మాలేగావ్ కేసులో ఎనిమిదిమందికి విముక్తి
న్యూఢిల్లీ : మాలేగావ్ పేలుళ్ల కేసులో ఎనిమిదిమంది నిందితులను ముంబై ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా తేల్చింది. వారిని తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. 2008 సెప్టెంబర్ 8న మాలేగావ్‌లో ఒక ప్రార్థనా స్థలంలో జరిగిన బాంబు పేలుడులో 37 మంది మృతి చెందగా సుమారు 160 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉగ్రవాద వ్యతిరేక విభాగం (ఏటీఎస్) జరిపిన దర్యాప్తు నేపథ్యం లో తొమ్మిది మంది ముస్లిం యువకులను అనుమానితులుగా అరెస్టు చేశారు. వీరిలో ఒకరు మృతి చెందారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వీళ్లంతా గత అయిదేళ్లుగా జైలు జీవితం గడుపుతున్నారు.