
ముంబై: మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఇప్పటికే వేరే కేసులో జైలులో ఉన్నందున, ధిక్కరణ కేసులో విచారణ చేపట్టడం కుదరదని ముంబై హైకోర్టు తెలిపింది. ఎన్‌సీబీ మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తండ్రి ధ్యాన్‌దేవ్ వాంఖడే వేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిగింది. కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తూ నవాబ్ మాలిక్ తమ కుటుంబంపై అనేక వ్యాఖ్యలు చేశారంటూ ధ్యాన్‌దేవ్ పిటిషన్ వేశారు. నవాబ్ మాలిక్ కస్టడీ గడువు ఈ నెల 3వ తేదీ వరకు ఉన్నట్లు లాయర్ ఫెరోజ్ బరూచా తెలిపారు. దీంతో, న్యాయస్థానం మాలిక్‌కు ధిక్కరణ కేసులో నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈనెల 7వ తేదీకి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment