాకరించారు. విచారణ ముగిసి, జడ్జి వెళ్లి పోయిన తర్వాత ప్రజ్ఞ కోర్టురూమ్‌లో సౌకర్యాలు సరిగా లేవంటూ అసహనం వ్యక్తం చేశారు. తనకు ఇచ్చిన కుర్చీని చూపిస్తూ.. ‘దీనిపై అంతా దుమ్మే. ఇందులో కూర్చుంటే నేను పడక్కే పరిమితమవుతా..’ అని అన్నారు. ‘ముందు కనీసం కూర్చునే చోటు చూపించండి. కావాలనుకుంటే తర్వాత ఉరి తీయండి’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment