డేవిడ్ హాడ్లీకిముంబై కోర్టు సమన్లు | 26/11 case: Mumbai court issues summons to Headley | Sakshi
Sakshi News home page

డేవిడ్ హాడ్లీకి ముంబై కోర్టు సమన్లు

Published Wed, Nov 18 2015 3:54 PM | Last Updated on Sun, Sep 3 2017 12:40 PM

26/11 case: Mumbai court issues summons to Headley

ముంబై: 26/11 దాడి కేసులో పాకిస్థాన్-అమెరికన్ లష్కరే తోయిబా తీవ్రవాది డేవిడ్ హాడ్లీను నిందితుడిగా చేర్చేందుకు ప్రత్యేక టాడా కోర్టు అంగీకరించింది. అతడికి సమన్లు జారీ చేసింది. డిసెంబర్ 10న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రశ్నించేందుకు పోలీసులకు అనుమతినిచ్చింది.

ప్రస్తుతం అతడు అమెరికా జైలులో ఉన్నాడు. ఈ కేసులో హాడ్లీ నిందితుడిగా చేర్చాలని ముంబై పోలీసులు అక్టోబర్ 8న పిటిషన్ దాఖలు చేశారు. అమెరికా జైలులో ఉన్నప్పటికీ హాడ్లీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించేందుకు ఎటువంటి అడ్డంకులు ఎదురుకాబోవని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఉజ్వల్ నికమ్ తెలిపారు. అతడికి అమెరికా కోర్టు 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement