mumbai court
-
పరువు నష్టం కేసులో ఎంపీ సంజయ్‌రౌత్‌కు 15 రోజులు జైలు
ముంబై: శివసేన(ఉద్దవ్ వర్గం) రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్‌కు న్యాయస్థానంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పరువు నష్టం కేసులో సంజయ్‌రౌత్‌కు ముంబై కోర్టు 15 రోజులు జైలు శిక్ష విధించింది. బీజేపీ మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య భార్య మేధ సోమయ్య దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఆయనకు 15 రోజులు జైలు శిక్ష విధిస్తూ ముంబై కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 500 కింద రౌత్‌ను దోషిగా నిర్ధారిస్తూ.. ఆయనకు రూ.25 వేలు జరిమానా కూడా విధిస్తున్నట్లు వెల్లడించింది.మేధ సోమయ్య ముంబైలోని రుయా కళాశాలలో ఆర్గానిక్ కెమెస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఆమె యువ ప్రతిష్టాన్ అనే స్వచ్చంద సంస్థ నడుపుతున్నారు. అయితే తన ఎన్జీవతో కలిసి ఆమె రూ.100 కోట్ల మరుగుదొడ్ల కుంభకోణానికి పాల్పడినట్లు రౌత్ ఆరోపించారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ పలు మీడియాల్లో కథనాలు ప్రసారం అయ్యాయి. చదవండి: ఎన్నాళ్లు జైల్లో ఉంచుతారు?.. ఈడీకి సుప్రీం కోర్టు మందలింపువీటిని ఖండించిన కిరీట్ సోమయ్య సతీమణి మేధ.. ఎలాంటి ఆధారాలు లేకుండా తమపై తప్పుడు ఆరోపణలు చేశారని కోర్టును ఆశ్రయించారు. 2022 నుంచి రౌత్ తనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని, అవి పలు పత్రికలు, ఎలక్ట్రానిక్‌తోపాటు సోషల్ మీడియాలోనూ ప్రచురితమయ్యాయని తన పిటిషన్లో పేర్కొన్నారు. తనతోపాటు తన భర్తపై సంజయ్ రౌత్ పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు చేశారని చెబుతూ.. పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.మరోవైపు సంజయ్ రౌత్ న్యాయవాది, ఆయన సోదరుడు సునీల్ రౌత్ మాట్లడుతూ.. బెయిల్ పిటిషన్ వేస్తామని తెలిపారు. అలాగే ఈ ఉత్తర్వులపై ముంబై సెషన్స్ కోర్టులో అప్పీలు చేస్తామని చెప్పారు. -
నటి కుటుంబం దారుణ హత్య.. తీర్పు వెలువరించిన కోర్టు!
బాలీవుడ్ నటి లైలా ఖాన్ ఫ్యామిలీ దారుణ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆమె సవతి తండ్రికి ముంబయి సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించింది. దాదాపు 13 ఏళ్ల క్రితం జరిగిన ఈ దారుణ ఘటనపై విచారణ చేపట్టిన ముంబయి సెషన్స్ కోర్టు తుది తీర్పు వెలువరించింది.అసలేం జరిగిందంటే?బాలీవుడ్ నటి లైలా ఖాన్ ఫ్యామిలీ దారుణ హత్యకు గురికావడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆమె సవతి తండ్రి అయిన పర్వేజ్ తక్ వారి ఫ్యామిలీ మొత్తాన్ని హతమార్చాడు. ఈ ఘటన 2011లో మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని ఇగత్‌పురిలో జరిగింది. ఈ ఘటనలో లైలా ఖాన్‌తో పాటు ఆమె తల్లి షెలీనా, తోబుట్టువులైన అజ్మీనా, జారా, ఇమ్రాన్, కజిన్ రేష్మాను అతను కాల్చిచంపాడు. వారి మృతదేహాలను వారి బంగ్లాలోనే పాతిపెట్టి పరారయ్యాడు.అయితే ఈ ఘటన జరిగిన దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఈ దారుణం బయటకొచ్చింది. ఆ తర్వాత కేసు నమోదు చేసుకున్న పోలీసులు పర్వేజ్ తక్‌ను జమ్మూకశ్మీర్‌లో అరెస్ట్ చేశారు. కాగా.. పర్వేజ్ తక్ లైలా తల్లి షెలీనాకి మూడవ భర్తగా పోలీసులు నిర్ధారించారు. ఆస్తి వివాదం కారణంగానే ఆరుగురిని అత్యంత కిరాతకంగా కాల్చి చంపినట్లు విచారణలో వెల్లడైంది.అసలు లైలా ఖాన్ ఎవరు?బాలీవుడ్ నటి లైలా ఖాన్ 2008లో విడుదలైన వాఫా: ఎ డెడ్లీ లవ్ స్టోరీలో నటించింది. ఈ చిత్రానికి రాకేశ్ సావంత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాజేష్ ఖన్నా సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత 2008లో కూల్ నహీ హాట్ హై హమ్ చిత్రంలో కనిపించింది. కాగా.. అంతకుముందే లైలా ఖాన్ 2002లో కన్నడ చిత్రం మేకప్‌తో సినిమాల్లోకి అడుగుపెట్టింది. -
మాల్యా దగ్గర లోన్లు చెల్లించేంత డబ్బుంది, కానీ..
ముంబై: బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పరారైన విజయ్ మాల్యా వ్యవహారానికి సంబంధించి.. సీబీఐ తాజాగా ముంబై కోర్టులో సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. అందులో విస్తుపోయే విషయాలను పేర్కొంది దర్యాప్తు సంస్థ. విజయ్ మాల్యా దగ్గర ఆ సమయానికి రుణం తిరిగి చెల్లించడానికి తగినంత డబ్బు ఉనప్పటికీ.. ఆ పని చేయలేదని, బదులుగా ఆయన దేశం విడిచి పారిపోయే ముందు విదేశాలలో ఆస్తులు కొనుగోలు చేశాడని సీబీఐ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. అదే సమయంలో బ్యాంకులు సైతం ఆయన నుంచి లోన్లు రికవరీ చేయడంలో విఫలం అయ్యాయంటూ తెలిపింది. 2008-17 మధ్య మాల్యా దగ్గర బ్యాంకు లోన్లు చెల్లించడానికి తగినంత డబ్బు ఉంది. ఆ సమయంలోనే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ కోసం అతను లోన్లు తీసుకున్నాడు అని సీబీఐ పేర్కొంది. అయితే.. తన దగ్గర ఉన్న సొమ్ముతో లోన్లు చెల్లించకపోగా.. యూరప్ వ్యాప్తంగా వ్యక్తిగతంగా ఆస్తులు కొనుగోలు చేయడంతో పాటు తన పిల్లలకు సంబంధించి స్విట్జర్లాండ్‌లో ఉన్న ట్రస్టులకు డబ్బును ట్రాన్స్ఫర్ చేశాడని గుర్తించినట్లు సీబీఐ పేర్కొంది. ఫ్రాన్స్‌లో 35 మిలియన్ యూరోలు చెల్లించి రియల్ ఎస్టేట్‌ను కొనుగోలు చేశాడు. తన కంపెనీలలో ఒకటైన గిజ్మో హోల్డింగ్స్ ఖాతా నుండి 8 మిలియన్ యూరోలు చెల్లించాడని సీబీఐ పేర్కొంది. అలాగే ఇంగ్లండ్‌లోనూ ఆస్తులు కొన్నట్లు గుర్తించినట్లు కోర్టుకు తెలిపింది. ఐడీబీఐ-కింగ్‌పిషర్ ఎయిర్‌లైన్స్ 900 కోట్ల రూపాయల లోన్ ఫ్రాడ్ కేసులో విజయ్ మాల్యా నిందితుడిగా ఉన్నాడు. విజయ్ మాల్యా 2016లో దేశం విడిచి పారిపోయి.. యూకేలో తలదాచుకున్నాడు. ఈ మేరకు అతన్ని వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి కూడా. కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. 2019, జనవరి 5వ తేదీన ముంబై ప్రత్యేక కోర్టు మాల్యాను fugitive(పరారీలో) ఉన్నట్లుగా ప్రకటించింది. ఇక.. గత ఛార్జ్‌షీట్‌లో 11 మంది నిందితుల పేర్లను పేర్కొన్న సీబీఐ, తాజా ఛార్జ్‌షీట్‌లో ఐడీబీఐ బ్యాంక్ మాజీ మేనేజర్ బుద్ధదేవ్ దాస్‌గుప్తా పేరును చేర్చింది. మొత్తంగా రూ.9వేల కోట్ల రుణ ఎగవేత ఆరోపణలతో దేశం విడిచి వెళ్లిపోయాడు మాల్యా. ఇదీ చదవండి: ఎంజాయ్ చేద్దాం అనుకుంటే.. వణికిపోయేలా చేసింది! -
'నా భర్త గే.. ఎంత ట్రై చేసినా దగ్గరకు రానివ్వట్లేదు..' కోర్టు కీలక తీర్పు
ముంబై: ప్రభుత్వ ఉద్యోగి అయిన తన భర్త స్వలింగ సంపర్కుడని, ఈ విషయం దాచి తనను పెళ్లి చేసుకున్నాడని ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. పెళ్లయిన తర్వాత ఆయనకు దగ్గరయ్యేందుకు ఎంత ట్రై చేసినా ఫలితం లేకపోయిందని, ఆయనకు పురుషులతో శారీరక సంబంధాలు ఉన్నాయని చెప్పింది. అంతేగాక తనను శారీరకంగా వేధిస్తున్నాడని, దుర్భాషలాడుతూ తన ఆర్థిక పరిస్థితి, కుటుంబాన్ని కించ పరిచేలా మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించింది. అయితే వాదనలు విన్న న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. గే అని దాచినందుకు ఆమెకు రూ.లక్ష పరిహారంగా ఇవ్వాలని, అలాగే ప్రతి నెల రూ.15వేలు ఆర్థిక సాయం అందించాలని ఆదేశించింది. మెజిస్ట్రేట్ కోర్టు ఈమేరకు తీర్పునిచ్చింది. ఈ తీర్పును ముంబై సెషన్స్ కోర్టులో సవాల్ చేశాడు భర్త. ఆధారాలు పరిశీలించిన న్యాయస్థానం కింది కోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించింది. ఆమెకు రూ.లక్ష, ప్రతి నెల రూ.15 చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ దంపతులకు 2016లో వివాహం జరిగింది. పెళ్లై రోజులు గడుసున్నా ఆమెను అతడు దగ్గరకు రానివ్వలేదు. హింసించడం మొదలుపెట్టాడు. అనుమానంతో అతడ్ని గమనించిన భార్య.. చివరకు గే అని కనిపెట్టింది. ఇతర పురుషులతో అతడు నగ్నంగా దిగిన ఫొటోలోను అతని ఫోన్లో చూసింది. వాటినే కోర్టుకు సాక్ష్యంగా సమర్పించింది. చదవండి: డబ్బు విషయంలో భర్తతో గొడవ.. 8 ఏళ్ల కుమారుడ్ని కాలువలోకి విసిరి.. -
శివసేన సంజయ్ రౌత్‌కు బెయిల్ మంజూరు
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు బెయిట్ మంజూరైంది. పీఎంఎల్ఏ కోర్టు సంజయ్ రౌత్‌కు బెయిల్ ఇచ్చింది. కాగా, సంజయ్ రౌత్.. భూ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంజయ్ రౌత్ 100 రోజుల పాటు జైలు జీవితం గడిపారు. జూలై 31వ తేదీన సంజయ్ రౌత్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. -
'కంగనా సెలబ్రిటీనే కావచ్చు.. కానీ ఆమె ఓ కేసులో నిందితురాలు'
Kangana Ranaut Permanent Exemption Appeal Rejected In Javed Akhtar Case: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ తన మాటలతో కాంట్రవర్సీ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది. ఏ అంశమైన తనదైనా శైలీలో సూటిగా సుత్తి లేకుండా చెప్పేస్తుంది. ఈ క్రమంలోనే ఆమె పలు విమర్శలపాలైంది. కంగనా మాట ధోరణి చూసి ఆమెకు అభిమానులు అయిన వారు కూడా లేకపోలేదు. అయితే తాజాగా కంగనాకు ముంబై కోర్టులో చుక్కెదురైంది. బీటౌన్ ఫైర్బ్రాండ్పై ప్రముఖ గేయ రచయిత జావేద్ అక్తర్ పరువు నష్టం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కోర్టు హాజరు నుంచి 'శాశ్వత మినహాయింపు' కోసం దరఖాస్తు పెట్టుకుంది. కంగనా పెట్టుకున్న ఆ దరఖాస్తును ముంబై కోర్టు తిరస్కరించింది. చదవండి: కోట్లలో ఆస్తులున్న కంగనా రనౌత్.. వాటి విలువ ఎంతంటే? బాలీవుడ్ చిత్రసీమలో స్టార్ హీరోయిన్లలో తాను ఒకరినని, వృత్తిపరంగా దేశ, విదేశాల్లో ఎన్నో ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని పేర్కొంటూ వ్యక్తిగత హాజరుకు శాశ్వత మినహాయింపు ఇవ్వాలని కంగనా అభ్యర్థించింది. 'కంగనా వృత్తిపరంగా చాలా బిజీగా ఉండొచ్చు.. కానీ, ఆమె ఒక కేసులో నిందితురాలు. ఆ విషయాన్ని ఆమె మర్చిపోవద్దు.' అని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆర్ఆర్ ఖాన్ స్పష్టం చేశారు. కేసు విచారణకు కంగనా సహకరించకుండా, నిబంధనలకు విరుద్ధంగా, తనకు ఇష్టం వచ్చిన పద్దతిలో కంగనా వ్యవహరిస్తోందని కోర్టు తెలిపింది. చదవండి: మీరు చాలా హాట్‌గా ఉన్నారు.. మాకు కోచింగ్ ఇవ్వండి: కంటెస్టెంట్‌తో కంగనా ఆమె సెలబ్రిటీనే కావచ్చు.. కానీ ఒక నిందితురాలిగా కోర్టు నిబంధనలు పాటించక తప్పదని వెల్లడించింది. వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని కోరడం హక్కు కాదనే విషయాన్ని తెలుసుకోవాలని కోర్టు సూచించింది. బెయిల్ బాండ్ కోసం చట్టపరంగా ఉన్న నియమనిబంధనలను పాటించాలని ఆదేశించింది. నవంబర్ 2020లో ఓ ఇంటర్వ్యూలో కంగనా తనపై అనుచితి వ్యాఖ్యలు చేసిందని జావేద్ అక్తర్ పరువునష్టం దావా వేశారు. చదవండి: కొండ ప్రాంతాల నుంచి వచ్చానని అవమానించేవారు: కంగనా -
వారిని రప్పించండి లేదా కేసు కొట్టేయండి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో 2013లో జరిగిన దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్ల కేసులో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది ఎజాజ్ షేక్ గత వారం ముంబై కోర్టుకెక్కాడు. తనపై ముంబై సైబర్‌సెల్ పోలీసులు నమోదు చేసిన మరో కేసులో దర్యాప్తు అధికారులను కోర్టుకు రప్పించాలని లేదా కేసు కొట్టేయాలని తన న్యాయవాదుల ద్వారా కోరాడు. ‘దిల్సుఖ్నగర్’కేసులో ఎజాజ్‌కు 2016లో ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వగా వివిధ నగరాల్లోనూ అతనిపై విధ్వంసం కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఎజాజ్ మహారాష్ట్రలోని ఎరవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. టెర్రర్ మెయిల్స్‌పై మరో కేసు: 2013–14ల్లో ఐఎంకు చెందిన అనేక మందిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. అదే ఏడాది సెప్టెంబర్ 5న ఎజాజ్ షేక్‌ను మహారాష్ట్రలో పట్టుకున్నారు. ఇతర ఉగ్రవాదులతోపాటు అతన్నీ ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్ తీసుకొచ్చి దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో విచారించారు. అదే సందర్భంలో ‘టెర్రర్ మెయిల్స్’పంపింది ఎజాజ్ షేక్ అని తేలడంతో ముంబై సైబర్‌సెల్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. చార్జ్‌షీట్ సైతం దాఖలు చేయడంతో 2017లో ఈ కేసు కోర్టు విచారణకు వచ్చింది. 58 సార్లు విచారణ వాయిదా... అప్పటి నుంచి దర్యాప్తు అధికారు లు న్యాయస్థానంలో హాజరుకావట్లేదు. ఫలితంగా వరుస వాయిదాలు పడుతూ పోయింది. ఆ ఏడా ది ఆగస్టు 14 నుంచి 2019 వరకు మొత్తం 58 సార్లు వాయిదా పడినా పోలీసులు కోర్టుకు హాజరుకాలేదు. దీంతో ఎజాజ్ షేక్ తన న్యాయవాదుల సాయంతో గత వారం ముం బై కోర్టులో ‘నాన్ అప్పీరెన్స్ ఆఫ్ ప్రాసిక్యూషన్’పై పిటిషన్ దాఖలు చేయించాడు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం పోలీసులకు నోటీసులు జారీ చేసింది. -
7న నవాబ్ మాలిక్‌పై ధిక్కరణ కేసు విచారణ
ముంబై: మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఇప్పటికే వేరే కేసులో జైలులో ఉన్నందున, ధిక్కరణ కేసులో విచారణ చేపట్టడం కుదరదని ముంబై హైకోర్టు తెలిపింది. ఎన్సీబీ మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తండ్రి ధ్యాన్‌దేవ్ వాంఖడే వేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తూ నవాబ్ మాలిక్ తమ కుటుంబంపై అనేక వ్యాఖ్యలు చేశారంటూ ధ్యాన్‌దేవ్ పిటిషన్ వేశారు. నవాబ్ మాలిక్ కస్టడీ గడువు ఈ నెల 3వ తేదీ వరకు ఉన్నట్లు లాయర్ ఫెరోజ్ బరూచా తెలిపారు. దీంతో, న్యాయస్థానం మాలిక్‌కు ధిక్కరణ కేసులో నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈనెల 7వ తేదీకి వాయిదా వేసింది. -
జాతీయ గీతాన్ని అవమానించిన సీఎం మమతా బెనర్జీ.. కోర్టు సమన్లు జారీ
ముంబై: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ముంబై మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. ఇటీవల మమతా ముంబై వచ్చిన సమయంలో జాతీయ గీతాన్ని అవమానపరిచారనే ఆరోపణలపై దాఖలైన కేసులో మార్చి 2న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. కాగా డిసెంబరు 1, 2021న ముంబైలో ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి సీఎం మమతా బెనర్జీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అయితే ఈ కార్యక్రమంలో మమతా బెనర్జీ జాతీయ గీతాన్ని అవమానించారని మహారాష్ట్రకు చెందిన బీజేపీ కార్యకర్త, న్యాయవాది వివేకానంద గుప్తా ఆరోపించారు. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మెజిస్ట్రేట్ కోర్టును కోరారు. చదవండి: గవర్నర్‌కు షాకిచ్చిన దీదీ.. ట్విటర్ అకౌంట్ బ్లాక్.. ముంబైలో ఈకార్యక్రమానికి హాజరైన బెనర్జీ జాతీయ గీతంలోని మొదటి రెండు పద్యాలను కూర్చొని ఆలపించారని, ఆ తర్వాత నిలబడి మరో రెండు శ్లోకాలు పఠించారని, ఆ తర్వాత అకస్మాత్తుగా ఆగిపోయారని కోర్టుకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే మమతా బెనర్జీ జాతీయగీతాన్ని ఆలపించి, ఆ తర్వాత వేదికపై నుంచి వెళ్లిపోయినట్లు ఫిర్యాదుదారుడి వాంగ్మూలం, వీడియో క్లిప్,యూట్యూబ్‌లోని వీడియోల ద్వారా ప్రాథమికంగా స్పష్టంగా తెలుస్తోందని కోర్టు పేర్కొంది. జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం, 1971లోని సెక్షన్ 3 ప్రకారం మమతా శిక్షార్హమైన నేరానికి పాల్పడ్డాడని ఈ ప్రాథమిక విచారణ రుజువు చేస్తుందని తెలిపింది. చదవండి: మంటల్లో లారీ.. ప్రాణాలకు తెగించి రియల్ హీరో అయ్యాడు -
సల్మాన్ ఖాన్ ఫాంహౌస్‌లో సినీ తారల శవాలు.. కలకలం రేపుతున్న వ్యక్తి ఆరోపణలు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై కేతన్ కక్కడ్ అనే వ్యక్తికి సంచలన ఆరోపణలు చేశాడు. ఇటీవల కేతన్ కక్కడ్ ఓ యూట్యూబ్ చానల్ తో మాట్లాడుతూ.. పన్వేల్‌లోని సల్మాన్ ఖాన్ ఫాంహౌస్‌లో సినీ తారల శవాలను ఖననం చేశారని , అంతేకాకుండా సల్మాన్‌పై చిన్న పిల్లల అక్రమ రవాణా ఆరోపణలు కూడా ఉన్నాయని సదరు వ్యక్తి తెలిపాడు. దీంతో సల్మాన్ ఖాన్ అతనిపై కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. దీనిపై ముంబయి కోర్టులో సల్మాన్ తరఫు న్యాయవాది ప్రదీప్ గాంధీ వాదనలు వినిపిస్తూ.. సల్మాన్ ఖాన్ కు చెందిన పన్వేల్ ఫాంహౌస్‌లో సినీ తారల శవాలను పాతిపెడుతున్నారంటూ కేతన్ కక్కడ్ అసత్య ఆరోపణలు చేశాడని, పిల్లల అక్రమ రవాణా ఆరోపణలు.. కేవలం కల్పితాలని సల్మాన్ న్యాయవాది కోర్టుకు వివరించాడు. అయితే ఓ ఆస్తి వివాదానికి సంబంధించిన వ్యవహారమని, అందుకోసమే సల్మాన్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు సదరు వ్యక్తి ప్రయత్నిస్తున్నారని తెలియజేశాడు. కాగా, సల్మాన్ ఖాన్ తన పరువునష్టం దావాలో గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ల పేర్లను కూడా పేర్కొన్నాడు. ఆయా సామాజిక మాధ్యమాలు కేతన్ కక్కడ్ ఇంటర్వ్యూ వీడియోలను తొలగించాలని సల్మాన్ తరపు న్యాయవాది కోర్టును కోరాడు. -
సల్మాన్, సంజయ్‌తో సహా జైలు కూడు తిన్న బాలీవుడ్ సెలబ్రిటీలు వీళ్లే
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుదు ఆర్యన్ ఖాన్ అరెస్టయిన విషయం తెలిసిందే. తాజాగా ఆర్యన్ బెయిల్ పిటిషన్‌ను విచారించిన ముంబై కోర్టు మరోసారి అతడికి బెయిల్ నిరాకరిస్తూ తీర్పునిచ్చింది. ప్రస్తుతం ఆర్యన్ ముంబైలోరి ఆర్థర్ రోడ్ జైలులో ఖైదీగా ఉంటున్నాడు. అయితే జైల్లో ఖైదు అయిన వారిలో ఆర్యన్ ఏమీ ఫస్ట్ సెలబ్రిటీ కాదు..అతని కంటే ముందు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు జైలుకెళ్లారు. కొంత మంది బెయిల్‌పై విడుదలైయితే...మరికొంత మంది జైలు శిక్ష కూడా అనుభవించారు. ఇంతకీ జైల్లో చిప్పకూడు తిన్న సెలబ్రిటీలు ఎవరెవరున్నారంటే.. సల్మాన్ ఖాన్ 1998లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్ కోర్ట్ ఐదేళ్ల శిక్ష విధించింది. ఈ కేసులో సల్మాన్ ఖాన్ కొన్ని నెలలు జైలు జీవితం గడిపారు., మొదట ఆయన్ను ఉంచింది ఆర్థర్ రోడ్ జైలులోనే. సంజయ్ దత్ 1993 ముంబై సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో సంబంధం ఉందనే అభియోగంపై బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్ జైలు శిక్ష అనుభవించాడు. మొదట్లో అతన్ని ర్ రోడ్ జైలులోని హై-సెక్యూరిటీ బ్లాక్‌లో ఉంచి, ఆ తర్వాత పూణేలోని యెరవాడ జైలుకు తరలించారు. ఫర్దీన్ ఖాన్ ఫిరోజ్ ఖాన్ కుమారుడు ఫర్దీన్ ఖాన్ 2001లో ముంబై పోలీసులకు డ్రగ్స్‌తో పట్టుబడ్డాడు. ఫర్దీన్ ఖాన్ కేసు కోర్టుకు కూడా వెళ్లింది. ఆయన కూడా రీహాబిలిటేషన్ సెంటర్లో చికిత్సకు అంగీకరించడంతో ఎలాంటి శిక్షా పడలేదు. సొనాలి బింద్రే ఒక మ్యాగజైన్ కవర్ పేజ్ వివాదంలో ఒక మతాన్ని కించపరిచిన కారణంగా జైలు కెళ్లిన సోనాలి బింద్రే. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల అయింది రియా చక్రవర్తి బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత, అతనికి డ్రగ్స్ సరఫరా చేసిన పలువురు డ్రగ్ పెడ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో, సుశాంత్ అప్పటి స్నేహితురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షావిక్ చక్రవర్తి పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. మాదకద్రవ్యాల కేసులో ఆమె పేరు చిక్కుకున్న తర్వాత రియా చక్రవర్తిని సెప్టెంబర్ 7 న ఎన్‌సిబి విచారించింది. ఒక నెల పాటు జైలు శిక్ష అనుభవించిన తర్వాత నటి బెయిల్‌పై విడుదలైంది. షైనీ అహుజా పనిమనిషిని అత్యాచారం చేసిన కేసులో అరెస్టై జైలు శిక్ష అనుభవించిన శైనీ ఆహూజా. 2009 జూన్‌లో అరెస్ట్ అయిన గ్యాంగ్‌స్టర్ హీరో షైనీ అహుజాకు 2011 లో బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అప్పటి వరకు ఆయన ఆర్థర్ రోడ్ జైలులో ఖైదీగా కాలం గడిపాడు. రాజ్‌కుంద్రా ఇటీవల అశ్లీల చిత్రాల నిర్మాణం, ముంబైల్ యాప్స్‌లో వారి పబ్లిష్ చేశారనే అభియోగం కింద శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసి, బెయిల్ మంజూరయ్యేంత వరకు రెండు నెలల పాటు ఆర్థర్ రోడ్ జైలులో ఉంచారు. -
షారుక్‌కు షాక్, ఆర్యన్‌కు దొరకని బెయిల్
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు మళ్లీ కోర్టులో చుక్కెదురైంది. తాజాగా ఆర్యన్ బెయిల్ పిటిషన్‌ను విచారించిన ముంబై కోర్టు మరోసారి అతడికి బెయిల్ నిరాకరిస్తూ తీర్పునిచ్చింది. కాగా గత 14 రోజులుగా ఆర్యన్ ఆర్థర్రోడ్ జైలులోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఆర్యన్ బెయిల్‌ను ముంబై కోర్టు తిరస్కరించడం ఇది మూడవ సారి. దీంతో షారుక్, అతని భార్య గౌరీ ఖాన్ ఆందోళన చెందుతున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. చదవండి: ఇకపై నిరుపేదల కోసం పని చేస్తా: ఆర్యన్ ఖాన్ కాగా గత ముందు బెయిల్ దరఖాస్తులలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రత్యుత్తరాలను దాఖలు చేస్తుందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అద్వైత్ సేథ్నా జూనియర్ కోర్టుకు తెలియజేశారు. దీంతో బుధవారం ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై ప్రత్యేక ఎన్డిపిఎస్ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ దొరకలేదు. ఆర్యన్ బెయిల్‌ను కోర్టు నిరాకరించింది. విచారణకు ముందు ఆర్యన్‌కు నేడు బెయిల్ దొరకడం ఖాయమని ముంబై సెషన్స్ కోర్టులో సీనియర్ న్యాయవాది మజీద్ మెమన్ ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: నా కొడుక్కి బెయిల్ వచ్చేవరకు స్వీట్లు వండొద్దు! : గౌరీ ఖాన్ ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌పై దాడి చేసిన పోలీసులు ఆర్యన్‌తో పాటు మరికొందరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 8 నుంచి ఆర్యన్ ముంబైలోని ఆర్థర్రోడ్ జైల్లో ఉన్నాడు. ఆర్యన్ వద్ద డ్రగ్స్ దొరకలేదని ఆయన తరపు న్యాయవాదులు చేసిన వాదనను కోర్టు పట్టించుకోలేదు. మరోవైపు ఓ వర్ధమాన నటితో ఆర్యన్ వాట్సాప్ లో డ్రగ్స్ గురించి చేసిన సంభాషణను కోర్టుకు ఎన్సీబీ అందించింది. మరోవైపు ఆర్యన్ స్నేహితులు అర్భాజ్ మర్చంట్, మున్ మున్ ధమేచా పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను కూడా కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆర్యన్ తరపు లాయర్లు ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి: తల్లిదండ్రులను చూసి ఒక్కసారిగా ఏడ్చిన ఆర్యన్.. -
జ్యుడీషియల్ కస్టడీకి ఆర్యన్
ముంబై: క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ స్వాధీనం కేసులో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్‌తోపాటు మరో ఏడుగురిని 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ముంబై మేజిస్ట్రేట్ కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఆర్యన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అతని న్యాయవాది సతీష్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపడతామని తెలిపింది. నిందితులను తమ కస్టడీకి అప్పగిస్తూ ఇచ్చిన గడువును ఈ నెల 11 దాకా పొడిగించాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) కోరింది. డ్రగ్స్ స్వాధీనం కేసులో కుట్రలను వెలికి తీయాల్సి ఉందని, ఈ వ్యవహారంలో అచ్చిత్ కుమార్ అనే మరో వ్యక్తిని అరెస్టు చేశామని(సరఫరాదారు కావొచ్చని అనుమానం).. అతడిని, నిందితులను కలిపి విచారించాల్సి ఉందని వెల్లడించింది. అయితే, ఎన్సీబీ విజ్ఞప్తిని న్యాయస్థానం కొట్టిపారేసింది. అస్పష్టమైన ఆధారాలను బట్టి నిందితులను మళ్లీ ఎన్సీబీ కస్టడీకి అప్పగించలేమని పేర్కొంది. ఈ నెల 3న ముంబై నుంచి గోవాకు పయనమైన పర్యాటక నౌకలో డ్రగ్స్‌తో కొందరు పార్టీ చేసుకుంటున్న సమాచారం అందడంతో ఎన్సీబీ దాడి చేసింది. వివిధ రకాల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. ఆర్యన్ ఖాన్, మున్మున్ ధామేచా, అర్బాజ్ మర్చంట్‌ను అరెస్టు చేసింది. షారుక్ మేనేజర్ పూజా దద్లానీ గురువారం కోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో ఆమె రోదించారు. 8 మంది నిందితులకు కోవిడ్ నెగటివ్ టెస్టు రిపోర్టు లేకపోవడంతో అధికారులు వారిని జైలుకు తరలించకుండా గురువారం రాత్రి ఎన్సీబీ ఆఫీస్‌లోనే∙ఉంచారు. నిందితులను కలిసి, మాట్లాడేందుకు వారి కుటుంబ సభ్యులను అనుమతించారు. పూజా దద్లానీ ఎన్సీబీ ఆఫీసుకు వచ్చి ఆర్యన్‌ను కలిశారు. -
ఆర్యన్ ఖాన్ కేసు నిరూపణ అయితే శిక్ష ఎన్నేళ్లంటే..
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ బాద్షా షారుఖ్ తనయుడు ఆర్యన్ డ్రగ్స్ కేసులో అరెస్టు కావడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్ యాక్ట్ 1985 (ఎన్డీపీఎస్) చట్టంలోని పలు నిబంధనలు అభియోగాలుగా ఎన్సీబీ నమోదు చేసింది. ఆర్యన్‌పై నమోదైన సెక్షన్లు వాటికి పడే శిక్షలను ఓసారి చూద్దాం.. ఆర్యన్, మరో ఏడుగురి అరెస్టు మెమో ప్రకారం 13 గ్రాముల కొకైన్, ఐదు గ్రాముల ఎండీ, 21 గ్రాముల చరస్, ఎండీఎంఏ 22 టాబ్లెట్లు ఎన్సీబీ సీజ్ చేసింది. అరెస్టయిన వారిపై ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 8(సీ), 20 (బీ), 27 రెడ్ విత్ సెక్షన్ 35లు నమోదు చేసింది. దోషులుగా తేలితే ఆయా సెక్షన్ల వల్ల శిక్ష, జరిమానా ఇలా... సెక్షన్8(సీ): ఈ సెక్షన్ ప్రకారం ఎలాంటి మాదక ద్రవ్యాలను ఎవరూ ఉత్పత్తి, అమ్మకం, కొనుగోలు, రవాణా, నిల్వ, వినియోగం, కలిగి ఉండడం, విదేశాల నుంచి ఎగుమతి, దిగుమతి, సరఫరా వంటివి చేయకూడదు. చదవండి: (ఆర్యన్ ఖాన్‌కు దొరకని బెయిల్) సెక్షన్ 20 (బీ): గంజాయి (కన్నాబిస్) ఉల్లంఘనకు సంబంధించిన సెక్షన్. తక్కువ మొత్తంలో మాదక ద్రవ్యాలు దొరికతే కఠిన కారాగార శిక్ష(ఏడాది వరకూ) లేదా రూ.10 వేల జరిమానా లేదా రెండు అమలు చేస్తారు. ఎక్కువ మొత్తం దొరికితే.. పదేళ్ల వరకూ కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష వరకూ జరిమానా. ఒకవేళ వాణిజ్యపరమైన మొత్తంలో దొరికితే.. పదేళ్ల నుంచి 20 ఏళ్ల వరకూ కఠిన కారాగార శిక్ష, రూ లక్ష నుంచి రూ.2 లక్షల వరకూ జరిమానా విధించొచ్చు. సెక్షన్ 27: ఈ సెక్షన్ ప్రకారం... ఎ). కొకైన్, మార్ఫైన్, డయాసైటైల్మోర్ఫిన్, ఇతర నార్కొటిక్ డ్రగ్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్‌ను వినియోగించినట్లైతే ఏడాది కఠిన కారాగారం, రూ. 20 వేల జరి మానా లేదా రెండూ విధించొచ్చు. బి). తక్కువ మొత్తంలో అయితే 6 నెలల జైలు, రూ.10 వేల జరిమానా లేదా రెండు విధిం చొచ్చు. దాడిలో దొరికిన నిషేధిత డ్రగ్ పరిమాణాన్ని బట్టి సెక్షన్ 20 కింద శిక్ష ఉంటుంది. వాణిజ్యపరంగా డ్రగ్స్ కలిగి ఉంటే ప్రభుత్వ న్యాయవాది అంగీకారం లేకుండా బెయిలు రావడం కుదరదు. చదవండి: (Mumbai Cruise Rave Party: ఎవరీ సమీర్ వాంఖెడే..?) -
ఆర్యన్ ఖాన్‌కు దొరకని బెయిల్
ముంబై: క్రూయిజ్ షిప్ డ్రగ్స్ పార్టీ కేసులో అరెస్టయిన బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌కు స్థానిక కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన మేజిస్ట్రేట్ కోర్టు అతడితోపాటు మరో ఇద్దరికి ఈ నెల 7వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది. ఈ కేసులో కీలకమైన తదుపరి విచారణకు వీరిని ప్రశ్నించడం ఎంతో అవసరమని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది. ఆదివారం ఆర్యన్ ఖాన్ మరో ఇద్దరికి విధించిన ఒక్క రోజు కస్టడీ గడువు ముగియడంతో సోమవారం నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు వారిని కోర్టులో హాజరుపరిచారు. ఆదివారం అరెస్ట్ చేసిన మరో ఆరుగురికి కూడా అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్ఎం నెర్లికర్ ఈనెల 7వ తేదీ వరకు ఎన్సీబీ కస్టడీకి అనుమతించారు. ‘సహనిందితుల వద్ద కూడా డ్రగ్స్ ఉన్నట్లు తేలింది. నిందితులు ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచాతో వీరు కలిసే ఉన్నారు. ఈ కేసులో పూర్తి స్థాయి దర్యాప్తునకు నిందితులను విచారించాల్సిన అవసరం ఉంది. వీరు తమ నిర్దోషిత్వం నిరూపించుకోవడానికి కూడా ఇది ఉపయోగ పడుతుంది’ అని మేజిస్ట్రేట్ తన తీర్పులో పేర్కొన్నారు. తీర్పు వెలువరించే సమయంలో ఆర్యన్ ఖాన్ నిబ్బరంగా కనిపించగా.. అర్బాజ్, మున్మున్లు ఒక్కసారిగా రోదించారు. ఆర్యన్ ఖాన్ తరఫున లాయర్ సతీశ్ మానెషిండే తన వాదనలు వినిపిస్తూ.. తన క్లయింట్‌కు ఎలాంటి నేర చరిత్ర లేదనీ, అతడి వద్ద ఎలాంటి డ్రగ్స్ లభ్యం కాలేదని తెలిపారు. ఎన్సీబీ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపాలన్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ దందాతో సంబంధమున్న ఈ కేసులో వివరాలను రాబట్టాలంటే నిందితులను విచారించాల్సిన అవసరం ఉందని ఎన్సీబీ లాయర్ వాదించారు. వారిని ఈనెల 11వ తేదీ వరకు, వారంపాటు కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరారు. శనివారం రాత్రి ముంబై తీరంలోని ఓ క్రూయిజ్ షిప్‌పై ఎన్సీబీ అధికారులు మెరుపుదాడి జరిపి పలు రకాల నిషేధిత డ్రగ్స్‌తోపాటు ఆర్యన్ ఖాన్ తదితరులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, క్రూయిజ్ షిప్ సోమవారం తీరానికి చేరుకోవడంతో ఎన్సీబీ అధికారులు దాదాపు 6 గంటలపాటు అణువణువూ శోధించారు. ఎనిమిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కొన్ని అనుమానిత డ్రగ్స్ కూడా లభించాయన్నారు. -
పోర్నోగ్రఫీ కేసు: శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు బెయిల్
Raj Kundra Got Bail: పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త, శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 50వేల రూపాయల పూచీకత్తుపై కోర్టు సోమవారం రాజ్‌కుంద్రాకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కుంద్రాతో పాటు ఆయన దగ్గర ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న ర్యాన్ థోర్పేకి సైతం బెయిల్ మంజూరు అయ్యింది. చదవండి: 'నేను చాలా బిజీ.. నా భర్త ఏం చేస్తుండేవాడో నాకు తెలియదు' కాగా అశ్లీల చిత్రాల కేసులో జులై19న రాజ్‌కుంద్రాను ముంబై క్రైం బ్రాం పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. నటనపై ఆసక్తితో వచ్చిన వారిని బెదిరించి అశ్లీల చిత్రాలను తీసి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో విడుదల చేసేవాడని రాజ్ కుంద్రాపై ఆరోపణలు. ఇటీవలె శిల్పాశెట్టి స్టేట్మెంట్ను కూడా పోలీసులు రికార్డు చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయిన రెండు నెలల తర్వాత రాజ్‌కుంద్రాకు బెయిల్ వచ్చింది. చదవండి : దర్శనానికి గుర్రంపై వచ్చిన శిల్పాశెట్టి.. ఫోటోలు వైరల్ -
డ్రగ్స్ కేసు : నటుడు అర్మాన్ కోహ్లీకి షాక్ ఇచ్చిన కోర్టు
Armaan Kohli Bail Denied In Drugs Case: నటుడు అర్మాన్ కోహ్లీకి ముంబై కోర్టు షాకిచ్చింది. అతను పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. వివరాల ప్రకారం.. డ్రగ్స్ కేసులో నటుడు అర్మాన్ కోహ్లీని గత నెల28న ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అర్మాన్ నివాసంలో జరిపిన సోదాల్లో 1.2 గ్రాముల కొకైన్ లభ్యం కావడంతో ఎన్సీబీ అతడ్ని అదుపులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో మేజిస్ట్రేట్ కోర్టు అర్మాన్‌కు 14రోజల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీనిని సవాలు చేస్తూ తనకు డ్రగ్ సప్లయర్స్‌తో సంబంధాలు ఉన్నాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని అర్మాన్ పేర్కొన్నాడు. తనకు వెంటనే బెయిల్ ముంజూరు చేయాలని కోరుతూ ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కాగా ఈ కేసులో అర్మాన్తో పాటు ఏడుగురు నిందితులు ఉన్నారని, వీరికి ఒకరితో మరొకరికి సంబంధాలు ఉన్నాయని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అద్వైత్ సేథ్నా కోర్టుకు వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో అర్మాన్‌కు బెయిల్ మంజూరు చేయరాదంటూ కోర్టుకు విన్నవించారు. దీనిపై ఏకీభవించిన అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్ఎమ్ నెర్లికర్ అర్మాన్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. చదవండి : సిద్ధార్థ్ శుక్లాకు నివాళులు అర్పించిన హాలీవుడ్ నటుడు జయలలిత సమాధి వద్ద నివాళులు అర్పించిన కంగనా రనౌత్ -
భార్యాభర్తల మధ్య బలవంతపు శృంగారం.. కోర్టు సంచలన తీర్పు
ముంబై: ‘భార్యతో బలవంతంగా శృంగారంలో పాల్గొనడం చట్ట వ్యతిరేకం’. గతంలో భార్యాభర్తల కేసులో కోర్టులు ఇచ్చిన తీర్పు ఇది. మహిళకు ఇష్టం లేకుండా భర్త శృంగారం కోసం బలవంతపెట్టడం తప్పు అంటూ పలు సందర్భాల్లో కోర్టులు తమ తీర్పును వెలువరించాయి. అయితే తాజాగా ముంబై కోర్టు మాత్రం భార్యభర్తల కేసులో ఇందుకు భిన్నంగా తీర్పిచ్చింది. భార్యాభర్తల మధ్య బలవంతపు శృంగారం చట్టవిరుద్దం కాదని ముంబై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అతను మహిళ భర్త అవ్వడం వల్ల ఇది చట్టం ముందు నిలబడదని ముంబై అడిషనల్ సెషన్స్ జడ్జి సంజశ్రీ జే ఘరత్ స్పష్టం చేశారు. మహారాష్ట్రకు చెందిన ఓ మహిళకు గత ఏడాది నవంబర్ 22న వివాహమైంది.పెళ్లైన కొద్ది రోజులకే తన భర్త, అత్తామామలు వరకట్న వేధింపులకు గురిచేస్తూ, ఆమెపై ఆంక్షలు విధించారు. అంతేగాక వివాహమైన నెల రోజులకు తన కోరికకు విరుద్ధంగా భర్త తనతో బలవంతంగా శృంగారం చేసినట్లు మహిళ ఆరోపించింది. జనవరి 2వ తేదీన తమ జంట మహబళేశ్వరం వెళ్లగా.. అక్కడ కూడా భర్త తనపై బలవంతంగా సెక్స్ చేసినట్లు పేర్కొంది. అప్పటి నుంచి ఆమెకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో వైద్యున్ని సంప్రదించింది. అయితే డాక్టర్ ఆమెను పరీక్షించిన తర్వాత నడుము కింది భాగం పక్షవాతానికి గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో తన భర్త బలవంతంగా శృంగారం చేయడంతోనే తనకీ పక్షవాత సమస్య వచ్చిందని భావించిన మహిళా.. భర్తపై ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం వారు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. చివరికి ఈ కేసు కోర్టుకు చేరడంతో.. తాము వరకట్నం కోసం డిమాండ్ చేయలేదని, తప్పుగా ఈ కేసులో ఇరికించారని భర్త, అతని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. భర్త కూడా మహిళపై కేసు పెట్టాడని, తాము( మహిళ ఆరోపించిన కుటుంబ సభ్యులు) రత్నగిరిలో నివసిస్తున్నామని, ఆ జంటతో రెండు రోజులు మాత్రమే కలిసున్నామని కోర్టుకు తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న జడ్జీ సంజశ్రీ జే ఘరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న వయసులో మహిళ పక్షవాతానికి గురికావడం దురదృష్టకరం. కాని మహిళ పరిస్థితికి భర్తనే కారణం అనడం సరికాదని పేర్కొన్నారు. అదనపు కట్నం డిమాండ్ చేశారని ఆరోపిస్తున్న మహిళా.. వారు ఎంత డిమాండ్ చేశారో చెప్పడం లేదని బాధితురాలిని ప్రశ్నించారు. పెళ్లి తర్వాత భార్యతో భర్త బలవంతంగా సెక్స్ చేస్తే అది చట్ట విరుద్ధం కాదని స్పష్టం చేశారు. దీనిపై విచారణ అనవసరమని పేర్కొన్నారు. -
సుషాంత్ కేసు: సిద్ధార్థ్ కస్టడీకి కోర్టు అనుమతి
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో నటుడి పీఆర్ మేనేజర్ సిద్ధార్థ్ పితానిని ఎన్సీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా సిద్దార్థ్ అరెస్ట్‌పై తాజాగా ఎన్సీబీ ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది. '' ఈ నెల 26న సిద్థార్ధ్ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశాం. విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినా .. సిద్థార్ధ్ స్పందించలేదు. దీంతో సిద్ధార్థ్‌ను అరెస్ట్ చేసి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశాం. హైదరాబాద్ నుంచి ట్రాన్సిట్ వారెంట్‌పై ముంబైకి తరలించి ముంబై కోర్టులో సిద్థార్ధ్ను హాజరుపరిచాం. కోర్టు జూన్ 1 వరకు సిద్ధార్థ్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు అనుమతి ఇచ్చింది.'' అని తెలిపింది. కాగా అతడు గతంలో సుశాంత్ నివసించిన ఫ్లాట్‌లోనే మూడేళ్లపాటు ఉన్నాడు. జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకునే ముందు చివరిసారిగా సిద్ధార్థ్‌తో మాట్లాడినట్లు పోలీసులు గతంలోనే గుర్తించారు. ఈ నేపథ్యంలో సుశాంత్ ఆత్మహత్య కేసులో సీబీఐ అధికారులు ఇతడిపై విచారణ జరిపారు. అలాగే ఈ కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంలోనూ ఎన్సీబీ అధికారులు సిద్ధార్థ్‌ను పలుమార్లు విచారించారు. చదవండి: సుశాంత్ కేసు: నటుడి పీఆర్ మేనేజర్ అరెస్ట్ -
ఆలియా భట్‌కి షాకిచ్చిన ముంబై కోర్టు
ముంబై : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి ముంబై కోర్టు సమన్లు జారీ చేసింది. ముంబై మాఫియా రారాణి గంగూబాయి జీవితం ఆధారంగా ‘గంగూభాయ్ కతియావాడీ’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది ముంబై రెడ్ లైట్ ప్రాంతంతో పాటు కామాటిపుర చుట్టూరా కథ తిరగనుంది. గంగూబాయ్ కతియావాడి టైటిల్ రోల్లో ఆలియాభట్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమా కథాంశం తన తల్లిని కించపరిచేలా ఉందని ఆమె నలుగురు దత్తపుత్రుల్లో ఒకరైన బాబూజీ రాజీ షా కోర్టులో పరువు నష్టం దావా వేశారు. సినిమా కథాంశం చనిపోయిన తన తల్లి గోప్యత హక్కును హరించేలా ఉందని షా తన పిటిషన్లో పేర్కొన్నాడు. దీనిపై విచారించిన కోర్టు..ఆలియా భట్, దర్శకుడు భన్సాలీతో పాటు మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబైఅనే పుస్తకాన్ని రచించిన హుస్సేన్ జైదీలకు సమన్లు జారీ చేసింది. దీనిపై మార్చి 21 లోగా సమాధానం చెప్పాలని ముంబై కోర్టు ఆదేశించింది. మాఫియా క్వీన్‌గా పేరు పొందిన ముంబయ్‌లోని కామాటిపురా ప్రాంత వేశ్యలకు నాయకురాలిగా వ్యవహరించిన గంగూబాయ్ కోఠేవాలీ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ముంబయ్ ఫిల్మ్‌సిటీలో కామాటిపురా సెట్ వేశారు.గంగూబాయ్ పాత్రను ఆలియా చేస్తున్నారు. అయితే ఈనెల ప్రారంభంలో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి కరోనా సోకడంతో షూటింగ్‌కి బ్రేక్ పడింది. ప్రస్తుతం ఆయనకు కోవిడ్ నెగిటివ్ వచ్చినందున మరికొన్ని రోజుల్లోనే ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనుంది. జూలై 30న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. చదవండి : గంగుబాయి.. నేటికి ఆమె ఫోటో వేశ్యాగృహాల్లో.. పాట కోసం బ్రేక్ -
అత్యంత తీవ్రమైన ఆరోపణలు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ఆ రాష్ట్ర మాజీ పోలీసు చీఫ్ పరమబీర్ సింగ్ తన పిటిషన్లో చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని సుప్రీం కోర్టు అంగీకరించింది. అయితే ఆ పిటిషన్‌ను విచారించడానికి మాత్రం నిరాకరించింది. బొంబాయి హైకోర్టుకు వెళ్లాలని పరమ్‌బీర్‌కు సూచించింది. అనిల్ దేశ్ ముఖ్ అవినీతిపై సంచలన ఆరోపణలు చేసిన పరమ్‌బీర్ ఈ అంశంపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ విచారణ చేపట్టడానికి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఆర్ రెడ్డిలతో కూడిన బెంచ్ నిరాకరించింది. పరమ్‌బీర్ తన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడానికి అంగీకరించిన కోర్టు బొంబాయి హైకోర్టుకు వెళ్లాలని చెప్పింది. అయితే పరమ్‌బీర్ చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, దీనిని తీవ్రమైన అంశంగానే పరిగణించాలని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ జరగాలని పరమ్‌బీర్ అనుకుంటే హైకోర్టుకే వెళ్లాలని, ఈ తరహా కేసుల్ని హైకోర్టులే చూస్తాయని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. వివిధ వ్యాపార సంస్థల నుంచి నెలకి రూ.100 కోట్లు వసూలు చేయాలని పోలీసు అధికారి సచిన్ వాజేకి హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ లక్ష్యంగా నిర్ణయించారని ముంబై పోలీసు మాజీ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ ఆరోపించిన విషయం తెలిసిందే. -
చందా కొచర్‌కు మరోసారి నిరాశ
సాక్షి, ముంబై: ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచర్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గత నెలలో అరెస్టు చేసిన చందాకొచర్ భర్త దీపక్ కొచ్చర్ కు ఊరట కల్పించేందుకు కోర్టు నిరాకరించింది. ఇటీవల కరోనా బారిన పడిన దీపక్ కొచర్ పోస్ట్ కోవిడ్ -19 చికిత్స నిమిత్తం అనుమతి కోరుతూ పెట్టుకున్న విజ్ఞప్తిని ముంబైలోని ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ముంబైలోని తలోజా జైలులో ఉండగానే ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే కోలుకున్న తరువాత ఆందోళనలో ఉన్న కొచర్‌ను మరింత మెరుగైన వైద్యంకోసం ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చాలని ఆయన తరపు న్యాయవాది కోర్టును కోరారు. అయితే ఈ విజ్ఞప్తిని ప్రత్యేక న్యాయమూర్తి ప్రశాంత్ పీ రాజవైద్యా తోసిపుచ్చారు. కాగా ఐసీఐసీఐ బ్యాంక్ క్విడ్ ప్రో కో కింద వీడియోకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు 1875 కోట్ల రూపాయల రుణాలను అక్రమ మంజూరు ఆరోపణలు, వారి వ్యాపార సంస్థలపై మనీలాండరింగ్ కేసుకు సంబంధించి దీపక్ కొచర్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. -
కంగనాపై మరో కేసు
ముంబై : మతపరమైన అసమ్మతిని సృష్టించేలా ట్వీట్లు చేసిన బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులును ముంబై కోర్టు ఆదేశించింది. ప్రజల మధ్య విభేదాలు సృష్టించేలా కంగనా అభ్యంతరకర ట్వీట్ చేశారంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించగా.. ఫిర్యాదును స్వీకరించిన కోర్టు న్యాయస్థానం ఆమెపై కేసు నమోదు చేయాలని అదేశించింది. (చదవండి : నేనూ బాలీవుడ్‌కి ఇచ్చాను!) బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మృతిపై మహారాష్ట్ర పోలీసులు, కేంద్ర దర్యాప్తు బృందాలు విచారణ చేస్తున్న సమయంలో ప్రజల్లో అనుమానాలు కలిగేలా వివాదస్పద వ్యాఖ్యలతోపాటు, ముంబైని పాక్ అక్రమిత కశ్మీర్‌గా పోలుస్తూ ప్రజల మధ్య విభేదాలు సృష్టించే విధంగా కంగనా రనౌత్ అభ్యంతరకర ట్వీట్ చేసిందని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలిపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని ముంబైలోని బాంద్రా మేజిస్ట్రేట్ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశంతో ముంబై పోలీసులు కంగనపై దేశ ద్రోహం కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
రియాకు రిమాండ్ పొడిగింపు
ముంబై: నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి ఇరువురూ బాంబే హైకోర్టులో మంగళవారం బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. వీరి బెయిలు విచారణ బుధవారం జస్టిస్ సారంగ్ కొత్వాల్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుందని వారి తరఫు న్యాయవాది సతీష్ మనేషిండే తెలిపారు. సెప్టెంబర్ 9న రియాచక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసింది. రియా చక్రవర్తి తాను ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొన్న వ్యక్తులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ, ఆ రోజు వీరు పెట్టుకున్న బెయిలు పిటిషన్లను స్పెషల్ ఎన్డీపీఎస్ కోర్టు తిరస్కరించింది. స్పెషల్ కోర్టు వీరి జ్యూడీషియల్ రిమాండ్‌ని అక్టోబర్ 6 వరకు మరో పద్నాలుగు రోజులు పొడిగించింది. శామ్యూల్ మిరాండాతో సహా రియా సోదరుడు షోవిక్ చక్రవర్తిని ఎన్సీబీ సెప్టెంబర్ 5న అరెస్టు చేసింది. వీరి బెయిలు పిటిషన్లను సైతం ప్రత్యేక కోర్టు సెప్టెంబర్ 11న తిరస్కరించింది. -
వరవరరావు బెయిల్ పిటిషన్ నిరాకరణ
సాక్షి, ముంబై: విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు బెయిల్ పిటిషన్‌ను ముంబై కోర్టు నిరాకరించింది. వరవరరావు అనారోగ్యంగా ఉన్నారని, బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపున న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టి వేసింది. భీమా కోరేగావ్ కేసులో వరవరరావు కీలక నిందితుడని, ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని జాతీయ దర్యాప్తు సంస్థ (ఏన్ఐఏ) అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. (వరవరరావుకు తీవ్ర అస్వస్థత) ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై 2018 నవంబర్‌లో అరెస్టయిన వరవరరావును తొలుత మహారాష్ట్ర పుణేలోని ఎరవాడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎరవాడ నుంచి నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించారు. తలోజా జైలులో కరోనా బారిన పడి ఒకరు మరణించినట్లు ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. ఈ నేపథ్యం లో వృద్ధుడైన తమ తండ్రిని జైలు నుంచి విడుదల చేయాలంటూ వరవరరావు కుమార్తెలు ఇటీవల మహా రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితరులకు లేఖలు కూడా రాశారు. (వరవరరావు కేసు: ఎఫ్‌బీఐకు హార్డ్‌డిస్క్!) -
మాల్యాకు ముంబయ్ ఈడీ కోర్టు షాక్
-
నీరవ్ మోదీకి భారీ షాక్
న్యూఢిల్లీ : పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ(48)కి ముంబైలోని స్పెషల్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడి(ఎఫ్ఈవో)గా నీరవ్‌ను గుర్తిస్తూ ప్రకటన విడుదల చేసింది. మనీలాండరింగ్ చట్టం కింద ముంబైలోని అక్రమ నగదు చెలామణి నిరోధక(పీఎంఎల్ఏ) కోర్టు అతడిని ఆర్థిక నేరగాడిగా పేర్కొంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ)ను రూ.14వేల కోట్ల మేర మోసం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ లండన్‌కు పారిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడిని అప్పగించాలంటూ భారత్ యూకేను కోరుతోంది. ఈ నేపథ్యంలో లండన్‌లో అరెస్టైన నీరవ్.. బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకోగా నాలుగుసార్లు తిరస్కరణకు గురైంది. దీంతో అతడిని నైరుతి లండన్‌లోని వాన్‌డ్స్‌వర్త్ జైలుకు తరలించారు. ఈ క్రమంలో డిసెంబర్ 4న వీడియో లింక్ ద్వారా అతడిని కోర్టు విచారించనుందని వార్తలు వెలువడ్డాయి. కాగా నీరవ్ మోదీ బెయిల్ పిటిషన్‌ను భారత్ తరపున వాదిస్తున్న న్యాయవాది లండన్ కోర్టులో సవాల్ చేశారు. ఇక భారత్‌కు అప్పగిస్తే ఆత్మహత్య చేసుకుంటానని నీరవ్ మోదీ బెదిరించిన విషయం తెలిసిందే. కాగా భారత బ్యాంకులకు రూ.9,000 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు చెక్కేసిన వ్యాపారవేత్త విజయ్‌మాల్యాను ముంబై కోర్టు ఆర్థిక నేరస్తుడిగాఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. తాజా పరిణామాల నేపథ్యంలో మాల్యా తర్వాత ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించిన రెండో వ్యక్తిగా నీరవ్ నిలిచాడు. -
పీఎన్బీ స్కాం : చోక్సీకి ఈడీ కౌంటర్
సాక్షి, ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకులో కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, అతని మామ మెహుల్ చోక్సీలను స్వదేశానికి రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో అనారోగ్య కారణాలతో విచారణకు రాలేనంటూ కుంటిసాకులు చెబుతూ వస్తున్న చోక్సీకి షాకిచ్చేలా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక నిర్ణయం తీసుకుంది. విచారణను ఆలస్యం చేసే ఉద్దేశంతో కావాలనే సాకులు చెబుతున్నాడని, చోక్సీకి వ్యతిరేకంగా నాన్ బెయిల్‌బుల్, రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఈడీ ముంబై కోర్టును కోరింది. దర్యాప్తునకు సహకరించకుండా, భారతదేశాని తిరిగి రావడానికి నిరాకరిస్తున్నాడని సీబీఐ, ఈడీ ఆరోపించాయి. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్న చోక్సీ అభ్యర్థనను కొట్టివేయాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో పీఎన్బీ స్కాం విచారణను ఆంటిగ్వాలో జరపాలంటూ మెహుల్ చోక్సీ పెట్టుకున్న విజ్ఞప్తిని ఈడీ శనివారం తిరస్కరించింది. అలాగే ఆంటిగ్వా నుండి చోక్సిని తిరిగి భారతదేశానికి తీసుకురావడానికి వైద్య నిపుణులతో ఎయిర్ అంబులెన్స్‌ను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. దేశంలో అవసరమైన అన్ని వైద్య చికిత్సలను అందుబాటులో ఉంచుతామని కూడా ఇడి కోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు ముంబై కోర్టులో కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. అనారోగ్య కారణం పేరుతో చట్టపరమైన చర్యలను ఆలస్యం చేస్తూ, కోర్టును తప్పుదోవ పటిస్తున్నాడని చోక్సీ పై ఈడీ మండిపడింది. భారతదేశం తిరిగి వచ్చేలా అఫిడవిట్ దాఖలు చేయాలని చోక్సీని ఆదేశించాలని కోర్టును కోరింది. అతను తిరిగి రావడానికి ఖచ్చితమైన తేదీని పేర్కొనాలని ఈడీ కోరింది. ఆర్డర్ ఇచ్చిన తేదీ నుండి ఒక నెలలోపు రావాలని పేర్కొంది. కాగా నకిలీ పత్రాలతో పీఎన్బీలో 14వేల కోట్ల రూపాయల మేర రుణాలను తీసుకొని ఎగ్గొట్టి నీరవ్‌మోదీ లండన్‌కు పారిపోగా, మెహుల్ చోక్సీ ఆంటిగ్వాకు చెక్కేసి అక్కడి పౌరసత్వం తీసుకున్న సంగతి తెలిసిందే. -
ఆ కుర్చీలో కూర్చుంటే అంతే: సాధ్వి ప్రజ్ఞాసింగ్
ముంబై: భోపాల్ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ శువ్రవారం మొదటిసారిగా 2008 నాటి మాలేగావ్ పేలుడు కేసులో కోర్టుకు హాజరయ్యారు. సుమారు రెండున్నర గంటలపాటు కోర్టు హాలులో నిలుచునే ఉన్నారు. జడ్జి పలుమార్లు కూర్చోవచ్చని చెప్పినా ఆమె నిరాకరించారు. విచారణ ముగిసి, జడ్జి వెళ్లి పోయిన తర్వాత ప్రజ్ఞ కోర్టురూమ్‌లో సౌకర్యాలు సరిగా లేవంటూ అసహనం వ్యక్తం చేశారు. తనకు ఇచ్చిన కుర్చీని చూపిస్తూ.. ‘దీనిపై అంతా దుమ్మే. ఇందులో కూర్చుంటే నేను పడక్కే పరిమితమవుతా..’ అని అన్నారు. ‘ముందు కనీసం కూర్చునే చోటు చూపించండి. కావాలనుకుంటే తర్వాత ఉరి తీయండి’ అని వ్యాఖ్యానించారు. -
దళిత ప్రొఫెసర్ ఆనంద్ అరెస్టు అక్రమం
పుణే: దళిత ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబ్డే అరెస్ట్‌పై పుణే కోర్టు పోలీసులను తప్పుబట్టింది. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. గోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుంబ్డే శనివారం తెల్లవారు జామున కేరళ నుంచి విమానంలో ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకోగానే పుణే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2017లో ఎల్గార్ పరిషత్‌లో జరిగిన సమావేశానికి మావోయిస్టులు మద్దతు తెలిపారనీ, ఆ సమావేశంలో వివిధ నేతల రెచ్చగొట్టే ప్రసంగాల కారణంగానే కోరేగావ్–భీమా యుద్ధం స్మారకం వద్ద హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయనేది పోలీసుల ఆరోపణ. తెల్తుంబ్డే మావోయిస్టుల మధ్య సాగిన ఉత్తరప్రత్యుత్తరాల వివరాలు కూడా తమ వద్ద ఉన్నాయంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసు అక్రమమంటూ తెల్తుంబ్డే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు కొట్టివేసేందుకు నిరాకరించిన న్యాయస్థానం.. ఈ నెల 11వ తేదీ వరకు ఆయన్ను అరెస్టు చేయరాదంటూ పోలీసులను ఆదేశించింది. ఆలోగా న్యాయస్థానం నుంచి బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అయితే, పుణే పోలీసులు ఈలోగానే అరెస్టు చేయడం అక్రమమని అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జి కిశోర్ వదానే పేర్కొన్నారు. -
నీకిదే సరైన శిక్ష.. రోజంతా ఇక్కడే కూర్చో..!!
సాక్షి, ముంబై : పన్నెండేళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి ముంబై క్రిమినల్ కోర్టు అనూహ్యమైన శిక్ష విధించింది. పోక్సో చట్టం కింద రూ.30 వేల జరిమానాతోపాటు రోజంతా కోర్టు రూమ్‌లోనే కూర్చోవాలని ఆదేశించింది. క్రిమినల్ కేసుల్లో అతి తక్కువ శిక్షాకాలం కలిగిన కేసుల్లో ఇదొకటి కావడం విశేషం. వివరాలు.. ఎదురింట్లో ఉండే బాలికతో అరవింద్ కబ్‌దేవ్ కామత్ (29) అనే వ్యక్తి అశ్లీలంగా ప్రవర్తించాడు. నగ్నంగా నిల్చుని కిటీకీలోనుంచి ఆమెకు సైగలు చేశాడు. ఈ ఘటన 2015లో జరగగా గోవాదేవి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. విచారించిన ముంబై న్యాయస్థానం .. ‘కోర్టు ఉదయించేవరకు ఇక్కడే కూర్చో. వచ్చిపోయేవాళ్లంతా నీఘనకార్యం గురించి ముచ్చటించాలి’ అని వ్యాఖ్యానించింది. పోక్సో (లైంగిక నేరాల నుంచి చిన్నారుల రక్షణ చట్టం) లోని సెక్షన్ 12 కింద కామత్‌ను దోషిగా తేలుస్తూ.. ఒక రోజు ‘కోర్టు శిక్ష’,తో పాటు రూ. 30 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మూడు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. -
విలాసాలకు మారుపేరు
బ్యాంకులకు రూ.9,000 కోట్లకుపైగా ఎగ్గొట్టి్ట లండన్‌కు పారిపోయిన విజయ్ మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ముంబై కోర్టు ప్రకటించింది. దీంతో దేశ విదేశాల్లో ఉన్న మాల్యా ఆస్తుల్ని జప్తు చేసే అధికారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు లభించింది. రాజ ప్రాసాదాలను తలపించే భవంతులు, ప్రకృతి సౌందర్యానికి మారుపేరుగా నిలిచే ఎస్టేట్లు, సకల సౌకర్యాలున్న విమానాలు, విలాసవంతమైన నౌకలు, రేసు కార్లు, కోట్లాది రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్‌లు.. ఇలా చెప్పుకుంటూ పోతే మాల్యాకున్న ఆస్తులు కోకొల్లలు. మాల్యా స్థిర చరాస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో ఈడీ ఒక జాబితా రూపొందించింది. బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, భూములు, భవంతులను గుర్తించింది. ఈడీ జప్తు చేయడానికి రూపొందించిన జాబితా ఇదే.. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో మాల్యాకు కోట్లాది రూపాయల విలువ చేసే భూము లు, ఫామ్ హౌస్‌లు ఉన్నాయి. మొత్తం 3.09 లక్షల చదరపు అడుగుల భూమి ఉంది. కర్ణాటక: బెంగళూరులో మాల్స్, మరో నాలుగు గ్రామాల్లో భూములు ఉన్నాయి. వీటి విలువ రూ.1,937.5 కోట్లుగా ఉంది. బెంగళూరులో యూబీ సిటీ మాల్ విలువ రూ.713 కోట్ల వరకు ఉంటుంది. అలాగే రూ.962 కోట్లతో కింగ్‌ఫిషర్ టవర్ నిర్మాణంలో ఉంది. మహారాష్ట్ర: ముంబై, ఆలిబాగ్లో ఫామ్ హౌస్‌లున్నాయి. వాటి ఖరీదు రూ.28.02 కోట్లకుపైమాటే. తమిళనాడు: వెల్లూరు జిల్లాలో భూముల విలువ రూ. 1.14 కోట్ల వరకూ ఉంటుంది. ఇవే కాక వివిధ కంపెనీల్లో మాల్యాకు షేర్లు ఉన్నాయి. యూబీఎల్ కంపెనీలో ఆయనకున్న షేర్ల విలువరూ. 8,758 కోట్లు కాగా, యూఎస్‌ఎల్‌లో రూ.1,692 కోట్లు, యూబీహెచ్ఎల్ రూ.27 కోట్లు, మెక్‌డొవెల్ రూ.10 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు ఈడీ జాబితాలో తెలిపింది. ఈడీ జాబితాలో లేనివి మరికొన్ని.. ప్రపంచవ్యాప్తంగా మాల్యాకు ఎస్టేట్లు, భవనాలు మొత్తం రెండు డజన్లకుపైగా ఉన్నాయి. కాలిఫోర్నియాలో 11వేల చ.అ.విస్తీర్ణంలో ఎస్టేట్ ఉంది. దీని విలువ 12 లక్షల డాలర్లు. న్యూయార్క్‌లోని ప్రఖ్యాతిగాంచిన ట్రంప్ ప్లాజాలో పెంట్ హౌస్, దక్షిణాఫ్రికాలో జోహన్నెస్‌బర్గ్ సమీపంలో 12,000 హెక్టార్లలో విస్తరించిన మబూలా గేమ్లాడ్జ్, అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఎస్టేట్, ఫ్రాన్స్‌లోని రివిరా పట్టణానికి సమీపంలోని లగ్జరీ ఎస్టేట్, భారత్‌లోని కర్ణాటకలో కునిగల్ పట్టణం దగ్గర 400 ఎకరాల్లో విస్తరించిన గుర్రపు శాల(స్టడ్ ఫామ్), గోవాలో రాజభవంతిని తలపించే కింగ్‌ఫిషర్ విల్లా వంటి స్థిరాస్తులు మాల్యా సొంతం. సొంత పనులకు 4 విమానాలు కింగ్‌ఫిషర్ వంటి విమానయాన సంస్థను నడిపించిన ప్రముఖ వ్యక్తికి తనకంటూ సొంతంగా విమానం ఉండటం ఏమంత పెద్ద విషయం కాదు. మాల్యా ఎక్కడికి వెళ్లాలన్నా సరే విమానంలోనే వెళ్లేవారు. మొత్తం నాలుగు విమానాలను ఆయన వినియోగించేవారు. ప్రపంచంలోని తనకున్న ఎస్టేట్లలో ఎక్కడికి వెళ్లాలన్నా బోయింగ్ 727 రకం విమానాన్ని వాడేవారు. మాల్యా దగ్గరున్న ఎయిర్‌బస్ ఏ319 విమానం లండన్ నుంచి అమెరికాకు ఒకే ఒక్క హాల్ట్‌తో ప్రయాణించగలదు. ఇక హాకర్ హెచ్ఎస్125, గల్ఫ్ స్ట్రీమ్ త్రీ అనే మరో రెండు విమానాలు కూడా ఎప్పడూ మాల్యా కోసం సిద్ధంగా ఉండేవి. తన అభిరుచికి తగ్గట్టుగా ఆ విమానంలో ఆయన సకల అధునాతన సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇవి కాకుండా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ కార్లు విజయ్ మాల్యా వద్ద చాలా ఉన్నాయి. బెంగళూరులోని యూబీ సిటీ మాల్ -
విజయ్ మాల్యా.. పరారైన నేరగాడే
ముంబై: భారత బ్యాంకులకు రూ.9,000 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టి విదేశాలకు చెక్కేసిన వ్యాపారవేత్త విజయ్‌మాల్యాకు మరోషాక్ తగిలింది. మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడి(ఎఫ్ఈవో)గా గుర్తిస్తూ ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. తాజా ఆదేశాల నేపథ్యంలో పరారీలో ఉన్న రుణఎగవేతదారుల చట్టం–2018 కింద దేశ, విదేశాల్లోని మాల్యా ఆస్తులన్నింటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం వీలవుతుంది. ముంబై న్యాయస్థానం ఆదేశాలతో ఎఫ్‌ఈవోగా గుర్తింపు పొందిన తొలి వ్యాపారవేత్తగా మాల్యా నిలిచారు. ఈ కేసు విచారణ సందర్భంగా ఈడీ న్యాయవాది డి.ఎన్.సింగ్ వాదిస్తూ.. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్న మాల్యాను భారత్‌కు రప్పించేందుకు అన్నిరకాలుగా ప్రయత్నించామని తెలిపారు. అక్కడి న్యాయస్థానం సైతం మాల్యాను భారత్‌కు అప్పగించాలని తీర్పు ఇచ్చిందన్నారు. కానీ విజయ్‌మాల్యా మాత్రం భారత్‌కు రావడం ఇష్టపడటం లేదనీ, ఈ తీర్పును పైకోర్టులో సవాలు చేసేందుకు సిద్ధమవుతున్నారని వెల్లడించారు. అయితే ఈ వాదనల్ని మాల్యా లాయర్లు ఖండించారు. చట్టప్రకారం మాల్యా లండన్ కోర్టు ముందు లొంగిపోయారనీ, ఆతర్వాత బెయిల్ పొందారని కోర్టుకు చెప్పారు. ఫోర్స్ ఇండియా జట్టు డైరెక్టర్ హోదాలో వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ సమావేశంలో పాల్గొనేందుకు బ్రిటన్ వెళ్లారని, ఈడీ చెబుతున్నట్లు మాల్యా రహస్యంగా వెళ్లలేదని తెలిపారు. స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరణ ఇరుపక్షాల వాదనలు విన్న అక్రమ నగదు చెలామణి నిరోధక(పీఎంఎల్ఏ) కోర్టు జడ్జి ఎం.ఎస్.అజ్మీ స్పందిస్తూ.. ‘ఎఫ్ఈవో చట్టంలోని సెక్షన్ 12(ఐ) కింద ఈడీ చేసిన దరఖాస్తును పాక్షికంగా మన్నిస్తున్నాం. విజయ్‌మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటిస్తున్నాం. ఆయన ఆస్తుల జప్తు ఫిబ్రవరి 5 నుంచి మొదలవుతుంది’ అని ఉత్తర్వులు జారీచేశారు. వెంటనే మాల్యా తరఫు న్యాయవాదులు స్పందిస్తూ.. కోర్టు తీర్పు పూర్తి కాపీని అందుకునేందుకు, ఎగువ కోర్టులో అప్పీలుకు వీలుగా ఈ ఆదేశాలపై 4 వారాల స్టే ఇవ్వాలన్నారు. దీంతో ఎఫ్ఈవో చట్టం కింద పనిచేస్తున్న కోర్టు తన ఉత్తర్వులపై తానే స్టే ఇచ్చుకోలేదని స్పష్టం చేశారు. రూ.100 కోట్లు, అంతకుమించి మోసానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన వ్యక్తులు అరెస్ట్ వారెంట్ జారీ అయినప్పటికీ స్వదేశానికి వచ్చేందుకు మొగ్గుచూపకపోతే ఎఫ్‌ఈవోఏ చట్టం కింద వారిని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటిస్తారు. మా చొరవ వల్లే..: బీజేపీ ఎన్డీయే ప్రభుత్వం చొరవ కారణంగానే ముంబైలోని కోర్టు మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ప్రకటించిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా తెలిపారు. మాల్యా లాంటి రుణఎగవేతదారులను అరికట్టేందుకు, చట్టం ముందు నిలబెట్టేందుకే ఎన్డీయే ప్రభుత్వం పరారీలో ఉన్న రుణఎగవేతదారుల చట్టం(ఎఫ్‌ఈవోఏ)–2018 తీసుకొచ్చిందని వెల్లడించారు. అన్నింటికీ బీజేపీ గొప్పలు: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ ప్రతీ విషయంలో క్రెడిట్ తీసుకునేందుకు బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. పారిపోయే ముందు మాల్యా కేంద్ర మంత్రి జైట్లీని కలిసి అనుమతి తీసుకున్నారంది. ‘తమ వల్లే మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా కోర్టు ప్రకటించిందని బీజేపీ నేతలు భావిస్తే అలాగే కానివ్వండి. మంగళ్యాన్, పోఖ్రాన్–1 అణుపరీక్షలు.. ఇలా అన్ని విషయాల్లో క్రెడిట్ అంతా తమదేనని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. తామొచ్చాకే అన్నీ జరిగాయని వాళ్లు భావిస్తున్నారు. ఈ లెక్కన 2019, మే 26న భారత్ తన ఐదో బర్త్‌డే చేసుకోవాలి’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించింది. వినోదాల కోసం రెండు నౌకలు మాల్యా అంటేనే విందు వినోదాలకు పెట్టింది పేరు. తరచూ భారీ పార్టీలు ఇస్తూ ఉంటారు. దీని కోసం ఆయన ఏకంగా రెండు నౌకలనే కొనుగోలు చేశారు. హెలికాప్టర్లు కూడా దిగడానికి వీలుండే ఈ నౌకల్లో రెండు మెర్సెడెస్ కార్లను కూడా పార్క్ చేసుకునే సదుపాయం ఉంది. ఇక వాటిల్లో ఉండే సౌకర్యాలు ఒక్క మాటలో చెప్పలేం. బార్లు, జిమ్, వైద్యశాల, బ్యూటీ పార్లర్, సమావేశ మందిరాలు అన్నీ అందులోనే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పార్టీలను మాల్యా ఈ నౌకల్లోనే ఇచ్చారు. డచ్ షిప్‌యార్డ్‌కు చెందిన ఒక నౌకను మాల్యా 9.3 కోట్ల డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశారు. ప్రపంచ ప్రసిద్ధ సినీనటులు సర్ రిచర్డ్ బర్టన్, ఎలిజబెత్ టేలర్ వంటివారు వినియోగించిన క్లజిమా అనే మరో నౌక కూడా మాల్యాకు ఉంది. 1995లో సుమారు కోటి డాలర్లు పెట్టి దీన్ని ఆయన కొనుగోలు చేశారు. ఈ రెండు నౌకల్లో మాల్యా ఇచ్చే పార్టీలకు వీవీఐపీలు సైతం క్యూ కట్టేవారు. -
విజయ్ మాల్యాకు గట్టి షాక్..!
-
విజయ్ మాల్యాకు గట్టి షాక్..!
ముంబై: తొమ్మిది వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను ఎగవేసి.. లండన్‌లో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విజయ్ మాల్యాను పరారైన ఆర్థిక నేరస్థుడిగా ప్రకటింటిస్తూ.. ముంబై కోర్టు శనివారం కీలక తీర్పు వెలువరించింది. మాల్యా రుణాల ఎగవేతపై విచారణ చేపట్టిన మనీలాండరింగ్ నిరోధక చట్టం కోర్టు.. పరారైన ఆర్థిక నేరస్థుల చట్టం-2018లోని సెక్షన్ 2ఎఫ్ ప్రకారం అతడిని ఆర్థిక నేరస్థుడిగా గుర్తిస్తూ తీర్పునిచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పరారైన ఆర్థిక నేరగాళ్ల చట్టం కింద.. గుర్తించబడిన మొదటి నిందితుడిగా మల్యా నిలిచారు. మాల్యా ఆస్తుల జప్తుపై ఫిబ్రవరి 5న కోర్టు వాదనలు విననుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విజ్ఞప్తి మేరకు ముంబై కోర్టు మాల్యా రుణాల ఎగవేతపై విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి రుణాలు తీసుకుని, కోర్టు విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని తిరిగే వారిని కోర్టు ఆర్థిక నేరస్తులుగా గుర్తిస్తుంది. భారత్‌లోని వివిధ బ్యాంకుల నుంచి మాల్యా 9వేలకోట్ల రుణాలు తీసుకుని విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. కాగా కొత్త చట్టం అమలులోకి వచ్చిన తరువాత రుణాల ఎగవేతదారుగా ప్రకటించబడిన మొదటి వ్యక్తి మాల్యానే కావడం విశేషం. -
మాల్యాకు షాక్: తొలి చార్జ్‌షీటు
ముంబై: సుదీర్ఘం కాలంగా వార్తల్లో నిలుస్తున్న మాల్యాగేట్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం లండన్ కోర్టులో ఊరట లభించిన లిక్కర్ టైకూన్ విజయ్ మాల్యాకు ఈ సారి గట్టి షాకే తగిలింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్( ఈడీ) ముంబై పీఎంఎల్ఏ కోర్టులో బుధవారం మొట్టమొదటి చార్జ్‌షీట్ ఫైల్ చేసింది. ఉద్దేశ పూర్వక భారీ రుణ ఎగవేత దారుడిగా తేలిన మాల్యాపై ఎట్టకేలకు అధికారంగా ఐడీబీఐ రూ.900 కోట్ల కేసులో చార్జ్‌షీటను నమోదు చేసింది. బ్యాంకులకు వేలకోట్ల రుణాలను ఎగవేసి లండన్‌కు పారిపోయిన మాల్యాను దేశానికి రప్పించే క్రమంలో ఎన్డీఏ సర్కారు మరింత వేగంగా కదులుతోంది. ఈ క్రమంలో సుదీర్ఘ కాలం విరామం తరువాత ఈడీ మాల్యాపై చార్జ్ షీట్ నమోదు చేయడం విశేషం. లండన్‌లోని వెస్ట్ మినిష్టర్ కోర్టులో భారీ ఊరట లభించింది. మాల్యాని భారత్‌కు అప్పగించాలని భారత ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్‌పై ప్రారంభమైన విచారణ కాసేపటికే జులై 6వ తేదీకి వాయిదా పడింది. అంతేకాదు మాల్యా బెయిల్‌ని డిసెంబర్ 4వ తేదీ వరకు పొడిగించింది. మరోవైపు డిసెంబర్ వరకు బెయిల్ గడువు పొడిగింపుపై హర్షం వ్యక్తం చేసిన విజయ్ మాల్యా తానెలాంటి తప్పు చేయలేదనీ, దీనికి తగిన ఆధారాలు తన వద్ద వున్నాయని పేర్కొన్న సంగతి తెలిసిందే. -
లిక్కర్ కింగ్ మాల్యాకు మరో షాక్
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మరో షాక్ ఎదురైంది. ఆయనపై ముంబై కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి, మనీ లాండరింగ్‌కు పాల్పడిన కేసులో కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ వారెంట్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) యూకేకు బదలాయించనుంది. బ్యాంకులకు దాదాపు 9వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి, ప్రస్తుతం యూకేలో తలదాచుకుంటున్న మాల్యాను భారత్‌కు పంపించాలని కోరుతూ.. నేరగాళ్ల అప్పగింత ఒప్పందం కింద ఈ వారెంట్‌ను సీబీఐ యూకేకు పంపనుంది. ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టులో మాల్యా ఈ ఏడాది జూలైలో హాజరుకావాల్సి ఉంది. కానీ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి, మాల్యా కోర్టు ముందు హాజరు కాలేదు. మార్చిలో దేశం విడిచిపారిపోయిన మాల్యా ప్రస్తుతం యూకేలో తలదాచుకుంటున్నారు. ఇప్పటికే ఆయనపై పలు చెక్ బౌన్స్ కేసులు నమోదయ్యాయి. చెక్ బౌన్స్ కేసులో ఓ సారి ఇప్పటికే ముంబై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీచేసింది. మరోసారి మాల్యాకు ముంబై స్పెషల్ కోర్టు షాకిచ్చింది. -
అసూయతో ఆమెపై యాసిడ్ పోసి చంపేశాడు
ముంబై: ఢిల్లీకి చెందిన నర్సు ప్రీతి రతిపై యాసిడ్ దాడి, హత్య కేసులో నిందితుడిగా ఉన్న అంకుర్ పన్వర్ను ముంబై సెషన్స్ కోర్టు దోషిగా ప్రకటించింది. ప్రీతి తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిందనే అసూయతో అంకుర్ ఆమెపై యాసిడ్ పోసి, హత్య చేశాడని కోర్టు మంగళవారం నిర్ధారించింది. కోర్టు బుధవారం అతనికి శిక్షను ఖరారు చేయనుంది. న్యాయం కోసం మూడేళ్లుగా ఎదురు చూస్తున్నామని, తమకు న్యాయం జరిగిందని, దోషికి మరణశిక్ష వేయాలని కోరుతున్నట్టు ప్రీతి తండ్రి అమర్ సింగ్ చెప్పాడు. కాగా తన కొడుకును అన్యాయంగా ఈ కేసులో ఇరికించారని, సీబీఐ దర్యాప్తు చేయించాలని అంకుర్ తల్లి కైలాష్ డిమాండ్ చేసింది. 2013లో ప్రీతికి ముంబైలోని కొలబా నావల్ హాస్పిటల్లో (ఐఎన్ఎస్ అశ్విని) స్టాఫ్ నర్సుగా ఉద్యోగం వచ్చింది. ప్రీతి ఉద్యోగంలో చేరేందుకు తన కుటుంబ సభ్యులతో కలసి మే 2న గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ నుంచి ముంబై వచ్చింది. అదే రైలులో ఆమెకు తెలియకుండా అంకుర్ దొంగచాటుగా (టికెట్ లేకుండా) ముంబై వచ్చాడు. బాంద్రా టర్మినెస్లో ప్రీతి దిగిన వెంటనే అంకుర్ ఆమెపై యాసిడ్ దాడిచేసి పారిపోయాడు. ఈ ఘటనలో ప్రీతి ఊపరితిత్తులు బాగా దెబ్బతిన్నాయి. ముంబై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జూన్ 1న మరణించింది. ప్రీతికి ముంబైలో ఉద్యోగం రావడంతో ఆమె ఢిల్లీ నుంచి ముంబైకు వెళ్లడం అంకుర్ ఇష్టంలేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రీతిని పెళ్లిచేసుకోవాలని అతను ఆశపడగా, ఆమె తన కెరీర్ దృష్ట్యా నిరాకరించింది. ప్రీతి ముంబైకు వెళ్లకుండా ఆపేందుకు అంకుర్ ప్రయత్నించగా, అతని అభ్యంతరాలను పట్టించుకోకుండా ఆమె ముంబైకి బయల్దేరింది. ప్రీతిపై యాసిడ్ దాడి చేయాలని అంకుర్ ముందస్తుగా పథకం వేసుకున్నాడు. ఏప్రిల్ 2న అతను యాసిడ్ కొన్నాడని దర్యాప్తులో తేలింది. ముంబైలో ప్రీతిపై దాడిచేసిన తర్వాత అదే రైల్లో ఢిల్లీకి తిరిగివెళ్లాడు. -
మాలేగావ్ కేసులో ఎనిమిదిమందికి విముక్తి
న్యూఢిల్లీ : మాలేగావ్ పేలుళ్ల కేసులో ఎనిమిదిమంది నిందితులను ముంబై ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా తేల్చింది. వారిని తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. 2008 సెప్టెంబర్ 8న మాలేగావ్‌లో ఒక ప్రార్థనా స్థలంలో జరిగిన బాంబు పేలుడులో 37 మంది మృతి చెందగా సుమారు 160 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉగ్రవాద వ్యతిరేక విభాగం (ఏటీఎస్) జరిపిన దర్యాప్తు నేపథ్యం లో తొమ్మిది మంది ముస్లిం యువకులను అనుమానితులుగా అరెస్టు చేశారు. వీరిలో ఒకరు మృతి చెందారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వీళ్లంతా గత అయిదేళ్లుగా జైలు జీవితం గడుపుతున్నారు. -
ఇండియా హిందువులదేనా?
నాగ్‌పూర్: నాగ్ పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌పై బొంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ భారతదేశం కేవలం హిందువుల కోసమే అని మీ ఉద్దేశమా అని ప్రశ్నించింది. నాగ్ పూర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ అధికారంలో ఉంది. ఇక్కడి అధికారులు ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇదే కార్యక్రమంతో ముడిపెడుతూ ఓ హనుమాన్ ఆలయం ట్రస్టు ద్వారా హనుమాన్ చాలీసా నిర్వహించాలని నిర్ణయించారు. దీనిపై కొందరు వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకు వెళ్లారు. దీంతో న్యాయమూర్తి కార్పొరేషన్ అధికారులను ప్రశ్నించారు. ఎందుకు కేవలం హనుమాన్ స్తోత్రాలను మాత్రమే అనుకుంటున్నారు? ఖురాన్, బైబిల్ వంటి ఇతర మతాల సాహిత్యాన్ని ఎందుకు ఉపయోగించకూడదని అనుకున్నారు? ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమానికి హనుమాన్ చాలీసాను స్మరించడానికి సంబంధం ఏమిటి? ఈ అవగాహన కార్యక్రమం కేవలం హిందువుల కోసమేనా? ఈ భారత దేశం హిందువులకోసమే అని మీ అభిప్రాయమా? అని ప్రశ్నించారు. ఏ మతంపైనా తమకు ప్రత్యేకమైన అభిమానం కోపం లేదని, ఈ రెండు కార్యక్రమాలు వేర్వేరుగా నిర్వహించాలని ఆదేశించారు. కనీసం వీటికి మధ్య గంట వ్యవధి ఉండాలని చెప్పారు. ప్రభుత్వ సంస్ధలు అనేవి ప్రజాసంబంధమైన అంశాలకోసం ఎక్కువగా పనిచేయాలని చెప్పారు. ఇందుకు అధికారులు కూడా అంగీకరించారు. -
ఇష్రత్ జహాన్ లష్కరే ఉగ్రవాది
వీడియో కాన్ఫరెన్స్ వాంగ్మూలంలో హెడ్లీ వెల్లడి * ఈ విషయాన్ని లఖ్వీయే చెప్పాడన్న డేవిడ్ * ‘బాబ్రీ’కి ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలోనే ఎన్కౌంటర్ ముంబై: 2008 ముంబై దాడుల కేసులో అప్రూవర్‌గా మారిన పాకిస్తానీ అమెరికన్, లష్కరే ఉగ్రవాది డేవిడ్ కోలెమన్ హెడ్లీని విచారిస్తున్న కొద్దీ ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2004లో గుజరాత్లో జరిగిన ఓ ఎన్కౌంటర్లో మృతిచెందిన 19 ఏళ్ల ఇష్రత్ జహాన్.. లష్కరే తోయిబా ఉగ్రవాదని గురువారం జరిగిన వీడియో లింక్ వాంగ్మూలంలో హెడ్లీ వెల్లడించాడు. ‘భారత్‌లో పోలీసులపై కాల్పులు జరిపే వ్యూహంతో.. లష్కరే ఉగ్రవాది ముజమ్మిల్ భట్ ప్రయత్నాలు చేస్తుండగానే ఓ మహిళా ఉగ్రవాది ఎన్కౌంటర్ అయిందని లష్కరే కమాండర్ జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ చెప్పారు’ అని హెడ్లీ పేర్కొన్నారు. ఆమె భారతీయురాలే అయినా.. లష్కరేలో క్రియాశీలకంగా పనిచేసినట్లు లఖ్వీ మాటలతో తెలిసిందన్నారు. బాబ్రీ మసీదు విధ్వంసానికి ప్రతీకారంగా అక్షర్ధామ్ మందిరంపై దాడికి లష్కరే ఉగ్రవాది అబూ కఫా ప్రయత్నించాడన్నారు. భారత్‌లో దాడులకు లష్కరే తోయిబా, ఐఎస్ఐ ఆర్థికంగా ఏవిధంగా తోడ్పడ్డాయనే విషయాన్ని హెడ్లీ కోర్టుకు వెల్లడించారు. కోర్టు బయట ఉజ్వల్ నికమ్ మీడియాతో మాట్లాడుతూ.. లష్కరేతోయిబాలో.. మిలటరీ, నేవీ, మహిళ, ఆర్థిక విభాగాలున్నాయని పేర్కొన్నారు. 2004లో ఏం జరిగింది? గుజరాత్‌లోని అహ్మదాబాద్ శివార్లలో 2004 జూన్ 15న ఇష్రత్ జహాన్‌తోపాటు నలుగురిని గుజరాత్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ కేసును విచారించిన సీబీఐ.. బూటకపు ఎన్కౌంటర్ అని, క్రైమ్ బ్రాంచ్, ఎస్ఐబీ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయని 2013లో విడుదల చేసిన చార్జిషీటులో పేర్కొంది. అప్పటి గుజరాత్ అదనపు డీజీపీ, డీఐజీ డీజీ వంజారాతో పాటు ఏడుగురు గుజరాత్ పోలీసు అధికారుల పేర్లను చార్జిషీటులో చేర్చింది. ఐబీ స్పెషల్ డెరైక్టర్ రాజిందర్ కుమార్‌తోపాటు మరో ముగ్గురు ఐబీ అధికారులను విచారించింది. అయితే ఈ కేసులో తనను ఇరికించాలని చూశారని.. అయినా వారి రాజకీయానికి పావుగా మారలేదని రాజిందర్ కుమార్ గురువారం తెలిపారు. ఎన్కౌంటర్లన్నీ రాజకీయ జోక్యం కారణంగానే బూటకంగా మారిపోతాయని డీజీ వంజారా అన్నారు. ఇది సాక్ష్యం కాదు: ఇష్రత్ లాయర్ అయితే.. హెడ్లీ వెల్లడించిన అంశాలను సాక్ష్యాలుగా పరిగణించలేమని ఇష్రత్ కుటుంబం తరపు న్యాయవాది వృందా గ్రోవర్ అన్నారు. నలుగురు పేర్లు చెబితే.. అందులోనుంచి ఒకరి పేరును హెడ్లీ వెల్లడించటం సాక్ష్యం కాదన్నారు. ఇష్రత్ కుటుంబ సభ్యులు కూడా హెడ్లీ ఆరోపణలను ఖండించారు. ఈ ఎన్కౌంటర్లో మరణించిన ప్రణేశ్ కుమార్ అలియాస్ జావెద్ షేక్ తండ్రి పిళ్లై కూడా.. హెడ్లీ వ్యాఖ్యలపై అనుమానం వ్యక్తం చేశారు. కాగా, ముంబై దాడుల కేసులో ముగ్గురు కీలక సాక్షులు కోర్టుకు హాజరు కాకపోవటంతో.. తదుపరి విచారణను పాక్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఫిబ్రవరి 17కు వాయిదా వేసింది. సోనియా క్షమాపణలు చెప్పాలి: బీజేపీ ప్రధాన మంత్రి మోదీపై కోపంతో.. ఇష్రత్ జహాన్ ఎన్‌కౌంటర్‌ను బూటకంగా చూపించేందుకు కాంగ్రెస్ నాయకత్వం తీవ్రంగా ప్రయత్నించిందని.. తాజాగా హెడ్లీ వాంగ్మూలంతో.. సోనియా, రాహుల్ వ్యాఖ్యలు తప్పని తేలిందని బీజేపీ విమర్శించింది. మోదీపై తప్పుడు ప్రచారం చేసినందుకు సోనియా, రాహుల్ గాంధీ జాతికి క్షమాపణలు చెప్పాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ డిమాండ్ చేశారు. హెడ్లీ వ్యాఖ్యలు నమ్మలేం: కాంగ్రెస్ ఇష్రత్ ఎన్‌కౌంటర్‌పై హెడ్లీ వాంగ్మూలంతో.. సోనియా, రాహుల్ క్షమాపణలు చెప్పాలన్న బీజేపీ డిమాండ్‌ను కాంగ్రెస్ ఖండించింది. హెడ్లీ సాక్షం ఆధారంగా ఇది బూటకపు ఎన్కౌంటర్ కాదని నిర్ధారించలేమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ తివారీ తెలిపారు. -
రక్షణ శాస్త్రవేత్తలపై దాడికి ప్లాన్!
భారతదేశంలో.. అందునా ముంబై నగరంలో ఉగ్రదాడులు చేయాలని లష్కరే తాయిబా 2007 సంవత్సరంలోనే లష్కరే తాయిబా నిర్ణయించిందని 26/11 దాడుల సూత్రధారి, ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ చెప్పాడు. ముంబై ఉగ్రదాడుల కేసులో అప్రూవర్‌గా మారిన హెడ్లీ.. వీడియోలింకు ద్వారా గుర్తుతెలియని ప్రదేశం నుంచి ముంబై ప్రత్యేక కోర్టు విచారణలో పాల్గొన్నాడు. అల్ కాయిదా గురించి తనకు తెలుసని, అది ఒక ఉగ్రవాద సంస్థ అని హెడ్లీ అంగీకరించాడు. అలాగే, లష్కరే తాయిబాకు జకీవుర్ రెహ్మాన్ ఆపరేషనల్ కమాండర్ అని కూడా అంగీకరించాడు. లష్కరే తాయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ అన్నీ యునైటెడ్ జీహాద్ కౌన్సిల్ కింద పనిచేస్తున్నాయని, ఇవన్నీ భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌లో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలేనని హెడ్లీ అంగీకరించాడు. 2007 నవంబర్ - డిసెంబర్ నెలల్లో పాకిస్థాన్‌లోని ముజఫరాబాద్‌లో ఓ సమావేశం జరిగిందని, దానికి సాజిద్ మీర్, అబు ఖఫా, తాను హాజరయ్యామని హెడ్లీ చెప్పాడు. ఆ సమావేశంలోనే ముంబైలోని తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్ వద్ద రెక్కీ చేయాల్సిందిగా తనకు బాధ్యతలు అప్పగించారన్నాడు. తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్లో కొంతమంది రక్షణ శాస్త్రవేత్తలు సమావేశం అవుతున్నారన్న సమాచారం అప్పటికే లష్కర్ వద్ద ఉందని, సరిగ్గా ఆ సమావేశం జరిగే సమయానికి దాడి చేయాలని వాళ్లు అనుకున్నారని హెడ్లీ చెప్పాడు. తాను తొలిసారి జకీవుర్ రెమ్మాన్ లఖ్వీని 2003లో ముజఫరాబాద్‌లో లష్కర్ ప్రధాన కార్యాలయంలో కలిశానని హెడ్లీ తెలిపాడు. కాగా, అదే సమయంలో లఖ్వీ ఫొటో చూపించగా.. అతడేనని గుర్తుపట్టాడు. -
భారత్ రావడానికే పేరు మార్చుకున్నా: హెడ్లీ
ముంబై మహానగరంలో జరిగిన 26/11 మారణహోమం వెనుక పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబా హస్తం ఉందన్న విషయం స్పష్టంగా తేలిపోయింది. తాను లష్కరే తాయిబాకు అసలైన అనుచరుడినని ముంబై పేలుళ్ల సూత్రధారి డేవిడ్ కాల్మన్ హెడ్లీ వెల్లడించాడు. కేవలం భారతదేశంలో ప్రవేశించడానికే తాను అమెరికన్లా పేరు మార్చుకున్నట్లు చెప్పాడు. తన అసలు పేరు దావూద్ గిలానీ అని.. ఆ పేరు ఉంటే రావడం కుదరదని పేరు మార్చుకున్నానని వీడియో లింకు ద్వారా హెడ్లీ సోమవారం ఉదయం ముంబైలోని ప్రత్యేక కోర్టు విచారణకు హాజరై.. ఈ వివరాలు వెల్లడించాడు. తన పేరు మార్చుకున్న తర్వాత ఆ సమాచారాన్ని లష్కరే తాయిబాకు చెందిన సాజిద్ మీర్‌కు చెప్పానన్నాడు. పేరు మార్చుకున్న కొన్ని వారాల తర్వాత పాకిస్థాన్ వెళ్లానని, భారతదేశంలో ప్రవేశించడానికి మాత్రమే పేరు మార్చానని చెప్పాడు. భారతదేశంలో ఏదైనా వ్యాపారం లేదా ఆఫీసు పెట్టాలని సాజిద్ మీర్ తనకు చెప్పాడని, అతడి అసలు ఉద్దేశం ఏంటో.. తాను తొలిసారి భారతదేశం సందర్శించానికి కొద్ది ముందే చెప్పాడని హెడ్లీ తెలిపాడు. కొత్త పేరుతో తనకు పాస్‌పోర్టు వచ్చిన తర్వాత భారత దేశానికి 8 సార్లు వచ్చానని, అందులో 7 సార్లు ముంబై నగరంలోనే తిరిగానని అతడు అన్నాడు. ఒక్కసారి మాత్రమే తాను దుబాయ్ నుంచి భారత్ వెళ్లానని, మిగిలిన 7 సార్లూ నేరుగా పాకిస్థాన్ నుంచే వెళ్లానని వివరించాడు. తన వీసా దరఖాస్తులో తాను పుట్టిన ఊరు, తేదీ, తల్లి జాతీయత, తన పాస్‌పోర్టు నంబర్ తప్ప అన్నీ తప్పులేనని తెలిపాడు. 2015 డిసెంబర్లో హెడ్లీ ఈ కేసులో అప్రూవర్‌గా మారిపోయాడు. పేలుళ్లకు మొత్తం కుట్ర పన్నిందంతా లష్కరే తాయిబాయేనని, దానికి పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ అనుమతి కూడా ఉందని హెడ్లీ అంటున్నాడు. ముంబైలో రెక్కీ చేయడానికి కూడా తనకు ఆర్థిక సహకారం అందించింది ఐఎస్ఐ సంస్థేనన్నాడు. తాను ఢిల్లీలో ఉప రాష్ట్రపతి ఇల్లు, ఇండియా గేట్, సీబీఐ కార్యాలయాల వద్ద కూడా రెక్కీ చేశానన్నాడు. కాగా.. డేవిడ్ హెడ్లీ తరఫున ప్రముఖ న్యాయవాది మహేష్ జెఠ్మలానీ వాదిస్తున్నారు. -
మహిళను వేధించినందుకు రోడ్లూడ్చే శిక్ష
ఆదివారం ఉదయం మహరాష్ట్ర లోని థానేలో నలుగురు యువకులు చీపుర్లు పట్టుకుని రోడ్లు ఊడ్చారు. అలా ఒకటి కాదు... రెండు కాదు.. ఏకంగా ఏడు గంటల పాటు..చమటోడ్చి థానే రోడ్లను శుభ్రం చేశారు. వీళ్లంతా స్వచ్ఛ భారత్ లో భాగంగా ఇలా చేశారనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఓ మహిళను.. వేధించినందుకు పడిన శిక్ష ఇది. గత ఏడాది దసరా ఉత్సవాల సందర్భంగా స్థానికంగా నివాసం ఉంటున్న అంకిత్ జాదవ్, సుహాస్ ఠాగూర్, మిలింద్ మోర్, అమిత్ లు పూటుగా తాగారు. అటుగా వెళుతున్న ఓ యువతిపై లైగిక వేధింపులకు దిగారు. ఇది గమనించిన ఓ యువకుడు వీరిని అడ్డుకోడానికి ప్రయత్నించగా.. ఇనప రాడ్ తీసుకుని అతడిని చితక బాదారు. అడ్డుకోడానికి ప్రయత్నించిన వారందరినీ వేధించారు. దీంతో వీరిపై కేసు నమోదైంది. అయితే..నిందితులు.. బాధితులతో కోర్టు బయట కేసు సెటిల్ చేసుకున్నారు. ఈవిషయాన్ని బాధితులు కోర్టులో ధృవ పరిచారు. దీంతో తమ కేసును క్వాష్ చేయాలంటూ నిందితులు ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు పరిశీలించిన కోర్టు .. నిందితులంతా.. ఆరు నెలల పాటు.. పోలీసుల పర్యవేక్షణలో సమాజ సేవ చేయాల్సిందిగా ఆదేసించింది. అంతే కాదు.. టాటా మెమోరియల్ ఆస్పత్రికి ఒక్కొక్కరూ.. రూ.5000 డొనేషన్ రూపంలో చెల్లించాలని పేర్కొంది. తమకు పడ్డ శిక్షపై స్పందించిన నిందితుడు ఠాగూర్ ' మేం తప్పు చేశాం.మళ్లీ ఆ తప్పు చేయం. అంతే కాదు.. మాలాగా తప్పులు చేసేవాళ్లకు మా శిక్ష ఒక గుణ పాఠం కావాలి. మమ్మల్సి చూసి.. ఇలాంటి తప్పు ఎవరూ చేయకుండా భయపడాలి' అని తెలిపాడు. మరో నిందితుడు జాదవ్ స్పందిస్తూ..'మేంచేసి పనికి చింతిస్తున్నాం..ఈ విధంగా దేశానికి సేవ చేసే అవకాశం రావడం సంతోషమే కాని.. మా చర్యలపట్ల సిగ్గుపడుతున్నామని అన్నాడు. -
డేవిడ్ హాడ్లీకిముంబై కోర్టు సమన్లు
-
డేవిడ్ హాడ్లీకిముంబై కోర్టు సమన్లు
ముంబై: 26/11 దాడి కేసులో పాకిస్థాన్-అమెరికన్ లష్కరే తోయిబా తీవ్రవాది డేవిడ్ హాడ్లీను నిందితుడిగా చేర్చేందుకు ప్రత్యేక టాడా కోర్టు అంగీకరించింది. అతడికి సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 10న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రశ్నించేందుకు పోలీసులకు అనుమతినిచ్చింది. ప్రస్తుతం అతడు అమెరికా జైలులో ఉన్నాడు. ఈ కేసులో హాడ్లీ నిందితుడిగా చేర్చాలని ముంబై పోలీసులు అక్టోబర్ 8న పిటిషన్ దాఖలు చేశారు. అమెరికా జైలులో ఉన్నప్పటికీ హాడ్లీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించేందుకు ఎటువంటి అడ్డంకులు ఎదురుకాబోవని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఉజ్వల్ నికమ్ తెలిపారు. అతడికి అమెరికా కోర్టు 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. -
ఉరిశిక్షే సరియైనది ..
-
ఇంద్రాణిని విచారించనున్న సీబీఐ
ముంబై: సంచలం సృష్టించిన షీనాబోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా సహా ఇతర నిందితులను సీబీఐ విచారించనుంది. బుధవారం ముంబై కోర్టు ఈ మేరకు సీబీఐకి అనుమతి మంజూరు చేసింది. ఈ కేసులో ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్ నిందితులుగా ఉన్నారు. నిందితులు ముగ్గురు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. వీరి ముగ్గురికి ఈ నెల 19వరకు ముంబై కోర్టు రిమాండ్‌కు ఆదేశించింది. -
అనూహ్య హత్య కేసు విచారణ వాయిదా
సాక్షి ముంబై: సంచలనం సృష్టించిన విజయవాడ యువతి ఎస్తేర్ అనూహ్య హత్య కేసుపై శనివారం ప్రభుత్వ న్యాయవాది తుది వాదనలు వినిపించారు. అనంతరం సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వి.వి.జోషి విచారణను ఈ నెల 8కి వాయిదా వేశారు. 2014 జనవరి 5న లోకమాన్య తిలక్ (కుర్లా) టర్మినల్ నుంచి అదృశ్యమైన ఎస్తేర్ అనూహ్య 2014 జనవరి 16న కంజూర్‌మార్గ్-భాండూప్ మధ్యలో శవమై తేలిన సంగతి తెలిసిందే. కేసు విషయమై ఇప్పటి వరకు ప్రభుత్వ న్యాయవాది 39 మంది సాక్షుల్ని ప్రవేశపెట్టగా డిఫెన్స్ న్యాయవాది ఐదుగురు సాక్షుల్ని ప్రవేశపెట్టారు. శనివారం వాదనలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ న్యాయవాది రాజన్ ఠాక్రే తన వాదనను వినిపిస్తూ నిందితుడు చంద్రబాన్ సానప్ అలియాస్ లౌక్యాను దోషిగా ప్రకటించేందుకు అన్ని రుజువులు ప్రవేశపెట్టామన్నారు. రైల్వేస్టేషన్లో అనూహ్యతో కలసి బయటికి నడుస్తున్న సీసీటీవీ ఫుటేజ్ తోపాటు ఆమెకు సంబంధించిన వస్తువులను నిందితుని వద్ద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం న్యాయమూర్తి వీవీ జోషి విచారణ ఈ నెల 8కి వాయిదా వేశారు. తమ వాదనలను ఈనెల 8న వినిపించనున్నట్లు చెప్పారు. నిందితుడు చంద్రాబాన్‌ను 2014 మార్చి 2న అదుపులోకి తీసుకున్న పోలీసులు 85 రోజుల్లో చార్జీషీట్ దాఖలు చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలి: ముంబై వైఎస్సార్సీపీ నేత మాదిరెడ్డి కొండారెడ్డి ఇలాంటి సంఘటనలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించాలి. ఈ విషయంపై గతంలో కూడా దివంగత గోపీనాథ్ ముండేతో భేటీ అయ్యాం. న్యాయస్థానంపై నమ్మకం ఉంది. దోషికి కఠిన శిక్ష విధిస్తారని విశ్వసిస్తున్నా. -
'ఆమె రాకుంటే అరెస్ట్ చేసి తీసుకొస్తారు'
ముంబై: వివాదస్పద మహిళా ఆధ్మాత్మిక గురువు రాధే మాకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు ముంబై కోర్టు నిరాకరించింది. ఈనెల 14న కండ్లివి పోలీసు స్టేషన్ లో హాజరు కావాలని అంతకుముందు న్యాయస్థానం ఆదేశించింది. ముందస్తు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో శుక్రవారం ఆమె తప్పనిసరిగా పోలీసు స్టేషన్ లో హాజరుకావాల్సి ఉంటుందని ఫిర్యాది తరపు న్యాయవాది కేఆర్ మెహతా తెలిపారు. ఒకవేళ ఆమె రాకుంటే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చే అవకాశముందన్నారు. రాధే మా పరారీలో ఉన్నారన్నదే తమ అభ్యంతరమని, పోలీసు స్టేషన్ కు రాకుండా ఉండేందుకు ఆమె ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రశ్నించారు. తన నుంచి కట్నం డిమాండ్ చేయాల్సిందిగా రాధే మా తన అత్తమామలపై ఒత్తిడి తెచ్చినట్టు 32 ఏళ్ల యువతి ఫిర్యాదు చేయడంతో ఆమెకు కోర్టు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
దంపతుల అరెస్టుకు రంగం సిద్ధం?
న్యూఢిల్లీ: నిధుల దుర్వినియోగం కేసుకు సంబంధించి సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, ఆమె భర్త జావేద్ ఆనంద్‌లను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. వీరి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ముంబై సీబీఐ కోర్టు శుక్రవారం తిరస్కరించింది. దీంతో ఆ దంపతులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. మరోవైపు దీనిపై ముంబై హైకోర్టులో సవాల్ చేసేందుకు సెతల్వాద్ తరపు న్యాయవాదులు సిద్ధమవుతున్నారు. 2002 గుజరాత్ అల్లర్లలో నాశనమైన గుల్బర్గ్ సొసైటీలో బాధితుల స్మారకార్ధం మ్యూజియం ఏర్పాటుచేస్తామంటూ సేకరించిన నిధులను సొంతానికి వాడుకున్నారన్న కేసులో సెతల్వాద్ దంపతులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అధికారుల అనుమతి లేకుండా ఫోర్డ్ ఫౌండేషన్ నుంచి విదేశీ నిధులను స్వీకరించారని ఆరోపిస్తూ గత వారం సీబీఐ సెతల్వాద్ ఇంటిపై దాడులు చేసింది. ఈ నిధులను ఆమె తన మద్యం కోసం, జుట్టు సింగారానికి వాడుకున్నారని ఆరోపించింది. అయితే సెతల్వాద్ దంపతులను బీజేపీ ప్రభుత్వం కావాలనే వేధిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రధాని నరేంద్రమోదీ కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారన్న విమర్శలు చెలరేగాయి. ఈ క్రమంలోవారి బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. -
రాహుల్ గాంధీకి సమన్లు
ముంబై: మహారాష్ట్రలోని భివాండీ కోర్టు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సోమవారం సమన్లు జారీ చేసింది. ఆర్ఎస్ఎస్ నేత రాజేష్ కుంటే దాఖలు చేసిన పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ కోర్టుకు గైర్హాజరు కావడంతో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగత కారణాల రీత్యా కోర్టు హాజరు కాలేకపోతున్నారంటూ రాహుల్ న్యాయవాది పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. మే 8 న కోర్టు కు హాజరుకావాలని ఆదేశించింది.గత లోకసభ ఎన్నికల ప్రచారంలో ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ ముంబై హైకోర్టులో రాహుల్ గాంధీపై డిఫమేషన్ కేసు దాఖలైన సంగతి తెలిసిందే. -
అక్బరుద్దీన్‌కు సమన్లు జారీ చేసిన ముంబై కోర్టు
ముంబై: విద్వేషపూరిత ప్రసంగంతో సంబంధముందనే ఆరోపణలతో ఎంఐఎం నేత, తెలంగాణ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి కుర్లా సబర్బన్ మెజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. సమన్లను ఆయనకు అందించాలని కుర్లా పోలీసులను ఆదేశించింది. గతంలో ఇచ్చిన సమన్లు అందిచడంలో హైదరాబాద్ పోలీసులు విఫలమయ్యారని పిటిషనర్ గుల్హమ్ హుస్సేన్ ఖాన్ తెలపడంతో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. 2012లో మత సామరస్యాన్ని బలహీనపర్చేలా అక్బరుద్దీన్ ప్రసంగించారని 2013లో కేసు వేశారు. ఈ ప్రసంగం ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. మహారాష్ట్ర పోలీసులు, హోం మంత్రిత్వ శాఖ తన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవడానికి నిరాకరించినట్లు హుస్సేన్ కోర్టుకు నివేదించారు. -
అనూహ్య హత్యకేసు విచారణ 13కు వాయిదా
విజయవాడ: ముంబైలో హత్యకు గురైన తెలుగు యువతి సింగవరపు ఎస్తేర్ అనూహ్య హత్యకేసు విచారణను ముంబై కోర్టు ఆగస్టు 13కు వాయిదా వేసింది. 13న తమ ఎదుట హాజరుకావాలని అనూహ్య తండ్రిని కోర్టు ఆదేశించింది. జనవరి 5న కుర్లాలో అదృశ్యమైన అనూహ్య, కంజూర్‌మార్గ్-భాండూప్‌లో శవమై తేలిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడైన చంద్రబాన్ సానప్ అలియాస్ చౌక్యా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారిన అనూహ్య కేసును సవాల్‌గా తీసుకున్న ముంబై పోలీసులు లభించిన ఆధారాలకు అనుగుణంగా 542 పేజీల చార్జిషీట్‌ను ఇప్పటికే దాఖలు చేశారు. -
సల్మాన్ ఖాన్ మందు కొట్టాడో లేదో గుర్తులేదు...
ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మందు కొట్టి ఉన్నాడో లేదో తనకు తెలియదని హిట్ రన్ కేసులో బార్ మేనేజర్ కోర్టులో సాక్ష్యం చెప్పారు. ముంబై కోర్టులో సోమవారం జరిగిన విచారణలో సల్మాన్ ఖాన్ ను బార్ మేనేజర్ గుర్తించాడు. 2002లో జరిగిన కారు ప్రమాదానికి ముందు సల్మాన్ తన స్నేహితులతో బార్ కు వచ్చారని అన్నారు. అయితే స్నేహితులతో కలిసి మద్యం సేవించారో లేదో తనకు సరిగా గుర్తులేదని కోర్టుకు తెలిపారు. 2002 సెప్టెంబర్ 28న జరిగిన ప్రమాదానికి ముందు సల్మాన్ ఖాన్ మద్యం సేవించారా అనే కోణంలో ప్రాసిక్యూషన్ విచారణ చేపట్టింది. బాంద్రా సబర్బన్ లో తప్పతాగి కారు నడపడంతో ఒకరు మరణించగా, మరో నలుగురు గాయపడిన సంఘటనలో సల్మాన్ ఖాన్ పై హిట్ రన్ కేసు నమోదైంది. Follow @sakshinews -
ముంబై ఫోటో జర్నలిస్ట్‌పై అత్యాచారం కేసులో కీలక తీర్పు
-
షారుఖ్‌పై ముంబై కోర్టులో ఫిర్యాదు
ముంబై: సరోగసీ (అద్దె గర్భం) ద్వారా ఇటీవల బిడ్డను పొందే క్రమంలో బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్ దంపతులు గర్భస్త శిశువుకు లింగనిర్ధారణ పరీక్షలు జరిపించారని... అందువల్ల వారిపై చర్యలు తీసుకోవాలంటూ ముంబైలోని కోర్టులో ఫిర్యాదు నమోదైంది. లింగ నిర్ధారణ ఎంపిక నిషేధ చట్టం నిబంధనలను షారుఖ్ దంపతులు ఉల్లంఘించారని వర్షా దేశ్‌పాండే అనే న్యాయవాది కోర్టులో గురువారం ఈ ఫిర్యాదు చేశారు. తన ఆరోపణలపై బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోవడం వల్లే కోర్టును ఆశ్రయించినట్లు దేశ్‌పాండే పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపడతామని సెప్టెంబర్ 12న చేపడతామని కోర్టు తెలిపింది. దీనిపై స్పందన తెలపాలంటూ షారుఖ్ దంపతులతోపాటు మున్సిపల్ అధికారులకు నోటీసులు జారీ చేసింది.